Latest Updates
-
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.!
పెళ్ళికిముందు పురుషుడు వేసే ప్రశ్నలు!

నీకు వంట చేయటం వచ్చా? పెళ్ళి చూపులలో పురుషులు లేదా అతనివైపు నుండి వచ్చినవారు యువతిని మొదటగా వేసే ప్రశ్న ఇది. పురుషులు బాగా తనగలిగినవారు. ప్రతిరోజూ బయట తినటం అంటే వారు ఇష్టపడరు. కనుక మీరు చేసే వంట వారికి ప్రధానం అని గుర్తించండి. పెళ్ళితర్వాత వారు ప్రతిరోజూ భోజనం అంటూ రెస్టరెంట్లలో ఖర్చు చేయటానికి కూడా ఇష్టపడరు. అంతేకాదు మీరు బాగా వండితే చాలు అనుకుంటారు.
నా తల్లితండ్రులతో కలసి నువ్వు వుండగలవా? ఈ ప్రశ్నకు జవాబు క్లిష్టమే. వాస్తవానికి యువతులు తమ భర్తలతో కలసి వేరు ఇంట్లో వుండేందుకు ఇష్టపడతారు. అత్త, మామలు, మరుదులు వంటివారు వారి దాంపత్య జీవితానికిఅడ్డు అని భావిస్తారు. ఇది సాధారణమే....అందుకనే చాలామంది పురుషులు పెళ్ళికి ముందే ఇది నిర్ణయిస్తారు. మరి తన తల్లితండ్రులతో కలసిపోయి వుండాలని పురుషుడు ఈ ప్రశ్నకు పాజిటివ్ సమాధానం కోరతాడు.
ఉద్యోగం చేస్తావా? - నేటి పురుషులు, భార్యలు తమపై ఆధారపడరాదని కూడా భావిస్తారు. బాగా చదువుకున్న యువతి అయితే తేలికగా చేస్తాననేచెప్పేస్తుంది. పట్టణాలలో 80 శాతం మందిపురుషులు పెళ్ళికి ముందు ఈ ప్రశ్న వేస్తున్నారు. దీనిని మీరు వ్యతిరేకంగా తీసుకోకండి. ఒకవేళ అతను ఆర్ధిక ఇబ్బందులలో వుంటే, మీరు ఆదుకుంటారో లేదోనని కూడా పరీక్ష చేసే ప్రశ్న ఇది.
నాకొచ్చే సంపాదనతో సర్దుకుంటావా? పురుషులందరూ అత్యాశా పరులే. ఎంత సంపాదించినప్పటికి, పెళ్ళాం తక్కువ వ్యయంచేయాలంటారు. దానికి కారణం పొదుపు లేదా తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం. కనుక తనకు వచ్చే జీతంతో నీవు సంతోషంగా గడపగలవా అని అడుగుతాడు.
మార్పులకు నీవు ఇష్టపడతావా? ఆనందకరమైన వివాహ జీవితానికి చాలామంది పురుషులు ఈ ప్రశ్న వేస్తారు. సరళంగా వుండే యువతి, జీవితంలోని మార్పులకు సర్దుకుంటుంది. ఇద్దరూ కూడా మానసికంగా, శారీరకంగా సర్దుకుంటారు. ఈ ప్రశ్న పురుషుడు వ్యక్తిగత ఇష్టం చెపుతుంది. అంతేకాని పురుషులందరూ ఈప్రశ్న వేస్తారనటానికి వీలు లేదు.
ఈ ప్రశ్నలు సాధారణంగా పురుషులు పెళ్ళికి ముందుయువతికి వేస్తారు. మీరు కనుక ఈ రకమైన ప్రశ్నావళి ఎదుర్కొన్నట్లయితే, మరిన్ని వుంటే....మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
