Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
స్నేహాలు ఎందుకు దూరం అవుతాయి?

చాలామంది స్నేహితులు స్కూల్ మరియు కాలేజ్ చదువులనుండి బయటకు రాగానే తగ్గిపోతారు. మరికొందరు సమయం గడిచే కొలది దూరమైపోతూంటారు. మరి ఈరకంగా స్నేహాలు ఎందుకని దూరం అయిపోతుంటాయనేది పరిశీలించండి.
కన్పించకపోతే దూరమవుతారు - స్నేహాలలో కూడా, రొమాంటిక్ సంబంధాలవలెనే దూరం అనేది ఒకరికొకరిని దూరం చేస్తుంది. మనలో చాలామందికి కాలేజ్ లో స్నేహితులుంటారు. కాని మనం చదువులు పూర్తిచేసి బయటకు వచ్చే సరికి వారితో సంబంధం కోల్పోతాము. దానికి కారణం మనం వారిని ఎపుడూ కలిసే కాలేజ్ కేంపస్ లో కలవలేకపోవటం రోజువారీ జీవితంలో కొత్త కార్యకలాపాలలో ముణిగిపోవటం. అయితే, కొన్నిసార్లు, ఎన్నో సంవత్సరాల తర్వాత గతంలోని క్లాస్ మేట్ ని చూస్తాం. కనీసం అతని పేరు కూడా గుర్తుకు తెచ్చుకోలేము. మనిషి జ్ఞాపక శక్తి త్వరగా తగ్గిపోతుంది. మనిషి కనిపించకపోతే చాలు, అతడు మన మైండ్ నుండి కూడా దూరం అయిపోతాడు.
దూర ప్రదేశ స్నేహాలు మెయిన్టెయిన్ చేయడం - దీనిలో చాలా అడ్డంకులు వుంటాయి. సొమ్ము వ్యయం చేసి స్నేహితులకు దూర ప్రదేశాలకు టెలిఫోన్లు చేయాలి. ఎంతో బిజీగా వుండే వారాంతపు సెలవులలో కూడా వీటికి సమయం చేసుకోవాలి. వీడియో ఛాటింగ్ చేయాలి. మరీ మంచి స్నేహం అనుకుంటే, సంవత్సరానికొకసారి వెళ్ళి కలవాలి. కాని ఇంత రిస్కు తీసుకొని చేయలేక మన స్నేహాలను దూరం చేసుకుంటాం.
ఎదగటంలో బాధలు - స్కూలు, కాలేజీలలో చక్కటి స్నేహ బంధాలుంటాయి. కాని మనం పెద్దవారమయ్యే సరికి అభిరుచులు కూడా మారతాయి. ఎంతో మంచి స్నేహాలు సైతం విభిన్న మార్గాలలో సాగి దూరం అయిపోతాయి. చివరకు ఒకరినొకరు తెలుసుకోలేని దశకు కూడా వచ్చేస్తారు.
ప్రత్యేక భాగస్వామి - వయసు పెరిగే కొలది ప్రతివారికి పెళ్ళి జరిగిపోతుంది. భాగస్వామి వచ్చేస్తారు. ఆపై పిల్లలు వచ్చేస్తారు. కుటుంబం ఏర్పడుతుంది. ఇక వారి జోక్యం కారణంగా కూడా స్నేహాలు దూరమైపోతాయి. కాలేజీలో ఎంతో సన్నిహితంగా సోదరులుగా, లేదా సోదరిగా వున్న వారు సైతం ఈ దశలో గుర్తుకురారు. వివాహం తర్వాత దశాబ్దాలకు కూడా వారు కనపడరు.
స్నేహం ముగియటం అనేది ఒక్క సారిగా ముగించేసేది కాదు. చాలామంది విషయంలో అనేక సంవత్సరాలు సైలెంట్ గా ఏ రకమైన సంబంధం లేకుండా సాగిపోతుంది. మరి ఇదే సమయంలో మనం మన జీవితంలో కొత్త స్నేహితులను సంపాదించుకుంటాం. అయినప్పటికి పాతవారిలో కొంతమంది ప్రత్యేక స్నేహితులను కొనసాగిస్తాం.



Click it and Unblock the Notifications
