Latest Updates
-
బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పరోటా ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొద్దున్నే 9 గంటలలోపు ఈ 5 పనులు చేస్తే.. మీ ఆయుష్షు 20 ఏళ్లు పెరుగుతుంది! -
శరీరంలో చెత్త మొత్తాన్ని తొలగించి, లివర్ ని శుభ్రపర్చే టీ ..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక -
అందమైన అమ్మాయి పిలిచిందని వెళ్తే..యువకుడికి ఊహించని షాక్! -
విటమిన్ A, C, K, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ కూర తింటే చలికాలంలో రోగాలన్నీ పరార్! -
బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రవ్వ బన్ అప్పం.. తింటే వదలరు..10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
కీళ్ల నొప్పులు మాయం చేసే 1:4 మ్యాజిక్..ఇలా చేస్తే జీవితంలో మోకాళ్ల నొప్పులు రావు! -
చలికాలంలో ఎముకలను దృఢంగా ఉంచే రాగి మునగాకు రోటీ..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
టపాసుల నిప్పురవ్వలు పడి చర్మం కాలితే వెంటనే చేయాల్సిన, చేయకూడని పనులివే!
చలికాలం స్పెషల్ రోగనిరోధక శక్తిని పెంచే ప్రొటీన్ రిచ్ పెసరపప్పు సూప్..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్
చలికాలం సాయంత్రం వేళ, చలికి వణుకుతున్నప్పుడు వేడివేడిగా ఏదైనా తాగితే ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేం. అయితే కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఏదైనా కావాలనుకుంటే పెసరపప్పు (పొట్టు పెసల) సూప్ మీకు బెస్ట్ ఆప్షన్. కడుపుకు ఎంతో తేలికగా ఉండే ఈ సూప్ లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. అల్లం, వెల్లుల్లి, మిరియాల ఘాటు తోడైతే ఈ సూప్ చలిని తరిమికొట్టి శరీరానికి వెచ్చదనాన్నిస్తుంది. ఈ రుచికరమైన సూప్‌ను సులభంగా ఎలా తయారు చేయాలో చూడండి.
కావాల్సిన పదార్థాలు
పచ్చి పెసలు (పొట్టు పెసలు) - అర కప్పు
నీళ్లు - 3 కప్పులు
ఉల్లిపాయ - 1
అల్లం - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు -8
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
-ముందుగా పెసలను శుభ్రంగా కడిగి కనీసం 4-6 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత నీటిని వంపేసి, ప్రెషర్ కుక్కర్ లో పెసలను వేసి రెండున్నర కప్పుల నీళ్లు పోయండి. మూడు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక చెంచా నెయ్యి లేదా నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఆ గుమగుమల మధ్యలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. తర్వాత పసుపు, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
చలికాలంలో దగ్గు, జలుబు మాయం చేసే సూప్ ఇదే..ఇడ్లీతో ముంచుకుని తిన్నా కేక
-ఈ తాలింపులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసలను వాటి నీటితో సహా వేయండి. సూప్ మంచి క్రీమీ టెక్స్చర్ రావడానికి గరిటెతో పెసలను కొద్దిగా స్మాష్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఓ 5 నిమిషాల పాటు తక్కువ మంట మీద మరగనివ్వండి. సూప్ మరీ చిక్కగా అనిపిస్తే కాస్త వేడినీళ్లు కలుపుకోవచ్చు. మీకు సూప్ చిక్కగా కావాలా, పల్చగా కావాలా అనేదాన్ని బట్టి వేడి నీళ్లను కలుపుకోండి.
-చివరగా స్టవ్ ఆపేసి, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే..నోరూరించే వేడి వేడి పెసరపప్పు సూప్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
