Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
పురుషుల... చిర్రెత్తించే చెడు అలవాట్లు!

చికాకు కలిగించే పురుషుల అలవాట్లు?
క్రికెట్ మ్యాచ్ తేదీలు పురుషులకు చాలా ప్రధానం. అవి భలే గుర్తు పెట్టుకుంటారు. మళ్ళీ మ్యాచ్ ఎపుడు? ఎక్కడ అనేవి ఠక్కున ఖచ్చితంగా చెపుతారు. కాని భార్య పుట్టిన రోజు, మేరేజ్ యానివర్సరీ వంటివి మరచిపోతారు. కాని వీటివిషయంలో మహిళ తేలికగా తీసుకోలేదు. తనకంటే, క్రీడలు చూచేందుకు, ప్రాధాన్యతను ఇవ్వటానికి ఇష్టపడే పురుషుడిని మహిళ భరించలేదు. మహిళతో తన సంబంధం...క్రీడల సమాచారం, రెంటి గురించి ప్రశ్నలు వేస్తే, పురుషుడు రెండవదానిలో తేలికగా పాస్ అయిపోతాడు.
వస్తువులన్ని చిందర వందర - పురుషులు తాను నివసించే ఇంటిలో ఎంత చిందర వందరగా వున్నా నివసించగలడు. దుస్తులు గదిలో ఎక్కడపడితే అక్కడ వుంచేస్తాడు. కొన్ని అంశాలలో ఇంటిని శుభ్రంగా వుంచడు. ఈ అంశంలో భార్యతో తగవుకైనా సరే రెడీగా వుండి ఎదుర్కొంటాడు. మహిళలకు శుభ్రత కావాలి. పురుషులు అశ్రద్ధగా వుండటం వారికి ఇష్టం ఉండదు. ఎక్కడ తీసిన వస్తువులను అక్కడ మరల ఉంచి చక్కటి హౌస్ కీపింగ్ చేయాలంటారు. తడి గుడ్డలు, మురికి చెప్పులు, సాక్స్ వంటివి ఇంటి హాలులో పెట్టటం వారికి ఇష్టం ఉండదు. పురుషులు చేసే ఈ చర్యలు వారిని చిర్రెత్తిస్తాయి.
అందుకొరకు సారీ...- అనేది ఎప్పటికి చెప్పడు. ముందుగా రక రకాలుగా ఏ కారణం లేకనే తన మహిళలను నిందిస్తాడు. చేసిన తప్పులకు సారీ చెప్పడు. పురుష అహంకారం ప్రదర్శిస్తాడు. ఇద్దరు కలసి మెలసి జీవించాల్సిన సంబంధంలో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనేది లేదని భావించడు. పురుషాధిక్యత ప్రదర్శిస్తాడు. తన మహిళను నియంత్రించటం ద్వారా సంతోషం, గర్వం భావిస్తాడు. ఈ అంశాలు మహిళకు చిర్రెత్తిస్తాయి.
సెలవులలో సోమరితనం - సెలవులు వచ్చాయంటే చాలు. బద్ధకిస్తాడు. సెలవు వచ్చిందని తన మహిళను బయటకు తీసుకు వెళదామని, ఆనందింపజేద్దామని కూడా వుండదు. వారంలో అలసిపోయానంటూ ఇంటో కూర్చుంటాడు. విసిగిస్తాడు. ఏ పని చెప్పినా వచ్చే వారం చేస్తానంటాడు. మెత్తగా ఉండిపోతాడు లేదంటే, రోజంతా పడి నిద్రిస్తాడు. ఈ అంశాలు మహిళను విసిగిస్తాయి.
టీజింగ్ - తన మహిళ ఎంత బాగా అలంకరించుకున్నా సరే...అది బాగా లేదని, ఇది నీకు సరిపడలేదని ఆమె చేసుకున్న అలంకరణపై వ్యాఖ్యలు చేసి ఏడిపిస్తాడు. ఆమె చెడుగా భావించేలా చేస్తాడు. ఆమె చేసిన వంటకాలకు సైతం వంకలు పెట్టి ఆనందిస్తాడు. అతను తమాషాగా చేసినప్పటికి ఈ చర్యలను ఆమె భరించలేదు. దీనికి పరిష్కారం ఆమె వాటిని ఆచరించకుండా ఉండటమే. అయినప్పటికి అది చేయలేదు ...ఇది చేయలేదు వంటి వ్యాఖ్యలు ఆమెను బాధిస్తాయి.
మహిళలపట్ల పురుషుల చెడు అలవాట్లకు ఇవి ఉదాహరణగా మాత్రమే. ఈరకమైన అతని ప్రవర్తన మీకు ఏ పనిచేయాలన్నా మరోసారి ఆలోచింప చేస్తుంది.



Click it and Unblock the Notifications
