Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
ప్రేమ, ట్రామా డేటింగ్.. తేడా గుర్తించలేకపోతే జీవితం నరకమే
కొన్నేళ్ల క్రితం వరకు పెద్ద పెద్ద నగరాలు,పట్టణాలకే పరిమితమైన డేటింగ్ కల్చర్ ఇప్పుడు గ్రామస్థాయిలోకి కూడా చేరింది. అనేక రకాల డేటింగ్ యాప్స్ పెరగడం, సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ చూసిన డేటింగ్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. మంచి భాగస్వామి కోసం వెతికే యువతకు ఇది బెస్ట్ ఆప్షన్ లా కనబడుతోంది. అయితే ఈ డేటింగ్ ల వల్ల కొందరికి జీవితాలు నరకప్రాయంగా కూడా మారిపోతున్నాయి. డేటింగ్ వల్ల భవిష్యత్తులో వారు తమకు సరిపోతారో లేదో అని తెలుసుకోవడానికి సహాయపడుతుందని చాలామంది భావిస్తుంటారు. అయితే చాలామంది ఇక్కడే మోసపోతున్నారు. చాలామంది లవ్ కి, ట్రామా డేటింగ్ కు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..కొందరు అయితే జీవితాలు కూడా కోల్పోతున్నారు.
అసలేంటి ఈ ట్రామా డేటింగ్?
ఎవరైనా అమ్మాయి లేదా అబ్బాయి ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే విడిపోతుంటారు. ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియే. దీని తర్వాత మళ్లీ మరొకరితో డేటింగ్ చేయాలనో లేదా మరో వ్యక్తితో కొత్త జీవితం స్టార్ట్ చేయాలని భావిస్తారు. ఇదేమీ తప్పు కూడా కాదు. ప్రస్తుతం మన సొసైటీలో ఇది జరుగుతున్న విషయమే. అయితే చాలామంది తమ గత బంధంలో ఎదుర్కొన్న అనుభవాలను,బాధలను గుర్తుచేసే స్వభావం ఉండే వ్యక్తినే మళ్లీ సెలక్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తున్న సమయంలో పాత బాధలు,జ్ణాపకలు మళ్లీ గుర్తుకొస్తాయి. ఈ రిలేషన్ కూడా పాతబంధం మాదిరిగానే నరకాన్ని చూపిస్తుంది. అయితే విచిత్రంగా పైకి చూడటానికి ఇది ప్రేమలానే కనిపిస్తుంది.

ఒక వ్యక్తి తన పాత బంధంలో మానసికంగా లేదా శారీరకంగా హింసను ఎదుర్కొని ఉండవచ్చు లేదా వారి భాగస్వామి వారి భావాలను అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. కానీ మళ్ళీ అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికే మీరు ఆకర్షితులయితే దీన్నే ట్రామా డేటింగ్ అంటారు. పదేపదే ఒకేలాంటి చెడ్డ స్వభావం ఉన్న పార్టనర్ దొరకడం యాదృచ్ఛికం కాదు అదొక మానసిక పరిస్థితి అని, బాల్యంలో ఎదురైన నిర్లక్ష్యం, లేదా మానసిక వేదన కారణంగా వారిలో ఈ పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆ బాధాకరమైన అనుభవమే వారికి సాధారణం అనిపిస్తుందని, ప్రేమకు తాము అర్హులం కాదని, తమ విలువ తక్కువని భావిస్తారని.. ప్రేమలో ఇంత మాత్రం బాధ తప్పదని వాళ్లకు వాళ్లే సర్దిచెప్పుకుంటారు అని నిపుణులు తెలిపారు.
దీని నుంచి ఎలా బయటపడాలి?
ఏ బంధంలో అయినా సరే సంతోషంతో పాటు కన్నీళ్లు, మానసిక వేదన, గందరగోళం ఉంటాయి. కానీ ట్రామా డేటింగ్ ఎవరికీ మంచిది కాదు. దీన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మీ భాగస్వామిలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తపడండి.
-మిమ్మల్ని ఎప్పుడూ అదుపులో పెట్టాలని చూసే వ్యక్తికే మీరు ఆకర్షితులవుతున్నారా?
-మీకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండని వారిపైనే మనసు పడుతున్నారా?
-వారు మిమ్మల్ని గౌరవించకపోయినా కూడా మీరే సర్దుకుపోతున్నారా?
-మీరు పదేపదే వారికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోందా?
-బహుశా నాదే తప్పేమో అని మీపై మీకే అనుమానం కలుగుతోందా?
-కాలంతో పాటు వాళ్ళు మారతారులే అని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా?
ఇలాంటివి కనిపిస్తే అవి మీ బంధంలో రెడ్ ఫ్లాగ్స్ అని గ్రహించండి. వెంటనే ఆ బంధానికి బైబై చెప్పడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications