Latest Updates
-
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026 -
ఎండలకు నోటికి ఏదీ రుచించడంలేదా? అయితే కమ్మటి మునక్కాడ రసం'ట్రై చేయండి -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమేనా? -
వైవాహిక అత్యాచారం: పెళ్లి తర్వాత కూడా 'నో' చెప్పే హక్కు లేదా? చట్టాల్లో మార్పులు తప్పనిసరా? -
వాట్సాప్లో పెళ్లి పత్రికలు వస్తున్నాయా? ఈ ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ!
relationship problems:కపుల్స్ మధ్య కలహాలకు ప్రధాన కారణాలేంటో తెలుసా...
కపుల్స్ మధ్య కలహాలకు ప్రధాన కారణాలేంటో తెలుసుకుందాం.
వివాహం తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో అనేక దశలు ఉంటాయి. అందులో మీ రిలేషన్ షిప్ ఎలా ఉంటుందనే దానిపై మీ భాగస్వామి మరియు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.

అందులో మంచి దశలు ఉండొచ్చు.. కొన్ని చెడు దశలు కూడా ఉండొచ్చు. మంచి దశలేంటంటే.. మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటారు. పెళ్లి తర్వాత మీరిద్దరూ ఎంతలా కలిసిపోతారంటే.. జీవితాంతం ఒకరినొకరు వదిలి ఉండలేనంతగా కలిసిపోతారు.

అయితే చెడు దశల గురించి చాలా మంది పట్టించుకోరు.. అయితే అవి ఎందుకొస్తాయి.. వాటికి గల కారణాలేంటి.. ఆ దశల గురించి మీరు ఆలోచిస్తున్నట్లయితే.. వాటిలో ముఖ్యమైన దశల గురించి మేము మీకు తెలియజేస్తాం. ఆ వివరాలేంటో ఇప్పుడే చూసెయ్యండి...

సీక్రెట్ గా ఉంచడం..
వివాహం తర్వాత ఆరోగ్యకరమైన మీ రిలేషన్ షిప్ లో కీలకమైనది పారదర్శకత(Transperancy)ను కాపాడుకోవడం. ముఖ్యంగా ఒకరినొకరు విశ్వసించడం. ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ రిలేషన్ షిప్ జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అయితే మీరు ఎప్పుడైతే కొన్ని విషయాలను మీ పార్ట్ నర్ వద్ద ప్రస్తావించరో.. అప్పుడే మీ బంధంలో చెడు దశ ప్రారంభమవుతుంది. ఇది మీ సంబంధాన్ని నిజంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి, మీరు మీ సంబంధంలో ఒక దశకు చేరుకున్నట్లయితే, మీ భాగస్వామి మీ నుండి ఏదైనా వస్తువులను దాచిపెట్టడం వంటివి చేస్తే, మీ రిలేషన్ షిప్ లో రెడ్ లైట్ సిగ్నల్ స్టార్ట్ అయినట్టే.

ఎక్కడికి వెళ్లకుండా..
మీరు ఏదైనా రిలేషన్ షిప్ లోకి ప్రవేశించినప్పుడు, మీ సంబంధంలో స్థిరత్వం, నిజాయితీ మరియు అనుకూలత వైపు కదులుతున్నట్లు మీరు సంతోషంగా ఉంటారు. అప్పుడే మీ రిలేషన్ షిప్ లో పరిపూర్ణతను చూడొచ్చు. అయితే మీ భాగస్వామి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లట్లేదని భావిస్తే అప్పుడే చెడు దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడే మీకు తప్పుడు వ్యక్తులతో ఉన్నారని అనిపించొచ్చు. ఇది చివరకు వారితో సంబంధాన్ని ముగించాలని కూడా అనిపిస్తుంది.

భాగస్వామిపై నిందలు..
మీ భాగస్వామి మిమ్మల్ని ప్రతి చిన్న విషయానికీ నిందించినప్పుడు కూడా అధ్వానమైన దశలలో ఒకటి. ఎక్కడ ఏ తప్పు జరిగినా.. లేదా తను ఏ పొరపాటు చేసినా కూడా మిమ్మల్నే దోషిగా చిత్రీకరిస్తూ నిందలేయడం.. ప్రతి దానికి మీరే బాధ్యత వహించాలని కొత్త కొత్త కండిషన్లు పెట్టడం వంటివి చేసినప్పుడు, మీ వల్లే ఏ విషయం సరిగ్గా జరగడం లేదని నమ్ముతుంటే, మీ రిలేషన్ లో చెడు దశ స్టార్టయినట్టే. మరోవైపు ఏదైనా మంచి చేసినా.. దానికి సంబంధించిన క్రెడిట్ మీకు ఇవ్వకపోవడం.. తనే మొత్తం క్రెడిట్ తీసుకోవడం వంటివి చేస్తే, మీ సంబంధంలో చెడు దశ దారుణంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువ గొడవలు..
వెస్ట్రన్ కపుల్స్ కంటే.. ఇండియన్ కపుల్స్ చాలా ఎక్కువగా గొడవపడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఎలాంటి రిలేషన్ షిప్ లో అయినా గొడవలు అనేది చాలా సాధారణం. అది కూడా చాలా సిల్లీ విషయాలకు, చిన్న చిన్న విషయాలకు గొడవలకు దిగుతుంటారు. దీని వల్ల మీ రిలేషన్ షిప్ లో నిరుత్సాహం మొదలవుతుంది. దీంతో.. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే.. విడాకులకు కారణమవుతోందట. ఇలాంటి దశలను మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

పదే పదే అనుమానం..
మీరిద్దరూ కలిసి ఏదైనా ఫంక్షన్ కో లేదా టూర్ కో వెళ్లినప్పుడు మిమ్మల్ని పదే పదే అనుమానించడం వంటి విషయాలు మిమ్మల్ని చాలా బాధపెడతాయి. రిలేషన్ షిప్ లో మీరిద్దరూ నిజాయితీగా లేనప్పుడు.. ఒకరినొకరు విశ్వసించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. ఇలాంటివి ప్రతి ఒక్క జంటకూ కష్టమైన దశ. ఈ దారుణమైన దశ మీ రిలేషన్ షిప్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

సర్దుకుపోతే..
మీ రిలేషన్ షిప్ లో ఈ దశ చాలా విషపూరితమైనది. ఇది మిమ్మల్ని చాలా బాధపెడుతుంది. మీ సంబంధంలో సానుకూలత లేదని భావించినప్పుడు ఇలా జరుగుతుంది. పైన పేర్కొన్న సంబంధాలలో కొన్ని ముఖ్యమైన చెత్త దశలు ఇవి. ఈ సంబంధం మీకు సరైనది కాదని భావిస్తారు. అందువల్ల ఇలాంటి సమయాల్లో మీరు ఆగ్రహం చెందకుండా, మీరు మీ భాగస్వామితో కూర్చుని ఓపికగా మాట్లాడితే.. అన్ని విషయాలు సర్దుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.



Click it and Unblock the Notifications