Latest Updates
-
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి! -
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే!
తస్మాత్ జాగ్రత్త..! ఇలాంటి లక్షణాలు ఉండే మగాళ్లతో మహా డేంజర్..
గర్ల్ ఫ్రెండ్స్ లేని మగవారిని చూసి మొదట్లో మీరు అలాంటి వారు చాలా మంచి వారు అనుకోవచ్చు. అయితే కొన్నిసార్లు నిజమే. కానీ ఇది అబద్ధమయ్యే అవకాశం కూడా ఉంది.
ఈ ప్రపంచంలో భిన్న రకాల మనుషులు ఉంటారు. అలాగే విభిన్న రకాల మగవారు ఉంటారు. వారితో పాటు ఆడవారు కూడా రకరకాలుగా ఉంటారు. అయితే కొందరు మగవారు మాత్రం కొంచెం విచిత్రంగా ఉంటారు. వీరు ఎల్లప్పుడూ మహిళల కన్నా తామే గొప్ప అని తెగ ఫీలవుతుంటారు. అంతేకాదు తాము కలయికలో సక్సెస్ అయితే చాలు తమను తాము ఉన్నతంగా భావిస్తారు. ఇలాంటి పురుషులు ఎప్పటికీ ఒక ఉత్తమమైన ప్రేమికుడిగా ఉండలేరు.

అలాగే ఇలాంటి పురుషులు వారి సొంత అవసరాలకు మాత్రం అమ్మాయిలను తెగ వాడుకుంటారు. అవసరం తీరిపోయాక అమ్మాయిలను ద్వేషిస్తారు. ఇలాంటి వారితో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకీ ఇలాంటి అబ్బాయిలను ఎలా గుర్తు పట్టాలంటే.. వారి మాటలను,ప్రవర్తనను బట్టి ఇలాంటి వారిని గుర్తు పట్టవచ్చు. వీటితో పాటు పురుషులు మహిళలను ద్వేషించే మరికొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఈ స్టోరీలో మీరే చూడండి...

గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు..
గర్ల్ ఫ్రెండ్స్ లేని మగవారిని చూసి మొదట్లో మీరు అలాంటి వారు చాలా మంచి వారు అనుకోవచ్చు. అయితే కొన్నిసార్లు నిజమే. కానీ ఇది అబద్ధమయ్యే అవకాశం కూడా ఉంది. వారి పితృస్వామ్యం కారణం వల్ల కూడా వారు ఏ అమ్మాయిని ఇష్టపడకపోవచ్చు. అయితే ప్రస్తుత సమాజంలో ఏ మహిళ కూడా తమకు గౌరవం లేని చోటును అస్సలు భరించలేదు.

ఆధిపత్యాన్నిచూపించడానికి..
మీరు మీ భావోద్వేగాలను వ్యక్తపరిచేటప్పుడు మిమ్మల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి పురుషులు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండరు. ఎల్లప్పుడూ మిమ్మల్ని అభద్రతా భావంలోకి నెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే తన బలాన్ని ఉపయోగించి మీపై ఆధిపత్యం చెలాయించడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.

ఇతర మహిళల గురించి చెడుగా ప్రచారం..
మీరు ఎవరైనా ఇతర మహిళలతో మాట్లాడినప్పుడు అనుమానిస్తారు. తర్వాత మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు. ఉదాహరణకు మీరు ఎవరితోనైనా ఇంతకముందే ప్రేమలో ఉన్నారని చెబుతారు. లేదా మీపై అనుమానం కలిగే విధంగా ఇతర మాటలను కూడా చెప్పేస్తారు.

తక్కువ అంచనా..
అమ్మాయిలను అసహ్యించుకునే పురుషుడు తనను తాను స్త్రీ కంటే గొప్పవాడు అని అనుకుంటాడు. అందుకోసం అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వ్యక్తులు అమ్మాయిలను నిరంతరం తక్కువ అంచనా వేస్తారు.

బాధ్యత వహించరు..
మీరు ఒక పురుషుడి తప్పును ఎత్తి చూపితే, వారు మీపైనే తిరగబడతారు. మీకు చేతనైతే మీరు చేయాలని మిమ్మల్ని రెచ్చగొడతారు. పైగా తిరిగి మిమ్మల్నే నిందిస్తారు. అంతేకానీ వారు చేసిన తప్పుకు ఎప్పటికీ బాధ్యత వహించరు. వారి తప్పుడు ప్రవర్తనకు ఎల్లప్పుడూ ఏదో ఒక సాకును చెబుతుంటారు.

మీ ఆటను కూడా వారే..
ఈ భూమిపై తెలివైన వ్యక్తులంటే కేవలం వారొక్కరే అనే భ్రమలో ఉంటారు. ఎవరైనా అమ్మాయిలు ఏదైనా చిన్నపొరపాటు చేస్తే తెగ విమర్శలు చేస్తారు. అది వారి హక్కులాగా భావిస్తారు. వారే ప్రతిదీ బాగా చేయగలరని అనుకుంటారు. అలాగే మీరు ఎప్పుడు ఏ పని చేయాలి. మీరు ఎలా జీవించాలి. మీ జీవితంలో మీరు ఎలా ప్రవర్తించాలో కూడా వారే డిసైడ్ చేస్తారు. ఇలా మీరు ఆడాల్సిన ఆటను కూడా వారే ఆడేందుకు ప్రయత్నిస్తారు.

మహిళలను ఎప్పుడూ మెచ్చుకోరు..
మహిళలను ద్వేషించే పురుషులు ఎల్లప్పుడూ తమకన్నా తక్కువ ఉన్న మహిళలనే భాగస్వామిగా ఎంపిక చేసుకుంటారు. అలాగే ఎవరైనా మహిళలు ఏదైనా విషయంలో విజయం సాధిస్తే వారిని కనీసం అభినందించరు. అలాగే వారిని నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తారు. మహిళల ప్రతిభను ఎప్పటికీ గుర్తించరు.

తమకే ప్రాముఖ్యత..
మహిళలను గౌరవించని పురుషులు వారి సమయం మాత్రమే విలువైనదిగా భావిస్తారు. తమకు తాము అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటారు. అలాగే వారి కంటే తక్కువగా ఉండే వారే ఎల్లప్పుడూ వారి సహచరులుగా ఉండాలని ఆశిస్తారు.
చూశారు కదా.. పై సంకేతాలు ఉండే పురుషులతో అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.. ఇలాంటి సంకేతాలు ఉన్న వారు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వెంటనే వారిని దూరంగా నెట్టేయండి. మీ జీవితాన్ని పది కాలాల పాటు ప్రశాంతంగా ఉండేలా కాపాడుకోండి...



Click it and Unblock the Notifications