Latest Updates
-
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.!
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు..
కాకరకాయ పేరు వింటే చాలు చాలామంది మొఖం పక్కకు తిప్పేసుకుంటారు.అయితే సరైన రీతిలో చేస్తే కాకరకాయను మించిన టేస్టీ కూరగాయ మరొకటి ఉండదు. కాకరకాయతో మీరు ఇప్పటివరకు ఫ్రై, పులుసు, కారం వంటి వంటకాలను మాత్రమే చూసి ఉంటారు. కానీ మీరెప్పుడైనా కారకాయ ఫ్రైస్ టేస్ట్ చేశారా?
ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కరకరలాడుతూ ఉండే ఈ స్నాక్ ను ఒక్కసారి టేస్ట్ చేశారంటే..దీనికి బానిసలైపోతారు.మళ్లీ మళ్లీ ఇదే చేసిపెట్టాలని ఇంట్లో అడుగడం ఖాయం. ఇది ఆరోగ్యానికి మేలు చేసేదే. మీ ఇంట్లోనే చాలా ఈజీగా క్రిస్పీ కాకరకాయ ఫ్రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కాకరకాయ ఫ్రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-కాకరకాయలు
-ఉప్పు -రుచికి సరిపడా
-పసుపు - చిటికెడు
-శెనగపిండి - సరిపడా
-వాము - కొద్దిగా
-ఇంగువ - చిటికెడు
-కారం - తగినంత
-నీళ్లు - బ్యాటర్ కలుపుకోవడానికి
-బ్రెడ్ క్రంబ్స్ (రొట్టె పొడి)
-నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే..
కాకరకాయ ఫ్రైస్ తయారీ విధానం
-ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి, నిలువుగా సగానికి కోయాలి. లోపల ఉండే గింజలను పూర్తిగా తీసేసి, వాటిని పొడవాటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆకారంలో కట్ చేసుకోవాలి.
-ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను వేసి సగం ఉడికే వరకు (హాఫ్ బాయిల్) ఉంచాలి. తర్వాత నీరు లేకుండా వడకట్టాలి. ఇలా చేయడం వల్ల చేదు పోతుంది.
-ఒక బౌల్ తీసుకుని అందులో శెనగపిండి, వాము, కొద్దిగా ఇంగువ, కారం, ఉప్పు వేసి కలపాలి. ఇందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని పలుచగా (బ్యాటర్ లాగా) కలుపుకోవాలి. ఉడకబెట్టిన కాకరకాయ ముక్కలను ఈ శెనగపిండి మిశ్రమంలో వేసి బాగా కోట్ చేయాలి.
-ఇప్పుడు ఒక్కో కాకరకాయ ముక్కను తీసుకుని, బ్రెడ్ క్రంబ్స్ లో వేసి అటూ ఇటూ తిప్పుతూ బాగా దొర్లించాలి. దీనివల్ల ఫ్రైస్ ఎక్స్ ట్రా క్రిస్పీగా వస్తాయి.
-కడాయిలో నూనె వేడి చేసి, మంటను మీడియంలో ఉంచి, ఈ కాకరకాయ ముక్కలను వేసి బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే కాకరకాయ ఫ్రైస్ రెడీ. మీకు ఇష్టమైన టొమాటో కెచప్ లేదా చట్నీతో వేడివేడిగా లాగించేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
