నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్‌ స్టైల్‌ మజ్జిగ పులుసు.!

కీరదోసకాయను ఎప్పుడూ సలాడ్‌లాగే తీసుకుంటే బోర్‌ కొడుతుంది కదా. లంచ్‌లో లేదా సాయంత్రం సలాడ్‌లా మాదిరిగా కాకుండా వీటితో ఇప్పుడు రుచికరమైన మజ్జిగ పులుసు కూడా చేసుకోవచ్చు. ఈ కీరదోసకాయ మజ్జిగ పులుసుతో ఒక్క ముద్ద తింటే చాలు.. తర్వాత ఇక ఎన్ని ముద్దలు తింటారో కూడా గుర్తుండదు. అంత రుచిగా ఉంటుంది. టేస్టీగా ఉండటమే కాదు కడుపులో పడగానే చల్లగా ఉండటంతో పాటు శరీరానికి చలువ చేస్తుంది. ఈ కీరదోసకాయ మజ్జిగ పులుసును ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

Village-style cucumber buttermilk pulusu for better digestion and coolness for stomach

కీర దోసకాయ మజ్జిగ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు

కీరదోస కాయలు- ఐదు
పెరుగు- అర లీటర్‌
కొబ్బరికాయ- ఒకటి
మిరియాలు- టీస్పూన్‌
వెల్లుల్లి రెబ్బలు- పది
జీలకర్ర- టీస్పూన్‌
పచ్చిమిర్చి- పది
కొత్తిమీర- గుప్పెడు
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఎండు మిర్చి- నాలుగు
కరివేపాకు- నాలుగు రెబ్బలు

కీరదోసకాయ మజ్జిగ పులుసు తయారీ విధానం

మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.!

ముందుగా కొబ్బరికాయను పగలకొట్టి కొబ్బరిని తురుముకోవాలి. అదేవిధంగా కీరదోసకాయ తొక్క తీసి లోపలున్న గింజలను శుభ్రంగా తీసేసి వీలైనంత చిన్నగా కట్‌ చేసుకోవాలి.

ఇప్పుడు రోట్లో మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చిని వేసి నూరుకోవాలి. రోలు లేకపోతే ఈ ప్రాసెస్‌ మిక్సీలో చేసుకోవచ్చు.

Village-style cucumber buttermilk pulusu for better digestion and coolness for stomach

ఈ దంచిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుని రోట్లో కొబ్బరి వేసి వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని పక్కనపెట్టి, తర్వాత కీరదోసకాయ ముక్కలను వేసి దంచుకోవాలి. ఈ ముక్కలను దంచుతున్నప్పుడు మధ్యమధ్యలో కొబ్బరి మిశ్రమం, కొత్తిమీర కూడా వేసి రుబ్బుకోవాలి.

ఇలాగే అంతా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని అందులో నూరిపెట్టుకున్న మిరియాల మిశ్రమం వేసి కలపాలి.

కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..

ఇప్పుడు పెరుగును బాగా చిలికి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. మీకు కావాల్సిన రీతిలో నీళ్లు పోసుకుని బాగా కలపండి.

స్టవ్‌పైన తాలింపు పాన్‌ పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. అంతే టేస్టీ కీరదోసకాయ మజ్జిగ పులుసు రెడీ.

ఈ కీరదోసకాయ మజ్జిగ పులుసును అప్పడాలు లేదా వడియాలతో తింటే ఆ రుచికి స్వర్గం కనపడాల్సిందే. ఇంట్లో కూరలు ఉన్నా లేకపోయినా మొత్తం దీనితోనే తినేంత రుచిగా ఉంటుంది.

కీరదోసకాయను కేవలం బ్యూటీ కోసమే కాకుండా మెరుగైన జీర్ణక్రియకు దోహదపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. యాక్టివ్‌గా, హెల్తీగా ఉండేలా చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 18, 2026, 15:29 [IST]
Desktop Bottom Promotion