Latest Updates
-
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు? -
Chicken Kofta Recipe: రోటీ, బగారా రైస్‌లోకి అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ..ఈజీగా, టేస్టీగా ఇలా చేసుకోండి -
వేగంగా బరువు తగ్గించే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. డయాబెటిస్‌ని ఈజీగా కంట్రోల్ చేసే కీర సలాడ్.!
కోడలిని కూతురిగా చూడాల్సిన అవసరం లేదు.. ప్రశాంతమైన శేష జీవితానికి బంగారు సూత్రాలు
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అంటే అత్తామామలు, అన్నాదమ్ముళ్లు, తోడికోడళ్లు, పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండేది. వ్యవసాయ ఆధారిత కుటుంబాల కారణంగా దాదాపుగా ఉమ్మడి కుటుంబాలుగా జీవించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఉద్యోగాలు, ఇతర కారణాల దృష్ట్యా ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారాయి. భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే కలిసి ఉంటున్నారు. ఇక, కొన్ని కుటుంబాల్లో అత్తామామలు ఊళ్లలో ఉంటుండగా.. మరికొన్ని కుటుంబాల్లో పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.

అయితే ఒకప్పుడు సహనంతో ఉన్న బంధాలు ఇప్పుడు ఓర్పును కోల్పోతున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఓపిక ఇప్పుడు చిన్న కుటుంబాల్లో కూడా ఉండటం లేదు. ముఖ్యంగా అత్తాకోడళ్ల గొడవలు కాస్త భార్యాభర్తల తగవులకు దారితీస్తాయి. ఈ కారణంగా దంపతులు విడిపోయేవరకు పరిస్థితులు వెళ్తున్నాయి. ఫలితంగా వృద్ధాప్యంలో శేషజీవితాన్ని ఆనందంగా గడపాల్సిన అత్తామామలు.. ఈ వయసులో గందరగోళం, తగవులతో గడుపుతున్నారు. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలు తీరాక వారి జీవితం ఆనందంగా సాగాలంటే కొన్ని సలహాలు పాటించాలని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా అత్తాకోడళ్ల బంధం తల్లీకూతుళ్లలా ఉండాలని అంటారు. అత్తలో తల్లిని, కోడలిలో కూతురిని చూసుకోవాలని చెబుతారు. కానీ అలాంటి కుటుంబాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తమ కుటుంబంలోకి అడుగుపెట్టిన కోడలు.. కుటుంబీకులతో కలిసిపోవడానికి సమయం తీసుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో అత్తాకోడళ్ల గొడవలు కుటుంబ సంతోషాన్ని చెదరగొడతాయి. పిల్లల చదువు, కెరీర్, పెళ్లి అనంతరం వారి తల్లిదండ్రులు శేష జీవితాన్ని ఆనందంగా గడపాల్సిన వృద్ధాప్యంలో వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు, చేసే పనులు ప్రశాంతతను దారితీస్తాయి.
వృద్ధాప్యం ప్రశాంతం
వృద్ధాప్యంలో సాధ్యమైనంతవరకు పిల్లల నుంచి దూరంగా ఉండాలని ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. దూరం పెరిగేకొద్దీ మానసికంగా బంధం బలోపేతం అవుతుంది. దీనివల్ల ఎవరి ప్రైవసీ వారికి ఉండి.. ఎవరి వ్యక్తిగత విషయాల్లో వారు జోక్యం చేసుకోకుండా ఉంటారు. ముఖ్యంగా కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆమెను కొడుకు భార్యగా లేదా స్నేహితురాలిని చూస్తూ మంచీ చెడులు చెబితే చాలు.

మీకు ఆ అధికారం లేదు
కోడలిని మందలించే హక్కు, అధికారం అత్తామామలకి లేదని గుర్తించాలని నిపుణులు అంటున్నారు. ఆమె ప్రవర్తనకి సంబంధించిన పూర్తి బాధ్యత, అడిగే అధికారం భర్తకే ఉంటుంది. ఆమెను మందలించే హక్కు తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. భార్యాభర్తల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదు.
ఒకవేళ అత్తామామలు.. కొడుకూకోడలితో కలిసి ఉంటున్నట్లయితే ఎవరి పనులు వారు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎదుటి వ్యక్తి సహాయం అడిగేవరకు వారి పనుల్లో తలదూర్చకూడదు. అయితే వారికి అడగకుండా సహాయం చేస్తే అందుకు తగిన ప్రతిఫలాన్ని ఆశించకూడదు.

జోక్యం తగదు
కొడుకు, కోడలి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు విని ఊరుకోవాలే కానీ వాటిలో తలదూర్చకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈతరం అమ్మాయిలు పెద్దవాళ్ల జోక్యాన్ని అస్సలు ఇష్టపడటం లేదు. వారి మధ్య ఏదైనా గొడవ జరిగితే వారే సామరస్యంగా పరిష్కరించుకుని ఒక్కటవుతారు. మనవళ్ల, మనవరాళ్ల పెంపకం బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులదే.. వారు ఏ స్కూల్‌లో చదవాలి, ఎలా పెరగాలి అనేది వారే చూసుకుంటారని.. పెద్దవాళ్ల జోక్యాన్ని కొందరు యువతరం జంటలు కోరుకోవడం లేదని చెబుతున్నారు.
మీకోసం ఖర్చు చేయండి
మీ కొడుకూకోడలి నుంచి మీరెప్పుడూ గౌరవాన్ని ఆశించకూడదు. వారిలోని సంస్కారమే మిమ్మల్ని గౌరవించేలా చేస్తుంది. ముఖ్యంగా మీరు ఇంతకాలం దాచుకున్న డబ్బును మీ ఆరోగ్యం కోసం, మీ సంతోషం కోసం మాత్రమే ఖర్చు చేసుకోండి. ఆ డబ్బును వృథాగా పోనివ్వకండి. మీ సెకండ్ ఇన్నింగ్స్ సంతోషంగా సాగాలంటే ఇంట్లో వ్యక్తుల స్వేచ్ఛను, అభిప్రాయాలను గౌరవించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని గమనించండి.



Click it and Unblock the Notifications
