Latest Updates
-
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే..
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి..
గుడ్లతో రొటీన్ వంటలు తిని బోర్ కొట్టిందా? సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే వంటకం తెగ ట్రెండ్ అవుతోంది.. అదే వైరల్ చిల్లీ ఎగ్స్. ఇది స్పైసీగా, జ్యూసీగా ఉంటూ ఎంతో అద్భుతమైన రుచిని ఇస్తుంది. చల్లటి వాతావరణంలో వేడివేడిగా బ్రెడ్, రోటీ లేదా అన్నంతో కలిపి తింటే ఆ మజాయే వేరు. వైరల్ చిల్లీ ఎగ్స్ రెసిపిని మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

చిల్లీ ఎగ్స్ తయారీకి కావలసిన పదార్థాలు
గుడ్లు - 4
నూనె - 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన అల్లం - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 లేదా 3
ఉప్పు -తగినంత
చిన్న క్యాప్సికం - 1
చికెన్ బ్రోత్ పౌడర్ - కొద్దిగా
డార్క్ సోయా సాస్ - 1 టేబుల్ స్పూన్
రెడ్ చిల్లీ సాస్ - 1 టేబుల్ స్పూన్
టొమాటో కెచప్ - 1 టేబుల్ స్పూన్
నీళ్లు - పావు కప్పు
కార్న్‌ఫ్లోర్ మిశ్రమం - అర టీస్పూన్ కార్న్
ఫ్లోర్ లో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపాలి
వైరల్ చిల్లీ ఎగ్స్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి మీడియం మంటపై వేడి చేయండి.
-నూనె వేడెక్కాక అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించండి. అవి నల్లగా మాడితే ఫ్లేవర్ పాడవుతుంది.
-ఇప్పుడు అందులో క్యాప్సికం ముక్కలు, ఉప్పు వేసి 2-3 నిమిషాల పాటు వేయించండి. క్యాప్సికం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా క్రంచీగా ఉంటేనే రుచిగా ఉంటుంది.
-ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకుని.. అందులో డార్క్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, నీళ్లు పోసి బాగా కలపండి. ఈ సాస్ మిశ్రమాన్ని పాన్ లో పోసి, సన్నని మంటపై నెమ్మదిగా ఉడకనివ్వండి.
-గ్రేవీ చిక్కగా, నిగనిగలాడుతూ ఉండాలనుకుంటే ముందుగా సిద్ధం చేసుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో కలపండి.
-ఇప్పుడు పాన్ లో ఉడుకుతున్న సాస్ మిశ్రమంలో నాలుగు గుడ్లను జాగ్రత్తగా పచ్చసొన చెదరకుండా పగలగొట్టి వేయండి. గుడ్లను పగలగొట్టేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా, సమానమైన గ్యాప్ ఇచ్చి వేస్తే పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి.
-గుడ్లు వేసిన తర్వాత గరిటెతో అస్సలు కలపకూడదు.గుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత మంట ఎప్పుడూ తక్కువగానే ఉండాలి. మంట ఎక్కువైతే గుడ్లు రబ్బరులా గట్టిపడతాయి.
-పాన్ పై మూతపెట్టి గుడ్లు మీకు నచ్చిన విధంగా హాఫ్ బాయిల్ లేదా ఫుల్ బాయిల్ ఉడికే వరకు తక్కువ మంట మీద ఉంచండి.
-అంతే ఎంతో రుచికరమైన వేడివేడి చిల్లీ ఎగ్స్ రెడీ. వంటకం పూర్తయ్యాక పైన కొద్దిగా చిల్లీ ఆయిల్ లేదా నువ్వుల నూనె వేస్తే ఆ సువాసన అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications