Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
అక్రమ సంబంధంతో భర్తకు విడాకుఅక్రమ సంబంధంతో భర్తకు విడాకులు, 20 ఏళ్ల చిన్నోడితో లవ్ మ్యారేజ్, లెక్క సరిపోయింది
భారతీయ సంస్కృతిలో వివాహాన్ని జీవితకాల బంధంగా పరిగణిస్తారు. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ కుటుంబాన్ని కాపాడేందుకు భార్యాభర్తలు తమ వంతు ప్రయత్నం చేస్తారు. సమాజం నుండి వచ్చే గాసిప్‌లకు భయపడి మహిళలు తమ భర్త ఇంటిని విడిచిపెట్టరు. వేధింపులు, చిత్రహింసలు భరించి భర్త ఇంటిలోనే నిలబడతారు. వివాహం బంధం నుండి బయటపడి జీవితాన్ని నిర్మించుకునే ధైర్యం కొంతమంది మహిళలకు మాత్రమే ఉంటుంది.
కొంతమంది వ్యక్తులు తమ సంబంధాలను విడిచిపెట్టి మెరుగైన జీవితాన్ని గడపాలని ఎంచుకుంటారు. అదేవిధంగా భర్త నిత్య వేధింపులతో విసిగిపోయిన ఓ భారతీయ మహిళ విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇప్పుడు ఆమెకు 59 సంవత్సరాల వయస్సు. ఆ మహిళ తన కంటే 20 సంవత్సరాలు చిన్న వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ మ్యాటర్ తెలుసుకున్న చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరి మధ్య వయస్సు తేడా ఉన్నప్పటికీ వారు పెళ్లి చేసుకున్నారు. 28 సంవత్సరాల క్రితం విడాకుల జీవితం తర్వాత ఆమె ప్రేమలో పడింది. మూడేళ్ల ప్రేమ జీవితం తర్వాత ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మహిళ వయస్సు 59 సంవత్సరాలు, ఆమె భర్త వయస్సు 39 సంవత్సరాలు. విడాకుల తరువాత ఇప్పుడు వివాహం చేసుకున్న గీతా అనే మహిళ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పీపుల్ ఆఫ్ ఇండియా షేర్ చేశారు. గీతా జీవిత కథ, ఆమె పోరాటం గురించి వీడియో తీసిపెట్టారు. తనకంటే 20 ఏళ్లు చిన్నవాడైన నిఖిల్‌ని పెళ్లి చేసుకున్నట్లు గీతా వీడియోలో వెల్లడించింది.
నా భర్త వివాహేతర సంబంధం కారణంగా తన మొదటి వివాహం నరకంలా తయారైయ్యిందని గీతా వివరించారు. తన భర్త చెడు వ్యసనాల కారణంగా 28 ఏళ్ల క్రితం తన పెళ్లి బంధం తెగిపోయిందని, అప్పటి నుంచి తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని గీతా వివరించారు. కొన్ని సంవత్సరాల క్రితం తాను నిఖిల్‌ని కలిశానని, తాను డిప్రెషన్ నుంచి బయటపడి సాధారణ జీవితం గడిపేందుకు ఆయన సహకరించారు అని గీతా తెలిపారు.
తాను డిప్రెషన్ నుంచి బయటపడేందుకు తనతో నిఖిల్ గంటల తరబడి ఫోన్ మాట్లాడేవాడని, ఈ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియదని, మూడేళ్ల స్నేహం తర్వాత నిఖిల్ నాకు ప్రపోజ్ చేశాడుని, నా తల్లిదండ్రులను కలుసుకుని పెళ్లి గురించి మాట్లాడాడని, ఇప్పుడు మేమిద్దరం సంతోషంగా పెళ్లి చేసుకున్నాం అని గీతా సంతోషం వ్యక్తం చేసింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటికి దాదాపు 2 లక్షలకు పైగా లైక్‌లు, 5 వేలకు పైగా కామెంట్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో పెడుతున్నారు.



Click it and Unblock the Notifications