Latest Updates
-
ఇడ్లీ, దోసెల్లోకి అమృతం లాంటి టమాటో పల్లీ చట్నీ..ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది! -
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. కటాఫ్ మార్కులు చూస్తే షాక్ అవ్వాల్సిందేనా? -
ఈ వీకెండ్ మురాదాబాదీ చికెన్ పులావ్ రుచి చూడండి.. ఫిదా అవ్వాల్సిందే! -
ప్రీ డయాబెటిస్: ఇంకా షుగర్ రాలేదులే అని లైట్ తీసుకుంటున్నారా? శరీరంలో అసలేం జరుగుతుందో తెలుసా? -
కెమికల్ మామిడి పండ్లను తింటున్నారా? అసలైన పండ్లను గుర్తించడం ఇలా! -
ఇంట్లోనే స్వచ్ఛమైన చాట్ మసాలా ..ఒక్కసారి చేసి పెట్టుకుంటే 8 నెలల పాటు నిల్వ! -
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటున్నారా? ఈ ముహూర్తాలు తెలిస్తే అదృష్టం మీదే! -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ధనయోగం..! - శనివారం, 18 ఏప్రిల్ 2026 -
ఎండల వేళ పెళ్లి వేడుకలు.. అతిథుల ఆరోగ్యం కోసం ఈ జాగ్రత్తలు! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి
వర్షంలో వేడి వేడిగా టమోటో కోకోనట్ సూప్
ఇండియన్ ట్రెడిషినల్ రిసిపి టమోటో కోకోనట్ సూప్. ఈ టమోటో కోకోనట్ సూప్ రుచిగా ఉండటమే కాదు, ఇందులో బెనిఫిషియల్ ఫ్యాట్ మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు వర్షాకాలంలో వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కోల్డ్, కఫ్, జ్వరం వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడుతుంది.
వర్షకాలంలో వేడి వేడిగా ఈ సూప్ భలే మజా ఇస్తుంది. ఈ సూప్ ను ఏ వేళలో( బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్) అయినా సరే తీసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అమితంగా ఇష్టపడే ఈ టమోటో కోకోనట్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
టమాటా పురీ: 1 1/2cup
కొబ్బరి: పావు చెక్క
ఆవాలు:1/2tsp
పంచదార: 2tsp
పచ్చిమిర్చి: 2
ఇంగువ: చిటికెడు
నూనె: 2tsp
కరివేపాకు, ఉప్పు: రుచికి తగినంత
తయారి విధానం:
1. ముందుగా పాన్ లో రెండు స్పూన్ల నూనె వేసి, కాస్త కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి.
2. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్సేపు వేయించి, చిటికెడు ఇంగువ వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు అందులోనే టమాటా పురీ, అతిచిన్నచిన్న ముక్కలుగా తరిగిపెట్టుకున్న కొబ్బరి ముక్కలు, రెండు కప్పుల నీళ్లు వేసి, సన్నటి సెగన, మూతపెట్టి మరగనివ్వాలి. మధ్యమధ్యలో కలపడం మరిచిపోవద్దు.
4. మిశ్రమం కొంచెం దగ్గరయిన తరువాత, మంట మీద నుంచి తీసి, బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తరువాత పంచదార, ఉప్పు వేసి, బాగా గిలక్కొట్టాలి. ఆ తరువాత సన్నటి సెగన కొద్దిసెకెండ్ల పాటు వేడిచేసి, సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications












