Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ముట్టుకుంటే ముడుచుకుంటావ్...?

అయితే, తాజాగా మహిళ రతిక్రీడ వంటి చర్యలలోనే కాదు, కొద్దిపాటి స్ధాయిలో ఏ రకమైన సామాజిక సంఘటన నడిచినప్పటికి మహిళ ముఖ భాగం కొద్దిగా వేడెక్కుతుందని ఒక రీసెర్చి వెల్లడించింది. ఇంగ్లాండ్ లో ఫైఫ్ లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ లోని ఆమందా హేన్ ఆమె సహచరులు చేసిన ఒక స్టడీలో యుక్త వయసు మహిళల ముఖాలపై ఒక హీట్ సెన్సిటివ్ కెమెరాను ముఖాలలోని ఉష్ణోగ్రత మార్పులను కొలిచేందుకు మరో సాధనాన్ని ముఖాన్ని స్పర్శించేందుకు వినియోగించారు.
ఈ రకమైన హీట్ సెన్సార్ కెమెరా ఫోకస్ మరియు స్పర్శలు శరీరంలోని ఏ భాగంలో చేసినప్పటికి వారు అతిగా స్పందించలేదని, ముఖ భాగాల బుగ్గలు, స్తనాల ఎముకలు మాత్రం బాగా ఎరుపెక్కి స్పందించటం, వారి కండ్ల చుట్టూ టెంపరేచర్ పెరగడం, ముఖ భాగాలైన నోరు, ముక్కు సుమారుగా 0.2 నుండి0.5 డిగ్రీ సెంటీగ్రేడులు సగటున మరి కొన్ని ఇతర భాగాలలో ఒకడిగ్రీ పూర్తిగా వేడెక్కినట్లు కనుగొన్నారు. గతంలోని ఒక స్టడీలో ఈ భాగాలు, పురుషులలో లైంగిక పర ఉద్రేకం కలిగితే మార్పులు సంతరించుకొనేవని తేలింది. కాని మహిళలలో మాత్రం, ఏ మాత్రం సోషల్ ఇంటర్ యాక్షన్ పురుషులతో జరిగినా ప్రస్తుత ఫలితాలు కనపడుతున్నాయని రీసెర్చి తెలుపుతోంది.
అయితే, మహిళలుమాత్రం తమలో కామానికి సంబంధించిన అంగాలలో ఏ మార్పులు, భావనలు కలగటంలేదని కాని ముఖ భాగాలలో మాత్రం టెంపరేచర్ పెరగటం, అదికూడా ఎదుటగా వున్నది యువకుడైతే మరింత ప్రభావం కనపడటం జరుగిందని రీసెర్చిలో తెలిపారట. ఆశ్చర్యకర పరిణామమేమంటే, నేటి సామాజిక పరిస్ధితుల కారణంగా మహిళలో యువకులను చూస్తే వచ్చే ముఖ మార్పులు అంటే టెంపరేచర్, ఎరుపెక్కటం వంటివి పురుషులలో కామోద్రేకం కలిగే లక్షణాలకు సమానమైపోతున్నాయని సైంటిస్టులు చెపుతున్నారు.



Click it and Unblock the Notifications
