Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
మరో మహిళా నక్షత్రం ‘అరుంధతి రాయ్’!

బాల్యమంతా కేరళలోని అయమానం లో గడిచింది.తమిళనాడు లోని నీలగిరిలో వున్న లవ్ డేల్ లారెన్స్ స్కూలులో ప్రాధమిక విద్యాభ్యాసం చేసింది. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఆర్కిటెక్చర్ చేసింది. ఇక్కడే తన మొదటి భర్త గెరార్డ్ డా కున్హాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. రాయ్ రెండవ భర్త పేరొందిన సినీ నిర్మాత ప్రదీప్ క్రిషన్. అతని అవార్గు పొందిన చిత్రంలో ఆమె నటించింది. ఆమె టెలివిజన్ లో పనిచేస్తూనే కొన్ని సినిమాలలో కూడా నటించింది. 1994 లో ఫూలన్ దేవి నటించిన శేఖర్ కపూర్ చిత్రం బండిట్ క్వీన్ ను విమర్శించడంతో ఆమె వార్తల కెక్కింది. ఆమె మొదటి నవల గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ 1992 లో మొదలుపెట్టబడి 1996లో పూర్తయింది. ఇందులో చాలా భాగం ఆమె బాల్య జీవితం ప్రతిబింబిస్తుంది.
ఆమె వ్రాసిన ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్ ఆమెకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టింది. దానికి 1997 బుకర్ ప్రైజ్ వచి్చింది. ఈ పుస్తకం వాణిజ్య పరంగా కూడా బాగా అమ్ముడుపోయింది. ప్రచురణకు ముందు అడ్వాన్సుగా ఆమె సుమారు అర్ధ మిలియన్ పౌండ్లు పొందింది. సుమారు 18 దేశాలలో ఈమె పుస్తకం అమ్మకం జరిగింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలకుగాను ఆమె తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆమె పుస్తకం విజయవంతం కావడంతో తర్వాతి రోజులలో ఆమె టి.వి. రచయితగా రచనలు మొదలుపెట్టింది. అరుంధతి రాయ్, వుయ్ ఆర్ ఒన్, సెలిబ్రేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ మొదలైన సమాజపర అంశాలతో మంచి రచనలు చేసి ఖ్యాతి గడించింది.
అరుంధతి రాయ్ మేధా పట్కర్ తో కలసి నర్మదా బచావ్ ఆందోళనలో పాల్గొంది. తనకు వచ్చిన బుకర్ ప్రైజ్ మనీ, ఇతర రాయల్టీలను నర్మదా బచావ్ ఆందోళన వ్యయంగా ఖర్చు చేసింది.



Click it and Unblock the Notifications