Latest Updates
-
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే
మీకు ఈ అలవాట్లు ఉంటే మిమ్మల్ని ఇష్టపడే వారు కూడా ద్వేషించుకుంటారని మీకు తెలుసా...
మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఇతరులు మీ మాటల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు.
ఈ విశ్వంలో మీకు సరైన విషయాలు ఇతరులకు సరైనవి కానివిగా అనిపిస్తాయి. అలాగే మీకు ఇష్టమైన ప్రతిదీ ఇతరులు కూడా ఇష్టపడాలని ఎక్కడా లేదు. అలాగే మనం ఎంత మంచి వారైనా, మనల్ని ద్వేషించే వారు, మనల్ని అసహ్యించుకునే వారు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటారు.

మీరు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ కొంతమంది మిమ్మల్ని ద్వేషించుకుంటారు. అయితే మీకు ఉన్న కొన్ని అలవాట్ల వల్లే ఇతరులు మిమ్మల్ని ఇష్టపడకపోవటానికి కారణమవుతాయని మీకు తెలుసా? ఆ అలవాట్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకోండి...

సెల్ ఫోన్ వాడకం..
మీరు ఎవరితో ఫోన్ మాట్లాడటం ప్రారంభించినప్పుడు, మీకు అవతలి వారి మాటలపై ఏదైనా విషయంలో కోపం వస్తే, వారు కోపంగా మాట్లాడిన సమయంలో మీరు కూడా అలాగే మాట్లాడితే, ఇతరులు కూడా మీపై కోపం తెచ్చుకుంటారు. కారణం ఏమైనప్పటికీ, ఇలా చేయడం వల్ల ఇతరులకు మీపై గౌరవం తగ్గిపోతుంది. ఆశ్చర్యకరంగా అగౌరవం పెరుగుతుంది. కానీ మీరు శత్రువులను గౌరవిస్తే మాత్రం వారు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు.

విచారకరమైన కథలు..
మీరు వ్యక్తిగతంగా ఎవరిని కలుసుకున్నా, మీ రహస్యాలను మీరు ఎంత పంచుకున్నా, మీరు స్నేహితులతో మీరు ఎంత సన్నిహితంగా ఉన్నా సరే అదంతా ఒక పరిమితిలో ఉండాలి. ఇందుకోసం కొంత సమయం సైతం కేటాయించండి. ప్రతిసారి మీ విచారకరమైన కథలు చెప్పే బదులు, వారి ఆందోళన గురించి మీరు దృష్టి పెట్టాలి. ఎల్లప్పుడూ మీ గురించి మీరు మాట్లాడటం మీతో ఉన్న వారికి బాధ కలిగిస్తుంది. దీని వల్ల మీపై ద్వేషం పెంచుకునే అవకాశం ఉంది.

గాసిప్స్...
మీరు తరచుగా పుకార్లను, గాసిప్స్ ను వ్యాపింపచేస్తే అది మీకు మంచిగా ఉండదు. గాసిప్స్ కు కూడా ఒక పరిమితి అనేది కచ్చితంగా ఉంటుంది. పెద్దవారు అయితే వాటి గురించి కొంత ఆలోచించి చర్చిస్తారు. మిగిలిన వ్యక్తులు ఇలాంటి సంఘటనలను హర్షించరు. అందుకే మీరు ఇతరుల గురించి గాసిప్స్ చెప్పడం వల్ల కూడా మిమ్మల్ని ద్వేషిస్తారు.

క్లారిటీ లేకుండా ఉండటం..
మీరు ఏదైనా విషయం గురించి ఇతరులతో చర్చించే సమయంలో మీరు క్లారిటీ లేకుండా ఉంటే, మీ అభిప్రాయాన్ని ఎవ్వరూ గౌరవించరు. ఎందుకంటే ఏదైనా విషయం చెప్పేటప్పుడు మీరు ఎప్పుడైతే క్లారిటీగా ఉంటారో అప్పుడే మీ మాటను ఇతరులు గౌరవిస్తారు. మీ మాటలను వింటారు. అయితే ఇతరులు చెప్పే ప్రతి దానితో మీరు ఏకిభవించాల్సిన అవసరం లేదు. కానీ వారు మాటలను వినడం మంచిది. ఇలా చేయకపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు.

ఆసక్తి లేకపోవడం..
మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడటం ప్రారంభించినప్పుడు ఇతరులు మీ మాటల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు. అయితే మీరు వాటిని పట్టించుకోకూడదు. కానీ మీరు ఇతరుల చర్చలో మీరు ఆసక్తి చూపకపోయినా పర్వాలేదు కానీ, వారు ఏదైనా చెబితే విని విననట్టు నటిస్తే అలాంటి సమయంలో మిమ్మల్ని ఇతరులు ద్వేషిస్తారు.

గొప్పలు చెప్పుకోవడం..
ప్రస్తుత సమాజంలో అత్యంత మందికి ఉన్న ఒక పెద్ద చెడ్డ అలవాటు గొప్పలు చెప్పుకోవడం. మీరు ఎంతటి మంచి వారు అయినా, మీరు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, మీరు ఇతరుల వద్ద ఎప్పుడైతే గొప్పలు చెప్పుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా ఇతరులు మిమ్మల్ని ద్వేషించేలా చేస్తుంది.



Click it and Unblock the Notifications
