Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
మీ భాగస్వామిని మీ అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ?
భార్యాభర్తల్లో ఒకరు మరొకరిని కంట్రోల్ చేయాలని భావిస్తే.. ఆ రిలేషన్ విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు చెప్పినదానికి అంగీకరించే వాళ్లను, మీ అభిరుచులకు తగ్గ వాళ్లను పార్ట్ నర్స్ గా ఎంచుకోవడం వల్ల..
చాలామంది భార్యలను అదుపులో పెట్టుకోవాలని, తమ కంట్రోల్ లో ఉంచుకోవాలని భావిస్తారు. ఇలా కంట్రోల్ చేస్తే.. తమ భార్యలను తమ మాటే వింటారని, తమరిదే.. ఆధిపత్యం కావాలనే ఉద్ధేశ్యంతో.. ఇలా బిహేవ్ చేస్తారు. కానీ.. రిలేషన్ షిప్ లో ఇలా పవర్ సాధించాలని భావిస్తే.. ఆ అందాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

భార్యాభర్తల్లో ఒకరు మరొకరిని కంట్రోల్ చేయాలని భావిస్తే.. ఆ రిలేషన్ విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు చెప్పినదానికి అంగీకరించే వాళ్లను, మీ అభిరుచులకు తగ్గ వాళ్లను పార్ట్ నర్స్ గా ఎంచుకోవడం వల్ల.. మీరు మీ భాగస్వామిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇప్పుడు మీ భార్యను కంట్రోల్ చేయడం వల్ల అందమైన రిలేషన్ లో ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..

ఊపిరాడని పీలింగ్
ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అంటూ.. ప్రతిసారీ అడ్డుచెబితో.. రిలేషన్ లో బందీ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ల తమ రిలేషన్ లో తప్పు నిర్ణయం తీసుకున్నామని.. విచారిస్తారు.

రెబల్
ప్రతిసారీ కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తే.. ఏదో ఒకరోజు మీ భార్య మీపై రెబల్ గా బిహేవ్ చేయవచ్చు. దీనివల్ల మీరే వాళ్ల లైఫ్ లో నుంచి బయటకువెళ్లాల్సి వస్తుంది.

అపార్థాలు
కొన్నిసార్లు.. మీ అభిప్రాయాలు సరైనవి కావచ్చు. కానీ.. మీ పాయింట్ పైనే.. ఇతరులు అంగీకరించాలని ఒత్తిడి చేస్తే.. మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

మీ భాగస్వామి కూడా
కొంతమంది తమ పార్ట్ నర్స్ ని ఇమిటేట్ చేసే అవకాశాలుంటాయని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. కాబట్టి.. మీరు మీ భాగస్వామిని కంట్రోల్ చేస్తే.. వాళ్లు కూడా మీపై రివెంజ్ తీర్చుకోవడానికి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు.

వ్యక్తిగత ఫ్రీడం
రిలేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రీడంను క్రియేట్ చేయాలి. ఒకవేళ ఫ్రీడం కోల్పోయారంటే.. ఆ రిలేషన్ కి విలువ ఉండదు.

ద్వేషం
ఒకవేళ మీరు మీ భార్యను కంట్రోల్ చేయాలని చూస్తే.. వాళ్లు మీపై ద్వేషం పెంచుకుంటారు. కాబట్టి మరీ ఎక్కువగా భార్యపై భర్త, భర్తపై భార్య కంట్రోల్ చేయాలని ప్రయత్నించకూడదు.



Click it and Unblock the Notifications
