Latest Updates
-
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.!
అందుకు సమయం లేదు అమ్మడూ....!

1. ట్రావెలింగ్ జాబ్ - ఆఫీస్ పనుల కారణంగా సంవత్సరానికి పది నెలలో టూర్లలో గడిపే వారికి ఇంటిలో భార్యను ప్రేమించే అవకాశం ఆమెను అర్ధం చేసుకొనే అవకాశం వుండదు. వచ్చి వున్న రెండు నెలలు ఇద్దరి మధ్యా ఎన్నో సమస్యలు కలిగి వుంటారు. ఇంటివద్ద గడిపే కొద్దిపాటి సమయం మీ సంబంధానికి సరిపోదని గ్రహించాలి.
2. బిజీ ఉద్యోగులు - వీరు ఎపుడు చూసినా కంపెనీల ఉద్యోగాలలో ముణిగి తేలుతూ, రోజుకు 16 గంటలు, మీటింగులు, తోటి ఉద్యోగులు, బాస్, వర్క్ అంటూ తిరిగేస్తారు. అవసరమనుకుంటే నెలకు మూడు వారాలు ప్రయాణాలలోనే వుంటారు. విదేశాలు ప్రయాణిస్తారు. వీరికి ఇంటివద్ద వుండే భార్యతో గల సంబంధం ప్రేమగా మారే అవకాశం వుండదు.
3. బదిలీ బాబులు - వీరి ఉద్యోగాలలో అన్ని చోట్లకు బదిలీలే. కంపెనీ లేదా బ్యాంకు బ్రాంచీలు దేశంలో ఎన్ని వుంటే, షుమారుగా అన్ని ప్రదేశాలకు వీరికి బదిలీలు అవుతూనే వుంటాయి. వీరికి ప్రేమలో పడేందుకు అవకాశం వుండవచ్చు కాని వీరి పార్టనర్ ఎపుడు చూసినా బదిలీకి అవసరమైన ఇంటిసామాన్లు సర్దుతూనే వుండాలి. వీరు ఏ ప్రదేశంలోను పట్టుమని పది సంవత్సరాలు వుండరు. ఇక పార్టనర్ ఏదేని ఉద్యోగం చేసే అవకాశం అసలే వుండదు. ఇక దూరంలో వున్న బంధువులెవరో కూడా వీరికి తెలియని స్ధితిలో వుంటారు.
4. వర్కోహాలిక్ - పని ప్రేమికుడు, ఈ తరహా వ్యక్తులు ఒక సారి ఆఫీస్ లోకి వెళ్ళారంటే, బయట ఏం జరుగుతోందో తెలియదు. ఇంటివద్ద జరిగేది అసలే తెలియదు. ప్రేమంటే అసలు తెలియదు. దాని రుచి, రంగు, వాసన పట్టని వ్యక్తి. ఇంటివద్ద భార్యకు అన్నీ అడియాసలుగానే వుంటాయి. వీరు స్వచ్ఛందంగా ప్రేమను చంపేసుకుంటారు. పని తప్ప వేరే ధ్యాస వుండదు. కనుక వీరు కొద్దిపాటిగా బయటి ప్రపంచంలో తొంగి చూసి తమ సంబంధాలను మెరుగుపరచుకోవాలి.
పైన తెలిపినవన్నీ ఆధునిక జీవన విధానంలోని కష్టాలు, ఇవి సబంధాలకు తగిన సమయం కేటాయించలేనివి. మరి వీటిని అధిగమించాలంటే, ఆన్ లైన్ డేటింగ్ లేదా సుదూర సంబంధాలు వంటివి నేటి తీరులో ఆనందించాల్సిందే. ప్రేమలో పడటం మీ పని లేదా వ్యాపారానికి హాని అని మీరు ఎపుడైనా భావించారా? ఈ అంశంలో మీ అనుభవాలను మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications
