ఫస్ట్ నైట్ రోజూ ఎంత టెంప్ట్ చేసినా టచ్ కూడా చెయ్యలేదు - My Story #97

Written By:
Subscribe to Boldsky

అతను బెంగళూర్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవాడు. ఒక్కడే కుమారుడు. అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. ఆస్తి బాగుంది. అమ్మాయికి ఏ కష్టం రాదు అని ఒక వ్యక్తి చెప్పిన మాటలను విని మా అమ్మానాన్నలు సంతోషపడ్డారు. తర్వాత మా నాన్న నా అభిప్రాయమడిగాడు.

అబ్బాయి ఫొటో చూపించారు. అబ్బాయి బాగున్నాడు. మంచి జీతం, మంచి ఉద్యోగం ఉందని తెలిసి నేను కూడా ఒకే అన్నాను. ముఖ్యంగా అతనికి బాగా ఆస్తి ఉందని నేను కూడా పెళ్లికి ఒకే అన్నాను.

ఎంగేజ్ మెంట్

ఎంగేజ్ మెంట్

తర్వాత ఇద్దరి కుటుంబాల పెద్దవాళ్లు మాట్లాడుకుని మాకు ఎంగేజ్ మెంట్ ఒకే చేశారు. పెళ్లి వేసవిలో చేయాలని నిర్ణయించారు. పెళ్లికొన్ని రోజులు ఉంది అనే సమయంలో నేను అతని ఫోన్ నంబర్ సంపాదించాను.

సుమతి తన భర్తతో గంటల తరబడి చేసేది

సుమతి తన భర్తతో గంటల తరబడి చేసేది

అంతకు ముందు అతని ఫోన్ కోసం చాలా రోజులు ఎదురు చూశాను. అయితే ఫలితం లేకపోవడంతో చివరకు నేనే నంబర్ సంపాదించాను. నా ఫ్రెండ్ సుమతికి కూడా ఎంగేజ్ మెంట్ అయిపోయింది. తనకు కాబోయే భర్తతో రోజూ ఫోన్లో చాటింగ్ చేసేది. గంటల తరబడి మాట్లాడేది.

ఏవేవో చెయ్యాలని ఉబలాటం

ఏవేవో చెయ్యాలని ఉబలాటం

నేనూ కూడా అందరిలాంటి అమ్మాయినేగా.. నాకు కాబోయే భర్తతో కబుర్లు చెప్పుకోవాలనీ అనిపిస్తుందిగా. అప్పుడప్పుడు నాకు కాబోయే వ్యక్తిని చాటుమాటుగా కలుసుకుని ఏవేవో పనులు చెయ్యాలని తెగ ఉబలాటంగా ఉండేది.

గంటల తరబడి సరసాలు

గంటల తరబడి సరసాలు

కానీ నాకు కాబోయే భర్త వాటిపై పెద్దగా ఆసక్తి చూపేవాడు కాదు. ఇక తట్టుకోలేక నేనే ఓసారి మెసేజ్ చేశాను. నేను ఆఫీసులో కాస్త బిజీగా ఉన్నాను. పెళ్లి అయిన తర్వాత ఇద్దరం గంటల తరబడి సరసాలు చేసుకుందాం అన్నాడు.

ఫస్ట్ నైట్

ఫస్ట్ నైట్

నేను కూడా పాపం పని ఒత్తిడితో ఉన్న అతన్ని ఎందుకు డిస్ట్రబ్ చెయ్యడం అని చేసేదాన్ని కాదు. ఇక మా పెళ్లిని మా అమ్మానాన్న ఘనంగా నిర్వహించారు. మా ఇద్దరికీ మా ఇంట్లోనే ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు.

అస్సలు టచ్ చెయ్యలేదు

అస్సలు టచ్ చెయ్యలేదు

ఏదేదో ఊహించుకుని నేను బెడ్రూమ్ లోకి అడుగుపెట్టాను. అయితే ఆ రోజు మా ఆయన నన్ను అస్సలు టచ్ చెయ్యలేదు. ముందు మనం ఫ్రెండ్స్ లా ఉందాం.. ఒకర్నొకరం బాగా అర్థం చేసుకున్నాక తర్వాత కాపురం స్టార్ట్ చేద్దాం అన్నాడు.

ఫుల్ ఎంజాయ్ చేయాల్సింది పోయి..

ఫుల్ ఎంజాయ్ చేయాల్సింది పోయి..

ఇదేంటి ఫస్ట్ నైట్ రోజు ఫుల్ ఎంజాయ్ చేయాల్సింది పోయి విచిత్రంగా మాట్లాడుతున్నాడని అనిపించింది. తర్వాత మేమిద్దరం సిటీకి వెళ్లాం. మా ఆయన సిటీలోనే జాబ్ చేస్తాడు. సిటీలో పెద్ద ఫ్లాట్ కూడా కొన్నాం.

కొత్త పెళ్లాన్ని పక్కన ఉన్నా కూడా

కొత్త పెళ్లాన్ని పక్కన ఉన్నా కూడా

మా ఇద్దరినీ ఎవరూ డిస్ట్రబ్ చేసేవారు కాదు. అయినా మా ఆయన నన్ను టచ్ చేసేవాడు కాదు. కొత్త పెళ్లాన్ని పక్కన ఉన్నా కూడా ఎప్పుడూ టీవీ చూస్తూ ఉండేవాడు. ఇక ఫోన్లో వాట్సాప్ లో గంటల కొద్దీ చాటింగ్‌ చేసేవాడు.

బాత్రూమ్‌కు వెళ్లినా

బాత్రూమ్‌కు వెళ్లినా

నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. బాత్రూమ్‌కు వెళ్లినా కూడా ఫోన్‌ వదిలిపెట్టేవాడు కాదు. నాకు ఏమి అర్థం అయ్యేది కాదు. నేనే చొరవతో మాట్లాడడానికి ప్రయత్నించేదాన్ని. అయితే మొహం చిట్లించేవాడు.

మన మధ్య ఏమి జరగలేదు

మన మధ్య ఏమి జరగలేదు

కొన్ని రోజుల తర్వాత నేనంటే తనకు ఇష్టం లేదని అర్థమైంది. ఒక రోజు నిలదీశాను. పెళ్లయి ఇన్నాళ్లు అయినా కనీసం మన మధ్య ఏమి జరగలేదు. ఏదో నువ్వు బిజీగా ఉంటున్నావని నేను కూడా ఏమి అనడం లేదన్నాను.

నా మరదలు రాణిని ప్రేమించాను

నా మరదలు రాణిని ప్రేమించాను

నువ్వంటే నాకు ఇష్టం లేదన్నాడు. నేను షాక్ తిన్నాను. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగాను. నేను నా మరదలు రాణిని ప్రేమించాను. అయితే మావాళ్ల బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నా అన్నాడు. నాకు ఏడుపు తన్నుకొచ్చింది.

రాత్రి పూట అది నాకు దక్కేది కాదు

రాత్రి పూట అది నాకు దక్కేది కాదు

ఆ మరుసటి రోజు నుంచి నన్ను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. రాత్రి పూట మల్లెపూలు పెట్టుకుంటే తిట్టేవాడు. రాత్రి పూట అతని నుంచి నేను ఏదైతే ఆశిస్తానో అది నాకు దక్కేది కాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా నాకు నిద్రలేని రాత్రులే దిక్కయ్యాయి.

మా ఇద్దరి మధ్య అది జరగలేదు

మా ఇద్దరి మధ్య అది జరగలేదు

చాలా రోజులై తనలో మార్పు లేకపోయేసరికి మా అమ్మనాన్నకు విషయం చెప్పాడు. తర్వాత మా అత్తమామలకు చెప్పాను. మా ఆయన్ని అందరూ కలిసి తిట్టారు. నాకు ధైర్యం చెప్పారు. కానీ మా ఇద్దరి మధ్య అది జరగలేదు. మా అమ్మకు విషయం చెప్పాను.

సంసారానికే పనికి రాడు

సంసారానికే పనికి రాడు

నేనే స్వయంగా రంగంలోకి దిగా. మా ఆయన ప్రేమించిన

ఇక ఒక రోజు రాణికి ఫోన్ చేశాను. ఆమె చెప్పిన మాటలకు షాక్ తిన్నాను. మీ ఆయనకు నాకు నెలకు పదివేలు ఇస్తాడు. నేను తనతో మాట్లాడుతున్నట్లు నటించమంటాడు. మీ ఆయన సంసారానికే పనికి రాడు అని రాణి చెప్పింది.

అబ్బాయిలతో లైంగిక సంబంధాలు

అబ్బాయిలతో లైంగిక సంబంధాలు

మీ ఆయనకు అబ్బాయిలంటేనే బాగా ఇష్టం. మీ ఆయనకు అబ్బాయిలతో లైంగిక సంబంధాలున్నాయని చెప్పింది. అవన్నీ వినే సరికి నేను మూగబోయాను. తర్వాత మా ఆయన్ని నిలదీశాను. మా ఆయన నిజం ఒప్పుకున్నాడు. తనకు మగతనం లేదని తాను సంసారానికి పనికిరానని చెప్పాడు.

వాళ్లకు ముందే తెలుసు

వాళ్లకు ముందే తెలుసు

నాకు విడాకులు ఇస్తానన్నాడు. నా బతుకు ఇలా బుగ్గిపాలు అవుతుందనుకోలేదు. తర్వాత మేము విడాకులు తీసుకున్నాం. అయితే మా ఆయన గురించి వాళ్లింట్లో వాళ్లకు ముందే తెలుసు అట. అయినా కూడా వాళ్లు అలా చేశారు.

 సంసారానికి పనికి వస్తాడా?

సంసారానికి పనికి వస్తాడా?

ఇప్పుడు ప్రతి అమ్మాయికి నేను చెప్పేదేమిటంటే ఈ కాలంలో అమ్మాయి తరుఫు వారు అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో చూస్తున్నారుకానీ అసలు అతను సంసారానికి పనికి వస్తాడా లేదా మాత్రం ఎవరూ తెలుసుకోలేరు. అయినా ఆ విషయం పెళ్లికి ముందు ఏ మగాడు బయటపెట్టడం లేదు. పెళ్లి అయ్యాక అమ్మాయిల జీవితాల్ని నాశనం చేస్తున్నారు. నాలాగా ఏ అమ్మాయి జీవితం నాశనం కాకూడదని కోరుకుంటున్నాను.

English summary

i married my husband only for the money

i married my husband only for the money
Story first published: Monday, February 26, 2018, 11:31 [IST]