Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
భాగస్వామితో 'ఫస్ట్ డేట్' సక్సెస్ కావాలంటే..?
మీరు ఫస్ట్ డేట్ కు ప్లాన్ చేస్తున్నారా..?అయితే కొన్ని ఖచ్చితంగా కొన్ని రొమాంటిక్ ప్లేస్ లకు మాత్రమే ఎంపిక చేసుకోండి. క్యాండిల్ లైట్ డిన్నర్ కు కామ్ గా ఉండే రెస్టారెంట్ ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఫస్డ్ డేట్ ను స్పెషల్ గా మార్చేస్తుంది. కాబట్టి మొదట ప్లాన్ చేసి, కావల్సిన సౌకర్యాలన్నింటిని సమకూర్చుకొని ఆమెకు ఆశ్చర్యం కలిగించండి.
‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ ది లాస్ట్ ఇంప్రెషన్'కాబట్టి ఏ ఒక్కరూ ఫస్ట్ డేట్ కోసం అసౌకర్యం కలిగించే వ్రాంగ్ ప్లేసులను ఎంచుకోకుండా జాగ్రత్త పడాలి. సాధారణంగా అబ్బాయిలుకానీ, కాలేజ్ స్డూడెంట్స్ కానీ, మొత్తానికి మగవారందరూ ఫస్డ్ డేట్ మీట్ కావడానికి డిన్నర్ కో లేదా సినిమాకో ప్లాన్ చేస్తారు. అయితే కొన్ని ఆవిష్కరణలు మరియు సృజనాత్మక ఐడియాలతో ప్లాన్ చేయడం వల్ల మీ ఫస్డ్ డేట్ ను మరింత రొమాంటిక్ గా.. సౌకర్యవంతంగా మార్చేస్తుంది.
కాబట్టి ఫస్డ్ డేట్ మరింత బెటర్ గా మరియు సౌకర్యవంతంగా..ప్రశాంతంగా మనస్సు విప్పి మాట్లాడుకొనేంతగా ఉండేటటువంటి ప్రదేశాలకు వెళ్లి ఆమెను ఇంప్రెస్ చేయండి. అలాంటి కొన్ని ప్రదేశాలు ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఇక్కడ కొన్నిమీకోసం అందిస్తున్నాం. అయితే ఈ లిస్ట్ లోని ప్రదేశాలు అందరి అమ్మాయిలకు నచ్చకపోవచ్చు. అందుకు ఫస్ట్ ఆమె మనస్సు తెలుసుకుని వారికి నచ్చేటటువంటి .. వారు ఆశ్చర్యానికి గురైయ్యేటటువంటి ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు: ఆమెకు నచ్చని బౌలింగ్ ప్రదేశానికి ఫస్ట్ డేట్ న తీసుకువెళ్ళడంతో, ఆ గేమ్ ఆమెకు నచ్చకపోవచ్చు. అటువంటప్పుడు ఆమెకు బోర్ కొట్టి ఆమె అక్కడ నుండి పరారయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆమె సౌకర్యవంతంగా ఫీల్ అవుతూ...ఇందరూ ఎంజాయ్ చేసే విధంగా ప్రదేశాల ఎంపిక ఉండాలి. మరి ఆమెను మెప్పించడానికి అటువంటి రొమాంటి ప్రదేశాలేంటో చూద్దాం...

ఫిషింగ్: మొదటి డేటింగ్ ప్లేస్ చాలా నిశ్శబ్ద, ప్రశాంత వాతావరణం కలిగి ఉండే స్థలం ఫిషింగ్ ప్లేస్. మీ పాట్నర్ తో మొదటి సారి మనసు విప్పి మాట్లాడటానికి అనువైనటువంటి ప్రదేశం. ఫస్ట్ డేట్ స్పెషల్ గా మరింత స్పెషల్ గా ఉండటానికి అక్కడి కొన్ని ఇష్టమైన స్నాక్స్ ను మిరియు షాంపైన్ వంటి వాటిని ప్రత్యేకంగా తీసుకెళ్ళండి.

వార్ఫ్: మీ పాట్నర్ తో మీరు మొదటి సారి కలిసేందుకు ఇది మరొక రొమాంటి ప్రదేశం. నిష్కల్మషమైన నిశ్శబ్ద వాతావరణంలో చుట్టూ నీరు, బలమైన పిల్లగాలులు మొదటి సారి కలిసే ఆ సమయాన్ని వేస్ట్ కానియకుండా మొత్తం సమయాన్ని అద్భుతంగా ఆస్వాధించడానికి ఓ చక్కటి భోజనం ప్లాన్ చేసుకోండి.

స్విమ్మింగ్ పూల్: మొదటి సారి స్విమ్మింగ్ పూల్ లో కలవడమెలా ? స్వింగ్ పూల్ లోని నీలు మబ్బుల నీటితో ఆటలాడటం అంటే ప్రతి అమ్మాయికి ఇష్టమే..ఆ నీటిలో ఆటలాడుతూ మీ పూర్తి సంభాషణతో పస్ట్ డేట్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక అనుకూలమైన మరియు శృంగారభరితమై ఈ ప్రదేశం ఫస్ట్ డేట్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఉపాయం.

పార్క్: మీ పార్ట్నర్ తో ఆహ్లాదభరితంగా చిరునవ్వులు చిందిస్తూ ఎంజాయ్ చేయాలనుకొనేటప్పుడు పార్క్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అక్కడ ఉండే కొన్ని సీనరీస్ వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మరికొంత సమయం మాట్లాడటానికి ఇష్టపడుతుంది. మనస్సులోని బావాలను బయటపడేలా చేస్తుంది.

బీచ్: మీరు మొదట కలుసుకొనే ప్రదేశం బీచ్ కంటే మరింత శృంగారభరితమైన ప్రదేశం మరొకటుంటుందా? బీచ్ లో చల్లని ఓ బీరు పక్కన పాట్నర్ మరియు తడిసిన శరీరాలు ఇంతకంటే రిలాక్స్ మరియుఎంజాయ్ మెంట్ ఇంకెక్కడ దొరుకుతుంది.

సన్ సెట్: సాయ సంధ్యలో ఓపెన్ రూఫ్ రెస్టారెంట్ మొదటి కళయికకు చాలా అనుకూలం. అనుకూలం మాత్రమే కాదు అంద్భుతమైనటువంటి సన్ సెట్ ను కూడా చూడవచ్చు. మొదటి కలయికకు షాంపైన్ లేదా వైన్ వంటివి అనుకూలంగా ఉంటాయి.

భోజనం: మీ పార్ట్న్ తో మొదటి సారి కలవాలనుకొన్నప్పుడు ఓ కొత్త రుచిని చూపించండి అది శాశ్వతంగా నిలిచిపోతుంది. మీరు మొదటిసారి ఎక్కువ సమయం మీ పాట్నర్ తో గడపలేకపోయినప్పుడు ఇది చాలా అద్భుతమైనటువంటి ఉపాయం.

పార్టీ: మీ పార్ట్నర్ పార్టీలు, పబ్బులు వంటి వాటిని ఇష్టపడేటట్లైతే మీ మొదటి కళయికి పార్టీలో కూడా పెట్టుకోవచ్చు. ఆమెను డిస్కోటెక్ లేదా పబ్ కు ఆహ్వానించండి. ఆమె అక్కడ తమాషాగా మరింత ఫ్రేండ్లీగా గడపడానికి ఓ చక్కటి ప్రదేశం.

బ్రేక్ ఫాస్ట్: మీరు ప్రైవసీ కోరుకునే వారైతే మీరున్న ప్రదేశానికి ఆమెను ఆహ్వానించి ఇద్దరూ కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సమయాన్ని ఎంజాయ్ చేయండి. ఆమెకు నచ్చిన, ఎక్కువగా ఇష్టపడే వంటను మీరే స్వయంగా తయారు చేసి సర్వ్ చేయండి. ఇది చాలా మంది అబ్బాయి సర్వసాధారణంగా చేసేటటువంటి ఉపాయం.

గార్డెన్: విలువైన సమయాన్ని మరింత శృంగారభరితంగా గడపడానికి, మరింత దగ్గర కావడానికి గార్డెన్ ఓ చక్కటి ప్రదేశం.



Click it and Unblock the Notifications
