Latest Updates
-
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.!
ప్రియుడితో కలిసి భర్తని చంపి..ఆస్కార్ లెవల్ యాక్టింగ్ చేసిన భార్య..వీడియో చూడండి!
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో జరిగిన ఓ సుగంధ ద్రవ్యాల వ్యాపారి హత్య కేసు.. వినడానికే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దొంగల పని అని మొదట భావించిన ఈ కేసులో, వెలుగుచూసిన నిజాలు పోలీసులనే విస్మయానికి గురిచేశాయి. ప్రేమ, పెళ్లి, నమ్మకద్రోహం, అక్రమ సంబంధం చుట్టూ తిరిగిన ఈ ఉదంతం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
ఏప్రిల్ 7వ తేదీ రాత్రి 28 ఏళ్ల దేవకృష్ణ అనే వ్యాపారి తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యాడు. పదునైన ఆయుధంతో అతడు నరికి చంపబడ్డాడు. ఈ ఘటనపై అతని భార్య ప్రియాంక (25) పోలీసులకు ఒక కట్టుకథ అల్లింది.

ఇంట్లోకి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారని, రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారని, వారిని అడ్డుకోబోయిన తన భర్తను దారుణంగా చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతేకాదు దొంగలు తనను తాళ్లతో కట్టేశారని నమ్మబలికింది.
కన్నీళ్ల వెనుక కిరాతక కుట్ర..
పోలీసుల విచారణలో అసలు కథ బయటపడింది. ప్రియాంక మాటల పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దొంగిలించబడ్డాయని ఆమె చెప్పిన నగలు ఇంట్లోనే దొరకడం, అలాగే ఆమె మొబైల్ కాల్ డేటాను విశ్లేషించడంతో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి.
దేవకృష్ణ, ప్రియాంకల వైవాహిక జీవితం మొదటి నుంచీ సజావుగా లేదు. నువ్వు చాలా నల్లగా ఉంటావు.. నా అందానికి నువ్వు సరిపోవు.. నాకు ఇంకా మంచి భర్త రావాలి అంటూ ఆమె ఎప్పుడూ దేవకృష్ణను అవమానిస్తూ ఉండేదని మృతుడి సోదరి జ్యోతి వాపోయింది. ఇదే క్రమంలో రాజ్‌గఢ్ కు చెందిన కమలేష్ పురోహిత్ (32) అనే వ్యక్తితో ప్రియాంకకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడి మోజులో పడిన ఆమె, తన భర్తను అడ్డుతొలగించుకోవాలని పక్కా స్కెచ్ వేసింది.
లక్ష రూపాయల సుపారీ..
కమలేష్ తన స్నేహితుడైన సురేంద్ర భాటి అనే కిరాయి హంతకుడికి లక్ష రూపాయలకు సుపారీ ఇచ్చాడు. అడ్వాన్స్ గా రూ.50 వేలు చెల్లించాడు. పథకం ప్రకారం హత్య జరిగిన రాత్రి ప్రియాంక కావాలనే ఇంటి తలుపులు తీసి ఉంచింది. ఇంట్లోకి ప్రవేశించిన సురేంద్ర.. గాఢ నిద్రలో ఉన్న దేవకృష్ణను దారుణంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఇదంతా దొంగల పనిగా నమ్మించేందుకు ఇంట్లోని వస్తువులను చిందరవందర చేసి నాటకమాడారు.
పోలీసుల ఎంట్రీ.. నిందితుల అరెస్ట్
పోలీసుల కఠిన విచారణలో ప్రియాంక తన నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం ప్రియాంక, ఆమె ప్రియుడు కమలేష్ లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కిరాయి హంతకుడు సురేంద్ర కోసం గాలిస్తున్నారు. హత్యకు ముందు మృతుడికి ఏదైనా మత్తుమందు ఇచ్చారా అనే కోణంలో ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నారు.
కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
ఈ దారుణ ఘటనతో మృతుడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దేవకృష్ణ తల్లి ఖేంచీ బాయి కన్నీరు పెట్టుకుంటూ..నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలి. నాకు న్యాయం మాత్రమే కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. తన సోదరుడు కుటుంబ పరువు కోసం భార్య పెట్టే హింసను భరించాడని, కానీ ఆ రాక్షసి ఇలా చేస్తుందని ఊహించలేకపొయామని సోదరి జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది.



Click it and Unblock the Notifications