Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
గుండెకి మేలు, ఎముకలకి బలం.. ఇంకా ఎన్నో.. రోజూ మెట్లు ఎక్కితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ఆరోగ్యంపై వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకోవడానికి సమయం దొరకడం లేదు. అందుకే వ్యాయామం, నడక, యోగాను వీలు దొరికినప్పుడు మాత్రమే చేయగలుగుతున్నారు. ప్రతిరోజూ ఎక్స్‌ర్‌సైజ్ చేయడానికి కుదరడం లేదు. అయితే ఇది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో మీ రోజువారీ పనుల్లోనే మీరు వ్యాయామం చేసుకోవచ్చు. అదే మెట్లు ఎక్కడం. ఈ పనిని మీరు రోజూ చేసినట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

రోజూ కొన్ని మెట్లు ఎక్కడం ద్వారా శరీరానికి సులభమైన వ్యాయామం జరిగి ఆరోగ్యకరంగా, ఉత్తేజంగా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం జిమ్ లాంటి వాతావరణం అవసరం లేదు. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, ఆఫీసుకు వెళ్తున్నప్పుడు ఈ పనిని సులభంగా చేయవచ్చు. మీ జీవనశైలి చురుగ్గా ఉండేందుకు మెట్లు ఎక్కడం దోహదపడుతుంది.
గుండెకి మేలు..
ప్రతిరోజూ కాసేపు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకున్నట్లయితే గుండెకి మంచి వ్యాయామంలా పనిచేస్తుందని హెల్త్ ఎక్స్‌పర్స్ అంటున్నారు. మెట్లు ఎక్కడం ద్వారా గుండె రక్తాన్ని మెరుగ్గా పంపింగ్ చేస్తుంది. దీని వల్ల గుండె పనితీరు మెరుగవడమే కాదు.. శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రోజువారీ శారీరక శ్రమకి మెట్లు ఎక్కడం ఉత్తమంగా పనిచేస్తుంది.
కండరాలు బలోపేతం..
మెట్లు ఎక్కడం ఎక్కువగా కాళ్లపైనే ప్రభావం చూపిస్తుంది. అయితే మెట్లు ఎక్కుతుంటే కాళ్లు నొప్పులుగా ఉంటాయని అనుకుంటారు. కానీ అది తప్పు.. స్టెప్స్ ఎక్కడం వల్ల తొడలు, పిక్కలు, తుంటి, వంటి వాటితో పాటు ఇతర కండరాల్లో కదలిక మొదలై ఉత్తేజితమవుతాయి. ఇలా రెగ్యులర్‌గా చేయడం ద్వారా కాళ్లలో బలం పెరుగుతుంది. శరీర దిగువ భాగానికి మెట్లు ఎక్కడం మంచి ఎక్సర్‌సైజ్‌గా నిపుణులు సూచిస్తున్నారు.

కేలరీల ఖర్చు..
నడకతో పోలిస్తే మెట్లు ఎక్కడం ద్వారా కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఎక్కువ శ్రమ తీసుకోవడం ద్వారా శక్తి ఎక్కువ తీసుకుంటుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ కూడా మెల్లగా కరిగిపోతుంది. రోజూ మీ డైట్‌లో సరైన మోతాదులో పోషకాహారం తీసుకోవడంతో పాటు ఇలా మెట్లు ఎక్కడం చేయడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది.
ఫిజినల్ ఫిట్‌నెస్
మెట్లు ఎక్కడం ద్వారా గుండె, ఊపిరితిత్తులు ఉత్తేజితం కావడంతో శక్తి పెరుగుతుంది. దీంతో ఓర్పు కూడా పెరిగి ఇంటి పనులు చేసేటప్పుడు అలసట తగ్గిపోయి ఉత్సాహంగా ఉండగలరు. అంతేకాకుండా ఎముకలను బలంగా, చురుగ్గా ఉంచుతుంది. ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎవరు చేయకూడదు..
అయితే మెట్లు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మోకాళ్ల నొప్పులు తీవ్రంగా ఉన్నవాళ్లు, కీళ్ల వాతం, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత సమస్యలు, తల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల సలహా తీసుకోవాలి. సర్జరీ జరిగి ఉన్నవారు సైతం మెట్లు ఎక్కాలా వద్దా అనేది వైద్యుల సూచన మేరకు పాటించాలి.
ఇవి గుర్తుంచుకోండి.
మెట్లు ఎక్కేటప్పుడు ఒకేసారి వేగంగా ఎక్కకూడదు. ముందుగా నెమ్మదిగా ప్రారంభించి మీ శక్తిని బట్టి వేగంగా చేయాలి. సౌకర్యవంతమైన దుస్తులు, బూట్లు వేసుకుని మెట్లు ఎక్కాలి. ఈ క్రమంలో ఛాతీ నొప్పి, ఆయాసం, కళ్లు తిరగడం వంటివి అనిపిస్తే అక్కడితో ఆపేసి వైద్యుల సలహా తీసుకోవాలి. మధ్యమధ్యలో విరామం తీసుకోవడం మంచిది. పుష్కలంగా నీరు తాగుతూ ఉండటం ద్వారా శక్తిని కోల్పోకుండా ఉంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
