Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
జీవితమంతా మరువలేని మాజీ ప్రియులు...!
వదిలేసిన ప్రియుడిని గుర్తుకు తెచ్చుకోవటంలో ప్రయోజనం లేదు. ఈ విషయం అందరకు తెలుసు. దానినే మనం స్నేహితులకు కూడా చెపుతాం. అయితే, ప్రతి వ్యక్తికి కూడా మరపు రాని ఒక మాజీ ప్రియుడు లేదా ప్రియురాలు ఉంటారు. వాస్తవానికి వారికి విడాకులిచ్చి లేదా సంబంధం తెంచుకొని కొన్ని సంవత్సరాలై ఉండవచ్చు. అతనితో ఇక ఏ ప్రేమ సంబంధం కూడా లేకపోవచ్చు. కాని అతని లేదా ఆమె జ్ఞాపకాలు వెన్నాడుతూనే ఉంటాయి. వాటిని మనం మరచిపోయామని అనలేము. మరి వారి గురించి మనం ఎందుకని మరచిపోలేకుండా ఉంటామనేదానికి కొన్ని కారణాలు పరిశీలించండి.
మరపు రాని ఆమె లేదా అతని ప్రత్యేకత -

ఇష్టమైన జ్ఞాపకాలు - ఈ మాజీ బాయ్ ఫ్రెండ్ లేదా గాళ్ ఫ్రెండ్ తో ఏ రకమైన వివాదాలు, తెగతెంపులు ఉండకపోవచ్చు. ఒక స్నేహితులుగా విడిపోయి ఉండవచ్చు. కలసి గడిపిన మధుర క్షణాలు మీ మదినుండి తొలగవు. అంతేకాదు, స్నేహితులవలే మీరు ఇంకా అపుడపుడూ టచ్ లో ఉండవచ్చు కూడాను. నేటి ఆధునిక రోజులలో ఇది సాధారణమే.
ప్రేమ విఫలమై విడిపోవచ్చు - ప్రేమించిన వారిని వదిలేయటం అనేది జీవితంలో ఎంతో కష్టమైన పని. మీ మాజీ ప్రియుడితో ఇంకా ప్రేమ భావిస్తే, అందులోనూ మీరు విడిపోతే, ఇక అతనిని ఎప్పటికి మరచిపోలేరు. ఒకనాడు వారి కొరకు జీవితాన్ని అర్పించివుండవచ్చు. కాని కొన్ని కఠిన పరిస్ధితులలో తెగతెంపులు పొంది వుండవచ్చు. పెళ్ళి చేసుకుందామని మీరు భావించి ఉండవచ్చు. కాని అతను మీ కుటుంబంలోకి తగినవాడు కాకపోవటం, లేదా అందుకు అతను రెడీగా లేకపోవటం జరగవచ్చు.
ఎపుడూ కూడా పక్కవాడి పొలం పచ్చగానే - ఎపుడూ ప్రతివారికి వారికి ఉన్నది నచ్చదు. తాము కలిగిన వాటితో ఆనందించరు. పోయిన వాటి గురించి ఆలోచిస్తారు. అదే రకంగా మీ ప్రజెంట్ భర్తతో పోల్చుకుంటూ గతంలో వారిని గుర్తు చేసుకుంటారు. గతంలోని అతడితో విఫలమైనప్పటికి పోలిక చేసుకుంటారు.
అది మీ రహస్యం - కొంతమందికి రహస్యాల భ్రమ ఉంటుంది. అందులో ప్రస్తుత భర్త లేదా భార్య ఉండరు. మాజీలు రహస్యంగా వారి ఊహలలోకి వస్తారు. వారు ప్రస్తుత వాస్తవం కారు. కాని తరచుగా మనసులోకి వస్తారు. ఎందుకంటే, ఊహలలో అతనితో మన ఇష్టం వచ్చినట్లు ఆనందించుకోవచ్చు. ఆ విషయం దగ్గర ఉండే భర్త లేదా భార్యకే తెలియదు కనుక ఇక మన ఇష్టం అనుకుంటారు. ఇటువంటి వారిని ఏమనాలి...సైకోపాత్ అంటారు. ఒకప్పుడు మిమ్మల్ని చంపుదామనుకొన్న వాడిని లేదా ఏదో కారణంగా వదిలేసిన వారిని అర్ధం పర్ధం లేకుండా మీరు పిచ్చిగా ప్రేమించటం.
ఈ కొద్ది కారణాలుగా మనం మన మాజీ ప్రేయసి లేదా ప్రియుడిని మరచిపోలేము. మరి మీకు కూడా ఎవరైనా ఎప్పటికి మరచిపోలేని రహస్య మాజీ ఉన్నారా?



Click it and Unblock the Notifications
