పురుషులు వీటి గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు ? పురుషుల 9 రహస్య భయాలు ఇవే !

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఏంటి పురుషులకు కూడా రహస్య భయాలు ఉంటాయా ? అంటే దానికి అవును అనే సమాధానం వస్తుంది. జీవితంలో ఎదో ఒక సమయంలో ప్రతి ఒక్క మనిషి కొన్ని రకాల అభద్రతా భావాలకు లోనవుతూ ఉంటాడు. కానీ, సమయం గడుస్తున్నా కొద్దీ కొద్దిగా పరిపక్వతతో కూడిన పరిణితి చెందిన పురుషులు వారి యొక్క భయాలను వారి అంతట వారే భయాలను అధిగమిస్తారు. కానీ, కొంతమంది అలా చేయకుండా వెనకపడిపోతారు.

పురుషులకు అతిపెద్ద భయాలు ఏవి అనే విషయమై మీరు ఆశ్చర్యపోతున్నారా ? భయాలను వర్గీకరణ చేయడం అనేది చాలా కష్టం. కానీ, పురుషులకు ఒకటి కి మించిన భయాలు అయితే ఉన్నాయి. అసలు నిజం ఏమిటంటే, ఎప్పుడైతే యుక్త వయస్సులోకి వస్తారో ఆ సమయంలో తమకు గడ్డం వస్తుందా లేదా మరియు తాము ప్రపంచానికి పురుష లక్షణాలతో కనపడతామా లేదా అనే విషయమై రహస్యంగా ఆందోళన చెందుతూ ఉంటారు.

man's greatest fears

సాధారణంగా యుక్త వయస్సు దాటిన తర్వాత తాము పడక గదిలో మంచి ప్రదర్శన ఇవ్వగలమా లేదా అనే విషయమై రహస్యంగా ఆందోళన చెందుతూ ఉంటారు. 25 సంవత్సరాలు దాటిన తర్వాత తాము సంపాదించే డబ్బు తో పిల్లలని పెంచగలమా మరియు ప్రయోజకులని చేయగలమా అనే విషయమై ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి భయాలు ఎన్నో పురుషుల్లో ఉంటాయి. కానీ, ఈ భయాలన్నింటిని నెమ్మదిగా అధిగమిస్తూ ఉంటారు. పురుషల యొక్క అతి పెద్ద భయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

నేను వారికి సరిపోయే అంత పెద్దవాడిలా ఉన్నానా ?

నేను వారికి సరిపోయే అంత పెద్దవాడిలా ఉన్నానా ?

సాధారణంగా ప్రతి ఒక్క పురుషుడు స్త్రీలను ఆకర్షించే అంత శక్తి గాని లేక అంత పెద్ద బలవంతుడిలా తాము లేమని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. బాగా శరీర సౌష్టం ఉన్నవారికి, కండలు తిరిగిన శరీరం గల వారినే స్త్రీలు ఇష్టపడతారని చాలా మంది పురుషులు అనుకుంటూ ఉంటారు. కాబట్టి చాలామంది పురుషులు తమ శరీరం గురించి రహస్యంగా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు.

నా భార్య నన్ను ఏమైనా మోసం చేస్తోందా ?

నా భార్య నన్ను ఏమైనా మోసం చేస్తోందా ?

కొంత మంది పురుషులు తమ భార్యలు తమను మోసం చేస్తున్నారా అనే విషయమై ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా 45 సంవత్సరాలు దాటినా పురుషులు ఎవరైతే పడక గదిలో తమ సామర్ధ్యాన్ని సహజంగానే కోల్పోతారో అలాంటి వారిలో ఈ రకమైన భయాలు ఎక్కువగా ఉంటాయి.

నేను తగినంత డబ్బుని సంపాదించగలనా ?

నేను తగినంత డబ్బుని సంపాదించగలనా ?

డబ్బు ఉంటేనే స్త్రీలు పురుషులను ప్రేమిస్తారు అని చాలా మంది పురుషులు ఒక భ్రమలో ఉంటారు. హోదా, డబ్బు మరియు ఐశ్వర్యం పురుషుడి యొక్క మొత్తం స్థితిని మరింత పెంచుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

కానీ, డబ్బు ఒక్కటే మంచి సంబంధ బాంధవ్యాలను తీసుకు వస్తుంది అనడంలో అర్ధం లేదు.కానీ, చాలామంది పురుషులకు తాము బాగా సంపాదించగలమా లేదా అనే విషయమై ఎక్కువగా భయపడుతూ ఉంటారు. మరి కొంతమంది పురుషులు అయితే తమ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకుంటే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనే విషయమై ఎక్కువగా అలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు.

తమ యొక్క కన్యత్వాన్ని నపుశకత్వంగా భావిస్తారా ?

తమ యొక్క కన్యత్వాన్ని నపుశకత్వంగా భావిస్తారా ?

అనుభవం లేకపోతే తమకు నపుశకత్వం ఉందని భావిస్తారా ? అనే విషయమై పురుషులు భయపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో వారి యొక్క గతాన్ని గుర్తుచేసుకుంటూ వారికి ఉన్న వ్యవహారాల గురించి చెప్పడం మొదలు పెడతారు. ఇది ఒక అర్ధంలేని భయం అనే చెప్పాలి. కానీ, ఇలా చెప్పడం వల్ల తమను తాము మన్మదుడిగా ప్రపంచానికి చూపించడం ద్వారా మంచి ఆకర్షణీయమైన స్త్రీ తమను ఎక్కువగా ఇష్టపడే అవకాశాలు ఉన్నాయని పురుషుడు భావిస్తుంటాడు.

ఆమె నా యొక్క పురుషాంగ పరిమాణాన్ని ఆమె యొక్క గత ప్రియుడి పరిమాణంతో పోల్చి చూసుకుంటుందా ?

ఆమె నా యొక్క పురుషాంగ పరిమాణాన్ని ఆమె యొక్క గత ప్రియుడి పరిమాణంతో పోల్చి చూసుకుంటుందా ?

ఇలాంటి ఒక రహస్య ఆందోళన చాలామంది పురుషుల్లో కలుగుతూ ఉంటుంది. తన ప్రియురాలు తన పురుషాంగ పరిమాణాన్ని ఆమె యొక్క గత ప్రియుడి పరిమాణంతో పోల్చి చూసుకొని నన్ను వదిలి వెళ్లిపోతుందా అనే విషయమై ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది వినడానికి చాలా వెర్రిగా తెలివితక్కువ విషయంగా అనిపించవచ్చు. కానీ, చాలా మంది పురుషులు వారి యొక్క పురుషాంగ పరిమాణం గురించి ఆలోచిస్తూ ఉంటారు.

ఆమెకు సన్నిహితమైన పురుష స్నేహితులు ఉన్నారా ?

ఆమెకు సన్నిహితమైన పురుష స్నేహితులు ఉన్నారా ?

తమ భాగస్వామికి తెలిసిన వారిలో ఎవరైనా ఆకర్షణీయమైన పురుషులు గనుక ఉంటే వారిని పురుషుడు రహస్యంగా ద్వేషిస్తూ ఉంటాడు. కొంతమంది పురుషులు అయితే రహస్యంగా తమ ప్రియురాలి స్నేహితుల గురించి తెలుసుకోవడానికి ఫేస్ బుక్ లో వెతుకుతూ ఉంటారు. ఏ వ్యక్తి కూడా అంత ఆకర్షణీయంగా ఉండకూడదు అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఇలా చేస్తుంటారు.

ఆమెకు సరితూగే పొడవుతో నేను ఉన్నానా ?

ఆమెకు సరితూగే పొడవుతో నేను ఉన్నానా ?

బాగా పొడవుగా ఉన్న పురుషులు పొట్టిగా ఉన్న స్త్రీలు తమని గుర్తిస్తారా లేదా అని మరియు పొట్టిగా ఉన్న పురుషులు ఏమో స్త్రీలు పొడవుగా ఉన్న స్త్రీలనే ఇష్టపడతారని ఇలా పురుషుల్లో రకరకాల భయాలు ఉన్నాయి. కానీ, పొడవు లేదా పొట్టిగా ఉన్న పురుషుల్లో ఉన్న ఈ అనుమానాలు అన్నీ తప్పు. స్త్రీలు ప్రేమలో పడాలి అని ఖచ్చితంగా అనుకుంటే ప్రేమలో పడతారు. పొడవు అనే విషయం ప్రేమను శాసించ లేదు.

నేను గనుక ఏడిస్తే బలహీనుడిని అని అర్ధమే ?

నేను గనుక ఏడిస్తే బలహీనుడిని అని అర్ధమే ?

తాము గనుక బహిరంగంగా ఏడిస్తే తమని అందరూ బలహీనులుగా భావిస్తారని చాలా మంది పురుషులు రహస్యంగా భయపడుతూ ఉంటారు. పురుషులకు కూడా ఏడవాలి అనే భావన అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కానీ, వాళ్ళు బలవంతులు అని నిరూపించుకోవడానికి తమను తాము నిగ్రహించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో మరింత ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంది.

తాము గనుక బహిరంగంగా ఏడిస్తే తమని అందరూ బలహీనులుగా భావిస్తారని చాలా మంది పురుషులు రహస్యంగా భయపడుతూ ఉంటారు. పురుషులకు కూడా ఏడవాలి అనే భావన అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కానీ, వాళ్ళు బలవంతులు అని నిరూపించుకోవడానికి తమను తాము నిగ్రహించుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారిలో మరింత ఒత్తిడి పెరిగిపోయే అవకాశం ఉంది.

English summary

Secret Fears Of Men

What? Do men have secret fears? Of course, yes. Every human being may have certain insecurities at some or the other point in life. Of course, some men conquer their fears as they mature whereas some men don't. Are you wondering what could be man's greatest fears? Read this!.
Story first published: Tuesday, December 19, 2017, 20:00 [IST]