Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
వెజిటేరియన్ హలీమ్ రిసిపి: రంజాన్ స్పెషల్
హలీం : రంజాన్ నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నం(జియోగ్రాఫికల్ ఇండికేటర్) ని సొంతం చేసుకొంది.
హలీం : రంజాన్ నెలలో దర్శనమిచ్చే వంటకం హలీం. ఉపావాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా కొనుక్కుని తింటారు. దీనిని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే. రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీమ్ ద్వారా శరీరంలో కొంత మేరకు శక్తిని పొందగలుగుతారు. హైదరాబాదీ హలీం భౌగోళిక చిహ్నం(జియోగ్రాఫికల్ ఇండికేటర్) ని సొంతం చేసుకొంది.హలీమ్ లో నాన్ వెజ్ మాత్రమే కాదు, వెజిటేబుల్స్ తో కూడా తయారుచేసుకోవచ్చు. అదే రుచి, అద్భుతమైన రుచికలిగిన వెజిటేరియన్ హాలీమ్ రిసిపి రెడీ.

కావలసినపదార్థాలు:
క్యారట్ తరుగు: 1/2cup
బీట్ రూట్ తరుగు: 1/2cup
బీన్స్ తరుగు: 1/2cup
బంగాళదుంప ముక్కలు :1/2cup
బఠాణీలు :1/2cup
పచ్చి మిర్చి తరుగు : 2tsp
గోధుమరవ్వ: 1/2kg
నెయ్యి : 200grm
జీడిపప్పు పలుకులు: 1/2cup
పిస్తా పప్పు: 1/2cup
బాదం పలుకులు : 1/2cup
మిరియాలు: 1tsp
ఏలకులు: 4
పసుపు :2 tsp
ఉప్పు: తగినంత
పుదీనా ఆకులు : 1/2cup
నిమ్మ చెక్కలు: 4
పాలు : 1/2cup
అరటిపండు : 1 (చిన్న చిన్న ముక్కలుగా తరగాలి)

తయారుచేయు విధానం:
1. ముందుగా కూరగాయ ముక్కలకు తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, నీళ్లను తీసి పక్కన ఉంచాలి.
2. తర్వాత పాన్ లో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత అందులో ఉల్లితరుగు వేసి వేయించాలి . మందపాటి గిన్నెలో సగం నెయ్యి వేసి ఏలకులు, మిరియాలు, ఉడికించిన కూరగాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి .
4. ఇప్పుడు పసుపు, గోధుమరవ్వ వేసి పది నిమిషాలు వేయించాలి. కూరగాయలు ఉడికించిన నీళ్లు, ఉప్పు వేసి అరగంట సేపు ఉడికించి, ముక్కలను పప్పు గుత్తితో మెదపాలి.
5. తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు, అరటిపండు ముక్కలు జత చేయాలి.
6. తర్వాత నిమ్మ రసం కలపాలి . వేయించిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మచెక్కలతో అలంకరించి వేడివేడిగా అందించాలి.



Click it and Unblock the Notifications