100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి!

Posted By:

ఏ రోగం లేకుండా జపానోళ్లలా 100 ఏళ్లు బతకాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం తినే ఆహారం కల్తీ, పీల్చే గాలి కలుషితం అవుతున్న ఈ రోజుల్లో 100 ఏళ్లు బతకడం అటుంచితే..70 ఏళ్లు బతికితేనే గొప్ప అని అనుకునే స్థాయికి ప్రజలు వచ్చేస్తున్నారు. అయితే సరైన ఫుడ్ తీసుకుంటే నూరేళ్లు ఆరోగ్యం జీవించడం సాధ్యమే. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవాలి.

సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. మీ దినచర్యలో తొలి అడుగు సరైన బ్రేక్ ఫాస్ట్ తోనే మొదలుపెట్టాలి. మీ ఉదయాన్ని ఆరోగ్యవంతంగా మార్చే ఒక సులభమైన బ్రేక్‌ ఫాస్ట్.. మ్యాజిక్ ఓట్స్ రెసిపి. దీని కోసం మీరు ఉదయాన్నే హడావిడి పడాల్సిన పనేలేదు, ముందు రోజు రాత్రి చిన్నపాటి ఏర్పాట్లు చేసుకుంటే చాలు.

Want to Live Up to 100 Try This Healthy Magic Oats Breakfast Recipe in Telugu

మ్యాజిక్ ఓట్స్ రెసిపీ తయారీ విధానం

-రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో కొద్దిగా స్టీల్ కట్ ఓట్స్ తీసుకుని నీటిలో నానబెట్టండి. అందులోనే 2 టీస్పూన్ల చియా సీడ్స్ కలపండి.

-ఉదయం లేచిన తర్వాత ఆ మిశ్రమానికి 3-4 టీస్పూన్ల సోయా పాలు, 2 టీస్పూన్ల ప్రోటీన్ అధికంగా ఉండే గ్రీక్ యోగర్ట్ లేదా మామూలు పెరుగు జతచేయండి. దీనికి అద్భుతమైన రుచి, సువాసన రావడానికి అర టీస్పూన్ దాల్చినచెక్క పొడిని చల్లి, అన్నీ బాగా కలుపుకుని తినండి.

మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..

ప్రయోజనాలు
వారంలో 4-5 రోజులు ఈ బ్రేక్‌ ఫాస్ట్ తీసుకుంటే మీ శరీరంలో అద్భుతమైన మార్పు చూస్తారు. ఇందులో ఫైబర్, ప్రోటీన్ మెండుగా ఉంటాయి. ఇది తక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం కాబట్టి.. ఉదయం తింటే మధ్యాహ్నం వరకు కడుపు నిండిన భావన కలుగుతుంది. అనవసరమైన ఆకలి వేయదు. దీనిని మరింత పోషకభరితంగా మార్చుకోవడానికి రాత్రి నానబెట్టిన బాదం, వాల్‌ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్‌ ను పైన చల్లుకుని తినవచ్చు.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 23, 2026, 11:43 [IST]
Desktop Bottom Promotion