Latest Updates
-
గర్భిణీలు ఎండల వేళ ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం ఇప్పుడే తెలుసుకోండి -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరమా? సుప్రీంకోర్టు తీర్పుతో జంటలకు ఊరట! -
పెరుగన్నంలోకి ఈ కరకరలాడే బంగాళదుంప ఫ్రై ఉంటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చరు! -
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం!
కరకరలాడే కాకరకాయ కాజు ఫ్రై..ఒక్కసారి వండితే రుచి మర్చిపోలేరు..అన్నం, పప్పు, రసంలోకి కేక!
ఆరోగ్యానికి అమృతం లాంటి కూరగాయల్లో కాకరకాయ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో ఎన్నో అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. కానీ ఆ చేదు అనే ఒక్క కారణంతో పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది దీనిని తినడానికి ఏమాత్రం ఆసక్తి చూపించరు. అలాంటి వారు కూడా లొట్టలేసుకుంటూ, మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ తినేలా చేసే ఓ అద్భుతమైన వంటకమే కాకరకాయ కాజు ఫ్రై.
దీన్ని వారం రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి లేదా పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్ గా ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది.
కాకరకాయ కాజు ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
ధనియాలు - ఒకటిన్నర టీస్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 8
ఎండుమిర్చి - 2
పచ్చి కొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కాకరకాయలు -250 గ్రాములు
పసుపు - 1 టీస్పూన్
నూనె - 4 టేబుల్ స్పూన్లు
మినప్పప్పు - అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6
జీలకర్ర - అర టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
జీడిపప్పు - ఓ గుప్పెడు
కరివేపాకు - 2 రెమ్మలు
కారం, ఉప్పు - మీ రుచికి తగినంత
కాకారకాయ కాజు ఫ్రై తయారీ విధానం
-కాకరకాయలను శుభ్రంగా కడిగి, పొడి క్లాత్ తో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత అంచులు కట్ చేసి, పల్చగా రౌండ్ ముక్కలుగా కోసుకోవాలి.
-కట్ చేసిన కాకరకాయ ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూతపెట్టాలి. అరగంట పాటు పక్కన వదిలేస్తే కాకరకాయలోని చేదు నీరు బయటకు వస్తుంది. ఆ నీటిని పారబోసి, ముక్కలను శుభ్రమైన నీటితో కడిగాక చేత్తో గట్టిగా పిండుతూ నీరంతా పోయేలా చేసి మరో గిన్నెలోకి తీసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి అందులో కాకరకాయ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, కరకరలాడే వరకు వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ముక్కలు వేగే లోపు మిక్సీ జార్ లో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-కాకరకాయలు వేయించిన అదే నూనెలో వెల్లుల్లి రెబ్బలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, గుప్పెడు జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. జీడిపప్పు రంగు మారుతున్నప్పుడు కరివేపాకు, కొద్దిగా పసుపు వేయాలి.
-ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి మసాలా వేసి పచ్చి వాసన పోయేలా రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి.
-చివరగా సరిపడా ఉప్పు, కారం వేసి మంటను పూర్తిగా సిమ్ లో ఉంచి మరో 5 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి. అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ కాజు ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












