Latest Updates
-
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.!
ఒక మంచి సవతి తల్లి లేదా తండ్రిగా ఉండటమెలా?

ఒక సవతి తల్లి లేదా తండ్రికి వచ్చే సమస్యలు
తక్కువ ప్రేమిస్తామనే భయం - విడాకులు తీసుకున్న కుటుంబంలో, కొత్తగా వచ్చే తల్లి లేదా తండ్రి తమ పిల్లలను సరిగా ప్రేమించరనే భయంవుంటుంది. కనుక ఆప్రేమను పంచుకోటానికి మరొకరు వుండరాదని భావిస్తారు. అంతేకాదు, కొత్తగా కుటుంబంలోకి వచ్చే సవతి తల్లి లేదా తండ్రి పిల్లలను సరిగా చూడరు అనే భావన కూడా వుంటుంది.
ఇంట్లో ప్రశాంతత పోతుందా? - ఇంటిలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశించినపుడు, అప్పటివరకు పిల్లలకు వున్న ప్రశాంతత, సౌకర్యాలు పోతాయి. వారు వారి సవతి తల్లి లేదా తండ్రి ఇంటిలోకి, వారి జీవితాలలోకి బలవంతంగా వచ్చి వున్నట్లు భావిస్తారు.
గతంలోని పేరెంటు స్ధానంలో వుండలేరు - అన్నిటికంటే ప్రధానంగా పిల్లలు వారి హృదయంలోని గతంలోని తల్లి స్ధానాన్ని అంత తేలికగా కొత్త వ్యక్తికి ఇవ్వలేరు.
మరి ఈ పరిస్ధితులలో ఒక మంచి సవతి తల్లిలేదా తండ్రిగా వుండటమెలా?
ఒక తండ్రి లేదా తల్లిగా వుండండి. స్నేహితుడుగా వద్దు. మీరు మొదటగా, బిడ్డ వారి జీవితంలో ఖాళీ అయిన ఒక తల్లి లేదా తండ్రి స్ధానాన్నికోరుతున్నాడని ఒకస్నేహితుడిని కాదని గ్రహించండి.
అదే విషయం మీ పార్టనర్ కు కూడా వర్తిస్తుంది. మీ సవతి బిడ్డ తన వయసు వారితో స్నేహం చేసుకోవాలనుకుంటుంది. కనుక మీరు ఆ స్ధానానికి రాలేరు. కనుక తల్లి లేదా తండ్రి భాధ్యత తీసుకోండి వారు బాధ పడకుండా గత పేరెంటుని గుర్తు చేసుకోకుండా జాగ్రత్త పడండి.
సంభాషించండి - పేరెంట్ లోటు భావిస్తున్న బిడ్డకు మంచి సవతి పేరెంట్ అయి అతని మైండ్ లో వున్నసమస్యలను తీర్చండి. మీ బిడ్డకు ఏది అసౌకర్యమో గ్రహించండి. తెలుసుకోండి. దానిని పరిష్కరించండి. మీకు మీ సవతి బిడ్డకు మధ్య అనుబంధాన్ని పెంచండి. అతను మీతో సంభాషించేలాచేయండి. అతనికి దేనిపైఆసక్తి వుందో తెలుసుకోండి. అటువంటి విషయాలు బిడ్డను మీ వద్దకు చేరుస్తాయి.
గతంలోని పేరెంట్ గురించి చెడుగా మాట్టాడకండి - మీ బిడ్డతో మీ పరిస్ధితి ఏదైనప్పటికి అతని గత పేరెంట్ గురించి చెడుగా మాట్లాడకండి. ఇలా చేస్తే మీరు మంచివారేనన్న భావనతో మీ దగ్గరకు వస్తారు. సౌకర్యంగా వుంటారు. కొంతకాలం గడిస్తే మిమ్మల్ని ప్రేమిస్తారు.
గతంలో సవతి తల్లి లేదా తండ్రి అంటే బిడ్డలను ఎన్నో కష్టాలకు గురిచేస్తారని కధలు కధలుగా చెప్పేవారు. ఒక సవతి తల్లి లేదా తండ్రిగా వుండటం పెద్ద కష్టమేమీకాదు. అవసరం అయితే, సులభమైన ఈచిట్కాలు పాటించి ఒక సవతి పేరెంట్ అయిపోండి.



Click it and Unblock the Notifications
