Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్!
విడాకులు లేదా ఇడుపు కాయితం అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బంధాలు తెగిపోవడం, బాధలు, కోర్టులు. కానీ ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ డివోర్స్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది. ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికుల్లో, ముఖ్యంగా జంటల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్న ఒక సరికొత్త, ఆసక్తికరమైన ట్రావెల్ ట్రెండ్.

ఏమిటీ ఎయిర్ పోర్ట్ డివోర్స్
దీని అర్థం ఏంటంటే.. కలిసి ప్రయాణిస్తున్న జంటలు లేదా స్నేహితులు విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, సెక్యూరిటీ చెక్ పూర్తయ్యాక తాత్కాలికంగా ఎవరి దారిలో వారు వెళ్లడం. తమ తమ ఇష్టాలకు అనుగుణంగా విమానాశ్రయంలో సమయం గడిపి, మళ్లీ తమ విమానం ఎక్కే ముందు బోర్డింగ్ గేట్ వద్ద మాత్రమే వారు తిరిగి కలుసుకుంటారు.
ఈ వింత ఆలోచన ఎందుకు వచ్చింది?
విమానాశ్రయాలు ఎంత విలాసవంతంగా ఉన్నా, ఒక్కోసారి అక్కడ గడిపే సమయం ప్రయాణికులకు విసుగు తెప్పిస్తుంది. పొడవైన క్యూలైన్లు, రద్దీగా ఉండే టెర్మినల్స్, నిరంతర ప్రకటనలు ప్రయాణాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. దానికి తోడు ఇద్దరు వ్యక్తుల అభిరుచులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఉదాహరణకు ఒకరికి డ్యూటీ ఫ్రీ షాపుల్లో కొత్త వస్తువులు చూడటం, కాఫీ తాగుతూ విండో షాపింగ్ చేయడం ఇష్టం ఉండొచ్చు. మరొకరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ప్రశాంతంగా కూర్చోవడం, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ సినిమా చూడటం లేదా నిద్రపోవడం ఇష్టం ఉండొచ్చు. ఇద్దరూ కలిసి ఒకే దగ్గర ఉంటూ ఒకరి కోసం మరొకరు రాజీపడే కంటే, ఎవరికి నచ్చినట్లు వారు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడమే ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం.
ఒత్తిడి మాయం.. ఉత్సాహం సొంతం
ఈ పద్ధతి వల్ల ప్రయాణంలో వచ్చే సగం ఒత్తిడి మాయమవుతుంది. ఎయిర్ పోర్ట్ లో సమయాన్ని ఎలా గడపాలి, ఎక్కడ తినాలి, ఏ షాపుకి వెళ్లాలి అనే చిన్న చిన్న విషయాలపై వచ్చే అనవసరపు వాదనలకు ఇక్కడ చెక్ పెట్టవచ్చు. ఎవరికి వారు ఒంటరిగా గడపడం వల్ల మెదడుకు ప్రశాంతత దొరుకుతుంది. పైగా గంట లేదా రెండు గంటల పాటు దూరంగా ఉండి మళ్లీ బోర్డింగ్ గేట్ దగ్గర కలుసుకున్నప్పుడు ఇద్దరిలోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇది వారి తదుపరి ప్రయాణాన్ని మరింత సానుకూలంగా మారుస్తుంది.
ఎలా ప్లాన్ చేసుకోవాలి?
ఈ పద్ధతిని ఆచరించడం చాలా సులువు. ఇద్దరూ కలిసి విమానాశ్రయంలోకి ప్రవేశించి చెకింగ్ పూర్తి చేసుకోవాలి. విడిపోయే ముందు ఏ సమయానికి, ఎక్కడ కలవాలో స్పష్టంగా మాట్లాడుకోవాలి. అత్యవసరాల కోసం ఎవరి ఫోన్లు వారు అందుబాటులో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఫైనల్ బోర్డింగ్ అనౌన్స్ మెంట్ కంటే చాలా ముందే నిర్ణీత ప్రదేశానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిక్షణం కలిసే ఉండాలనుకునే జంటలకు ఈ ట్రెండ్ వింతగా అనిపించవచ్చు. కానీ ప్రయాణంలో కాస్త స్వేచ్ఛను, ఏకాంతాన్ని కోరుకునే వారికి మాత్రం ఇదొక బెస్ట్ ఆప్షన్.



Click it and Unblock the Notifications
