Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
భార్యాభర్తలు ఉదయం లేవగానే ఇలా చేస్తే బంధం బలోపేతం అవుతుంది.. కలహాలు రావు
ఉదయం లేవగానే భాగస్వామిని ఎలా పలకరించాలి, ఏం చేస్తే రోజు ఉల్లాసంగా మొదలవుతుంది, ఎలాంటి పనుల వల్ల భాగస్వామిని ఆకర్షించవచ్చు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భార్యాభర్తల బంధం ఎన్నో బాధ్యతలతో, భావోద్వేగాలతో కలగలిపి ఉంటుంది. కలహాలు, వాగ్వాదాలూ ఉంటాయి. గొడవల్లేని బంధం అంటూ ఏదీ ఉండదు. అభిప్రాయల విషయంలోనో, నిర్ణయాల విషయంలోనో భాగస్వాములు తరచూ వాగ్వాదానికి దిగుతుంటారు. అయితే వీటిని ఎలా అధిగమించామన్నదే దాంపత్య బంధంలో ముఖ్యం. రోజూ ఉదయం లేవగానే భాగస్వామిని ఆకర్షించేలా కొన్ని పనులు చేశామంటే రోజు ఉల్లాసంగా, హృద్యంగా ప్రారంభమవుతుంది.

ఉదయం లేవగానే భాగస్వామిని ఎలా పలకరించాలి, ఏం చేస్తే రోజు ఉల్లాసంగా మొదలవుతుంది, ఎలాంటి పనుల వల్ల భాగస్వామిని ఆకర్షించవచ్చు.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీటింగ్స్
ఉదయం లేవగానే మీ భాగస్వామికి నవ్వుతూ గుడ్ మార్గింగ్ చెబితే వాళ్లు ఎంతో సంతోషిస్తారు. హగ్ ఇవ్వడం, కిస్ చేయడం, శరీరాన్ని తాకడం లాంటివి చేస్తూ గుడ్ మార్నింగ్ లాంటి విషెస్ చెబితే రోజు ఆహ్లాదకరంగా ఎందుకు మొదలు కాదు చెప్పండి.

కాంప్లిమెంట్స్
కాంప్లిమెంట్స్ ఆనందాన్ని, సెరోటోనిన్‌ను పెంచుతాయని నిరూపించబడింది. కాబట్టి, మీరు మీ భాగస్వామిని వారి రోజు ప్రారంభంలో అభినందించినట్లైతే, అది స్వయంచాలకంగా వారిని ఉత్సాహపరుస్తుంది. వారికి మంచి ప్రారంభాన్ని ఇస్తుంది. కాంప్లిమెంట్స్ ద్వారా మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో కూడా చెప్పవచ్చు.

కాఫీ అండ్ లవ్
త్వరగా నిద్రలేచి, కలిసి అల్పాహారం చేయడం అలవాటు చేసుకోండి. కాఫీ, టిఫిన్, టోస్టు లాంటివి ఇద్దరూ కలిసి తయారు చేయండి. వంట పూర్తి అయిన తర్వాత దంపతులు ఇద్దరూ కలిసి తినండి. ఇలాంటి చిన్న చిన్న పనులే దంపతుల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తాయి. వారి మధ్య ప్రేమను పెంచుతాయి.

ఐ కాంటాక్ట్
భాగస్వామిని చూడటం నేర్చుకోండి. అదేంటి చూడటం కూడా నేర్చుకోవాలా అని అనుకోవద్దు. వారు మాట్లాడుతున్నప్పుడు, వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు వారి ముఖం చూసి, కళ్లల్లో చూస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఇది వారిపై మీకు ఉన్న ప్రేమను, బంధాన్ని చూపిస్తుంది. మీరు ఏటో చూస్తూ మాట్లాడటం, వారు మాట్లాడుతున్నప్పుడు పట్టించుకోనట్లుగా ఏటో చూస్తూ ఉండటం వల్ల వారిని మీరు పట్టించుకోవట్లేదని, గౌరవం ఇవ్వట్లేదని అనిపించే అవకాశం ఉంది.
మీరు వారికి లవ్యూ చెబుతున్నప్పుడు లేదంటే ఏదైనా ముఖ్యమైన విషయంలో చెబుతున్నప్పుడో కళ్లల్లోకి చూస్తూ మాట్లాడండి.

జోకులు
నవ్వుతూ ప్రారంభించడం కంటే ఒక రోజును మొదలు పెట్టేందుకు ఇంకేం కావాలి. నవ్వు 40 విధాలుగా మేలు చేస్తుందని అంటారు. నవ్వడం వల్ల ఆనందాన్ని కలుగజేసే హార్మోన్ విడుదల అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మంచి మూడ్‌ను తీసుకువస్తాయని అంటారు. కాబట్టి చిన్న జోకులు వేయడానికి, భాగస్వామిని నవ్వించడానికి ప్రయత్నించండి.

వ్యాయామం
ఇద్దరు వేర్వేరు వ్యాయామాలు చేస్తున్నప్పటికీ కలిసి జిమ్‌కు వెళ్లడమో లేదంటే ఇంట్లోనే కలిసి వర్కవుట్స్ చేయడమో చేస్తుంటే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. బంధం బలోపేతం అవుతుంది.

తరచూ తాకడం
మీ భాగస్వామిని తాకే అవకాశం వస్తే అస్సలే వదులుకోవద్దు. ఉదయం లేవగానే ఆఫీసుకు వెళ్లాలన్న తొందర, స్నానం, రెడీ కావడం, అల్పాహారం చేయడం, లంచ్ బాక్స్ సిద్ధం చేసుకోవడం ఇలాంటి చాలా పనులతో ఉదయం అంతా హడావిడిగా ఉంటుంది. అలాంటి సమయంలో మీ భాగస్వామిని తాకే అవకాశం వస్తే అస్సలే వదులుకోవద్దు.
ఏదైనా పని చేస్తున్నప్పుడో, మీరు ఏదైనా పని చేస్తున్నట్లుగా నటిస్తూనో మీలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయటకు తీయండి. కొద్దిగా రొమాంటిక్‌గా మారండి. ఇలాంటి చిన్న చిన్న పనులే మీకు వారిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తం చేస్తాయి. కాబట్టి భాగస్వామి విషయంలో అవకాశవాదిలా మారడంలో తప్పులేదు.



Click it and Unblock the Notifications