Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
యావరేజ్ స్టూడెంట్ నని ఆ అబ్బాయి నన్ను అలా వాడుకున్నాడు, ఇంటర్ అయిపోయాక ముఖం చాటేశాడు #mystory354
రోజుకొక డ్రెస్ స్టైల్ లో.. రోజొకొక హెయిర్ స్టైల్ తో తనని మైమరిపించేదాన్ని. ఒకరోజు మా ఊరిలో జాతర జరిగినప్పుడు తను సైకిల్ పై ఎక్కించుకుని నన్ను జాతరకు తీసుకెళ్లాడు. అతనితో ఉంటే ఏదో ఒక తెలియని ప్రపంచంలో
చాలా మంది లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ అంటూ ఉంటారు. నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి కూడా అలాగే నాకు ప్రపోజ్ చేశాడు. తను బైపీసీ... నేను ఎంపీసీ. కానీ చాలా వరకు ఒకే క్లాస్ రూమ్ ల్లోనే కూర్చొనేవాళ్లం. నేను కాస్త డల్ స్టూడెంట్ ని.
తన బాట్నీ, జువాలజీ క్లాస్ లు తప్ప మిగతా క్లాసుల్లో మేమిద్దరం ఒకే గదుల్లోనే ఉండేవాళ్లం. ఆ రోజు తెలుగు మాష్టార్ క్లాస్ చెబుతూ ఉన్నారు.

తదేకంగా అతడి చూపులు
ఎంతో ఆసక్తిగా పాఠం వింటున్న నాకు వెనక నుంచి ఎవరివో చూపులు గుచ్చుకుంటున్నట్లుగా అనిపించాయి. తిరిగి చూశాను. అంత వరకు నా వంకే తదేకంగా చూస్తున్న అతడి చూపులు ఒక్కసారిగా డెస్క్ లోని బుక్స్ వైపు వెళ్లాయి.

నాకు పండుగలాగానే ఉండేది
తను నన్ను ఇష్టపడుతున్నాడని నాకు అర్థమైంది. కానీ అర్థంకానట్లు కొన్నాళ్లు నటించాను. ఒక రోజు తనే ప్రపోజ్ చేశాడు. నేను ఒకే అన్నాను. ఇక ఆ తర్వాత ప్రతి రోజూ నాకు పండుగలాగానే ఉండేది.

మైమరిపించేదాన్ని
రోజుకొక డ్రెస్ స్టైల్ లో.. రోజొకొక హెయిర్ స్టైల్ తో తనని మైమరిపించేదాన్ని. ఒకరోజు మా ఊరిలో జాతర జరిగినప్పుడు తను సైకిల్ పై ఎక్కించుకుని నన్ను జాతరకు తీసుకెళ్లాడు. అతనితో ఉంటే ఏదో ఒక తెలియని ప్రపంచంలో విహరిస్తున్నట్లు ఉండేది.

ఇంటర్ రెండేళ్లు
నన్ను తను పొగిడినంతగా ఎవరూ పొగిడి ఉండరు. అలా ఇంటర్మీడియట్ రెండేళ్లు తెలియని లోకంలో విహరించాం. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక తను నీట్ కోచింగ్ కు అని విజయవాడ వెళ్లాడు. అంతవరకు నాతో బాగానే ఉన్నాడు.

అక్కడికి వెళ్లాక
కానీ అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేయలేదు. కోచింగ్ సెంటర్ లో ఫోన్ అలో చేయరనుకున్నాను. తనకోసం చాలా రోజులు ఎదురు చూశాను. ప్రతి రోజూ తనే గుర్తొచ్చేవాడు.

తను కాలేజీ ఫస్ట్
ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. తను కాలేజీ ఫస్ట్ వచ్చాడు. పాంప్లేట్స్ లో తన ఫొటో చూసి ఎంతో సంతోషించాను. తను నా మనిషి అనే ఫీలింగ్ నా నరనరాల్లో ఉండేది. కానీ నాపై తనకున్న ప్రేమ చాలా తాత్కాలికమని చాలా రోజులకు తెలిసింది.

మంచి కాలేజీలో..
నేను డిగ్రీ మా ఊరి పక్కనే ఉండే చిన్నపట్నంలో చేరాను. తను మాత్రం నీట్ ర్యాంక్ కొట్టి మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. డబ్బున్న వాళ్లకు పేదోళ్లు చులకన. బాగా చదివే వారికి యావరేజ్ స్టూడెంట్స్ అంటే చులకన.

వాడుకున్నాడు.. వదిలేశాడు
ఇంటర్ లో నేను యావరేజ్ స్టూడెంట్ ని. తను బాగా క్లెవర్. తను ట్రై చేస్తే నాలాంటి యావరేజ్ స్టూడెంట్ ఈజీగా పడిపోతుంది. అందుకే నాకు ట్రై చేశాడు. కొన్నాళ్లు వాడుకున్నాడు. తర్వాత వదిలేశాడు.

మా బావకు ఇచ్చి పెళ్లి చేశారు
ఎప్పుడైనా సెలవులకు ఊరికొచ్చినా కూడా తనకు నేను అస్సలు పరిచయం లేనట్లు నటించేవాడు. కానీ నేను మాత్రం చాలా రోజులు అతన్నే తలుచుకున్నాను. తనతో గడిపిన క్షణాలు ఎప్పుడూ గుర్తొచ్చేవి. నేను డిగ్రీలో ఉండగానే మా వాళ్లు మా బావకు ఇచ్చి పెళ్లి చేశారు.

జ్ఞాపకాలన్నీ కదలాడుతుంటాయి
ఇప్పుడు నాకు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇప్పటికీ స్టూడెంట్స్ ని చూసినా.. టీవీలో లవ్ ఫెయిల్యూర్ సినిమాలు చూసినా తనే గుర్తొస్తాడు. ఊరికెళ్లినప్పుడు మా కాలేజీ ముందే బస్ వెళ్తూ ఉంటుంది.. అప్పుడు ఆ
జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు అలా కదలాడుతుంటాయి.

ప్రేమించి వారిని
అందరమ్మాయిలు ప్రేమించి వారిని గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు తెలీదు కానీ నాలాంటి కొందరమ్మాయిలు చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటారు.



Click it and Unblock the Notifications
