Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
భాగస్వామిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకూడదు ఎందుకు?
భార్యాభర్తలకి ఒకరిపై ఒకరికి ప్రేమ కచ్చితంగా ఉంటుంది. అయితే, వివాహ బంధం ముందుకు వెళుతున్న కొద్దీ వారిలో నున్న భూతం బయటకు వస్తుంది. తమ భాగస్వామిని గ్రాంటెడ్ గా తీసుకుని వారిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్దతి ఇద్దరి బంధంలో ఇబ్బందులను తీసుకువస్తుంది. పరిస్థితులు చేయిజారిపోయే ప్రమాదం ఉంది. ఇదే పద్దతి కొనసాగితే వివాహబంధం అంతమయ్యే ప్రమాదం కూడా ఉంది. బంధం కలకలం పదిలంగా ఉండాలంటే ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ పరిస్థితులను అదుపులో పెట్టుకోవడమే ముఖ్యం.

పార్టనర్స్ ఇద్దరూ రిలేషన్ షిప్ ను ఎంజాయ్ చేయాలి. మానసికంగా వారి బంధం దృడంగా ఉండేందుకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచనను పక్కనపెట్టాలి. బంధంలోని అందాన్ని మింగేసే అటువంటి భూతాలను దరిచేరనీయకూడదు. అందుకే ఆధిపత్య ధోరణి ప్రదర్శించకూడదు.
పార్టనర్ ని డామినేట్ చేయాలనే ఆలోచననెందుకు విరమించుకోవాలంటే?
ఆరోగ్యకరం కాదు
మీ పార్టనర్ ను ఎలా కంట్రోల్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే, ఆ ఆలోచనను తక్షణమే విరమించుకోండి. ఈ ఆలోచన లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. పార్టనర్ ను కంట్రోల్ చేస్తేనే మీకు ఆనందంగా ఉంటుంది అంటే అది ఆరోగ్యకరమైన విషయం కాదు. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి. మీతో పాటు సమానంగా మీ పార్టనర్ ను ట్రీట్ చేయాలి. మీ పార్టనర్ కు గౌరవమర్యాదలు ఇవ్వండి. మీ బంధం పదిలంగా ఉండాలంటే మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.

మర్యాద పోగొట్టుకోకండి
మీ పార్టనర్ ని ఎల్లప్పుడూ కంట్రోల్ చేయాలనే మీ ప్రయత్నం మీ పార్టనర్ కు మీపైనున్న గౌరవమర్యాదలు పోయేలా చేస్తుంది. మర్యాదపోవడమంటే ప్రేమను పోగొట్టుకోవడమే. మీ పార్టనర్ దృష్టిలో కేవలం మీ ఆధిపత్య ధోరణి మాత్రమే కనిపిస్తుంది. మీ మంచితనాన్ని ఈ ధోరణి డామినేట్ చేస్తుంది. జీవితాంతం మీ పార్టనర్ తో కలిసి ఉండాలనే ఆలోచన ఉంటే మీ ఆలోచనను తక్షణమే మార్చుకోండి.

ఇబ్బందులలో వివాహబంధం
ప్రోగ్రెస్ తో పాటు రిలేషన్ షిప్ లో ఎదుగుదల కూడా ముఖ్యమే. మీ పార్టనర్ ను మీరు కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఎదుగుదల ఏ విధంగా సాధ్యమవుతుంది? మీతో మీ పార్టనర్ ఇబ్బంది పడటం ప్రారంభమవుతుంది. మీతో కలిసి జీవించాలనే ఆలోచన వారికి కష్టతరంగా మారుతుంది. బంధంలో ఆటుపోట్లు ఈ విధంగానే ప్రారంభమవుతాయి.

దారితప్పుతారు
ఎల్లప్పుడూ మీ పార్టనర్ పై మీరు ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటే వారు దారితప్పే అవకాశాలు ఎక్కువ. మీ స్థానంలో మరొకరు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. ప్రేమతో ప్రేమని జయించవచ్చు. ప్రేమలేని చోట రిలేషన్ షిప్ కు స్థానం లేదు. ఆ విధంగా మీ రిలేషన్ షిప్ ముగిసిపోయే ప్రమాదం కలదు.

జీవితం చిక్కుల్లో పడవచ్చు
మీ బంధం ఆరోగ్యకరంగా ఉండకపోతే జీవితంపై ఆశక్తి సన్నగిల్లుతుంది. బంధాలు పదిలంగా ఉన్నప్పుడే ఆనందానికి చోటు లభిస్తుంది. బంధాలే ప్రశ్నార్థకంగా మారితే సుఖసంతోషాలు ఎక్కడివి? అందువల్ల, ఒకరిపై ఒకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించకుండా ఒకరిపై ఒకరు ప్రేమను చూపి ఒకరినొకరు అర్ధం చేసుకుంటే సంతోషంగా ఉంటారు.



Click it and Unblock the Notifications