Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
జంటలు చేసుకునే అబద్ధపు వాగ్దానాలు?

‘నేను మరెవ్వరితో తిరగను.'...స్త్రీ, పురుషుల మధ్య ఇది మొట్టమొదటి వాగ్దానం. కాని దీనికి కట్టుబడి నడచుకొనేవారు అతి కొద్ది మంది మాత్రమే. పెళ్ళాం ఊరెళితే, పక్కింటి పాపతో మజాయే వేరు అనే రీతిలో నడచుకొనేవారు అధికంగా వున్నారు. కనుక వీరు చేసిన వాగ్దానం విఫలమైనట్లే. జంటలు లో కొంతమంది తమ భాగస్వామి వేరే పురుషుడితో లేదా స్త్రీతో స్నేహంగా మాట్లాడినప్పటికి సహించలేని భార్యలు, భర్తలు కూడా వుంటారు. అవును నాస్నేహితుడు లేదా స్నేహితురాలితో కూడా మాట్లాడను అని వాగ్దానం చేసి దానిని తప్పే వారుంటారు.
జంటలు చేసే అయిదు అబద్ధపు వాగ్దానాలు
‘నీవు కోరిందే చేస్తాను'...మరో వాగ్దానం. మీరు మీ పార్టనర్ ఇష్టా అయిష్టాలతో సర్దుబాటు చేసుకోగలననుకుంటారు. అది వాస్తవంలో సాధ్యమేనా? అయ్యేది కాదు. ఎవరి ఇష్టం వారిదిగా ప్రవర్తిస్తారు. కనుక ఈ వాగ్దానం విఫలమైనట్లే. ఒకవేళ కొత్తలలో సర్దుబాటు చేసుకున్నప్పటికి, తర్వాతి కాలంలో ఎవరి ఇష్టానికి వారు మారిపోవటం సహజం. మీ పార్టనర్ కు పిజ్జా ఇష్టమైనప్పటికి మీకు ఇష్టం లేనప్పటికి కొత్తలో అంగీకరించినా, తర్వాత పిజ్జాను దూరం చేస్తారు. అయిష్టం ప్రకటిస్తారు.
‘డార్లింగ్ ఆదివారాలు నీవు వంట చేయకుండా చూస్తాను‘. ఇది కూడా ఉత్తుత్తి వాగ్దానమే. కొత్తలలో బయటి రెస్టరెంట్లకు తీసుకు వెళ్ళినప్పటికి, పోను పోను, నీ చేతి వంట బాగా వుంటుంది, హోటల్ అనారోగ్యం అంటూ దాటవేసి ఇక దశాబ్దాల తరబడి ఆదివారం కూడా వంటచేయించేస్తారు.
‘ఇక పార్టీలు బంద్ డార్లింగ్ ' - మన వివాహం అయితే, ఇకపై మందు పార్టీలు బంద్ అంటూ ప్రామిస్ చేస్తారు. తర్వాత జరిగే మందు పార్టీలలో పాల్గొని భీభత్సం చేస్తారు. ఆనందిస్తారు. పార్టనర్ కి చెప్పకుండా పోయి తాగి పడిపోయి వాగ్దానం భంగం చేస్తారు.
‘గాడ్ ప్రామిస్ ...మళ్ళీ చేయను' - జంటలమధ్య చోటు చేసుకునే అబద్ధపు వాగ్దానాలలో ఇది ఒకటి. ఏదేని తగవు వచ్చినపుడు తాత్కాలికంగా పార్టనర్ ని కూల్ చేయటానికి ప్రామిస్ మళ్ళీ చేయనుగాక చేయను....అంటారు. కాని కొద్ది రోజులైతే చాలు, ఈ వాగ్దానాన్ని భంగం చేస్తారు. మీ పార్టనర్ కు తెలిసినప్పటికి దీనినే రిపీట్ చేస్తూ కొనసాగించి భంగం చేస్తారు.
డేటింగ్ సమయంలో జంటలు చేసుకునే వాగ్దానాలలో ఇవి కొన్ని అబద్ధపు వాగ్దానాలు. మీకు కనుక మరికొన్ని తెలిస్తే, వాటిని మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
