Latest Updates
-
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.!
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రతి చిన్న సమస్యకి మందులు వాడటం ఎంత ప్రమాదమో తెలుసా.?
కొంచెం తలనొప్పిగా అనిపించినా, నలతగా అనిపించినా ఆస్పత్రికి వెళ్లకుండా వెంటనే మెడికల్ షాపులో మందులు తెచ్చుకోవడం చాలా మందికి అలవాటైపోయింది. లేదంటే ఇంట్లోనే అత్యవసర మందులను సిద్ధంగా ఉంచుకుంటారు. ఊళ్లు, నగరాలు అనే తేడా లేకుండా ఇదే పద్ధతి పాటిస్తున్నారు. అయితే ఇదే అలవాటు కొనసాగితే అది ఆరోగ్యానికి ప్రమాదకరకమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, వైద్యుడిని సంప్రదించకుండా ప్రజలకు కొన్ని మందులు తీసుకునే అలవాటు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జలుబు, జ్వరం, తలనొప్పి, ఎసిడిటీ వంటి చిన్నపాటి సమస్యలకు మెడికల్ షాపులను ఆశ్రయిస్తుంటారు. అయితే దీర్ఘకాలికంగా ఇలాగే చిన్నపాటి ఆరోగ్య సమస్యలకు మందులు తీసుకోవడం కొనసాగిస్తే అది మున్ముందు తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనేక వ్యాధులకు కారణం కావచ్చని అంటున్నారు.
స్వీయ చికిత్స వద్దు
చిన్న చిన్న అనారోగ్య సమస్యలైనా వైద్యుడిని సంప్రదించకుండా స్వీయ చికిత్స తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మెడికల్ షాపులో ఫార్మాసిస్టు పాత్ర కేవలం మందులు అమ్మడం మాత్రమే కాదు. ఆ మందులు ఎలా తీసుకోవాలో అవగాహన కల్పించడం వారి బాధ్యత. వైద్యుల సూచన లేకుండా ఒకే రకమైన మందును పదేపదే తీసుకోకూడదు.
పెయిన్ కిల్లర్స్
వీటితో పాటు పెయిన్ కిల్లర్స్‌ను కూడా పదేపదే వాడుతుంటారు. ఈ మందులను ఎక్కువ కాలం తీసుకోవడం ద్వారా మూత్రపిండాలు, కాలేయం, జీర్ణాశయంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. ఇక యాంటీబయాటిక్‌లను సైతం వైద్యుల సూచన మేరకే తీసుకోవాలని వాటిని అసంపూర్తిగా ఉపయోగిస్తే భవిష్యత్తులో వాటి ప్రభావం తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.

అనారోగ్య సమస్యలకు తీసుకునే ప్రతి మందును సరైన మోతాదుతో పాటు రోజులో ఎప్పుడు తీసుకోవాలి, ఎంత వ్యవధిలో తీసుకోవాలనేది కీలకం. ఇది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరుగుతుంది. ప్రతి మెడిసిన్‌ను ఎప్పుడు, ఎలా తీసుకోవాలని సూచిస్తారు. కొన్ని మందులు భోజనానికి ముందు, మరికొన్ని భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరికొన్నిటిని ఇతర మందులతో కలిపి తీసుకోకూడదు. అందుకే ఒక ఆరోగ్య సమస్యకు మెడిసిన్ వాడే సమయంలో మరో అనారోగ్య సమస్య వస్తే సొంత సలహాతో తీసుకోవద్దని సూచిస్తున్నారు.
డోస్ ప్రభావం
కొన్ని తీవ్ర ఆరోగ్య సమస్యలకు డోస్, టైమింగ్, ప్రభావం తప్పనిసరిగా పాటించాలి. లేదంటే దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. కొన్ని మెడిసిన్స్, ఇంజెక్షన్స్ వంటివి ప్రత్యేక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే నిల్వ చేయాల్సి ఉంటుంది. అలాంటి సలహాలను వైద్యుల సలహా మేరకు ఫార్మాసిస్టులు రోగులకు వివరించగలరు.
ఇక, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాలు, కాలేయ వ్యాధి ఉన్నట్లయితే మందులు ఎంచుకునేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఒకసారి మీరు చిన్న ఆరోగ్య సమస్యలకు మందులు వాడాక అనారోగ్యం తిరగబడినట్లయితే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. అధికంగా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, నిరంతర వాంతులు, విరేచనాలు సమస్య వస్తే ఫార్మసీకి వెళ్లకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీని ద్వారా సరైన రోగి నిర్ధారణ, చికిత్స సాధ్యమవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
