For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ టాలీవుడ్ అందాల భామల బ్రేకప్ స్టోరీలు వింటే మీరు ఆశ్చర్యపోతారు...

కమల్ హసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో అగ్ర హీరోలందరితో నటించిన సంగతి తెలిసిందే.

|

మన దేశంలో సెలబ్రిటీలకు ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం వారు ఏమి చేస్తున్నారని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇక మీడియా అయితే వారి ఆసక్తులను తెలుసుకుని అభిమానులకు తెలియజేసేందుకు తెగ ఆరాటపడుతూ ఉంటుంది.

Tollywood Stars and their breakup stories

అయితే సెలబ్రిటీలు ముఖ్యంగా సినీ తారల ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాలైతే అత్యంత ఆసక్తి కనబరుస్తారు. అయితే ఇలాంటి విషయాలను చాలా మంది సినీ ప్రముఖులు బయట పెట్టేందుకు ఇష్టపడరు. కానీ ప్రేమ, విడిపోవడం, ఆకర్షణ ఇలాంటివన్నీ సాధారణ మానవులతో పాటు సెలబ్రెటీలకు కూడా ఉంటాయి.

Tollywood Stars and their breakup stories

అయితే ఇటీవలి కాలంలో ఈ బ్రేకప్ వల్ల కలిగే బాధలు, మనోవేదనల నుండి మన అందాల భామలు త్వరగానే కోలుకుంటున్నారు. తిరిగి వారి తమ కెరీర్ పై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇంతకీ ఏయే హీరోయిన్లకు బ్రేకప్ అయ్యింది? ఎవరెవరు కోలుకున్నారు అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

ఈ ప్రత్యేకతలుంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే...!ఈ ప్రత్యేకతలుంటే మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని లవ్ చేస్తున్నట్టే...!

రష్మీక మందన..

రష్మీక మందన..

ప్రస్తుతం టాలీవుడ్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ రష్మీక మందన. ఈ కన్నడ భామ తెలుగు తెరపై ఏ సమయంలో ఎంట్రీ ఇచ్చిందో కానీ..వరుసగా హిట్లతో దూసుకుపోతోంది. ఈ భామ ఇటీవలే మహేష్ బాబు, నితిన్ తో కలిసి అందరినీ అలరించింది. అయితే ఈ భామ తన వ్యక్తిగత జీవితంలో రక్షిత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికారు చేశాయి. అంతేకాదు ఆ వ్యక్తితో ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే ఏమయిందో తెలియదు కానీ, ఈ భామ తన ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుని తన పూర్తి ఫోకస్ ను తన కెరీర్ పైనే పెట్టింది.

కాజల్ అగర్వాల్..

కాజల్ అగర్వాల్..

సినిమా రంగంలో దాదాపు పదేళ్లకు పైగా నాయకిగా నటించడమంటే అంత సులభం కాదు. అందుకు అందంతో పాటు అభినయం.. ప్రతిభ ఎంతగానో ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే.. కాజల్ ఇప్పటికీ హీరోయిన్ గా రాణిస్తోంది. అయితే కాజల్ కూడా తొలిసారి ప్రేమలో పడిందట. అయితే అనుకోని కారణాల వల్ల తాను తన భాగస్వామికి బ్రేకప్ చెప్పిందట. అది కూడా సినిమా రంగంలో అడుగుపెట్టిన సమయంలో తొలి రోజుల్లో ఓ వ్యక్తితో ప్రేమలో పడిందట.

తెలుగమ్మాయి అంజలి..

తెలుగమ్మాయి అంజలి..

జర్నీ సినిమా హీరోతో తెలుగుమ్మాయి ప్రేమ ప్రారంభమైంది. ఇది ఏకంగా లివింగ్ రిలేషన్ షిప్ వరకు వెళ్లింది. ఆ సినిమా తర్వాత కూడా వీళ్లు బయట ఎక్కడ చూసినా కలిసి తిరిగే వాళ్లు.. పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారట. అయితే ఏమైందో తెలియదు కానీ.. వారిద్దరూ బాగా గొడవ పడ్డారు. తాము కనీసం స్నేహితులం కాదు అంటూ రచ్చ రచ్చ చేశారు. ఆ తర్వాత ఈ అందాల భామ సినిమాల్లో బిజీ అయిపోయింది.

బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ కలవాల్సిన అవకాశం వస్తే... ఆ బంధం బలంగా ఉంటుందా?బ్రేకప్ అయిన తర్వాత మళ్లీ కలవాల్సిన అవకాశం వస్తే... ఆ బంధం బలంగా ఉంటుందా?

శృతి హాసన్..

శృతి హాసన్..

కమల్ హసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగులో అగ్ర హీరోలందరితో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ తో చాలా రోజులే చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. అయితే ఏమైందో తెలియదు కానీ తన బాయ్ ఫ్రెండ్ కు బాయ్ చెప్పేసి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

గోవా బ్యూటీ...

గోవా బ్యూటీ...

సన్నని నడుముతో అందరినీ ఆకట్టుకునే గోవా బ్యూటీ ఇలియానా.. తన గాఢమైన ప్రేమ కారణంగా చాలా రోజులు సినిమాల్లో కనిపించలేదు. ఈ అందాల భామ ప్రేమలో మునిగిపోయిన సమయంలో తన శరీరాన్ని కూడా బాగా పెంచింది. అంతేకాదు తన లవర్ తో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుందంట. అయితే ఏమైందో తెలియదు కానీ.. తన లవర్ కు టాటా చెప్పి మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

నయనతార..

నయనతార..

దక్షిణాదిన బ్రేకప్ చెప్పడంలో నయనతార అందరికంటే ఒక అడుగు ముందుంటారు. ఈ అందాల భామ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురితో ప్రేమాయణం నడిపించింది. ముచ్చటగా మూడోసారి బ్రేకప్ చెప్పి అందరి నోళ్లలో నానుతూ వచ్చింది. అయితే ఈ భామ బ్రేకప్ లు తన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపకపోవడం గమనార్హం.

వీటిని గుర్తించరు..

వీటిని గుర్తించరు..

వీరు మాత్రమే కాదు.. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు చాలా సులభంగా ప్రేమలో పడటం.. ఏవేవో కారణాలతో తమ బంధానికి బాయ్ చెప్పేయడం.. లేదా బ్రేకప్ చెప్పడం వంటివి మనకు తెలిసిందే. అయితే వీరంతా తమ బ్రేకప్ బాధల నుండి చాలా త్వరగా బయటపడ్డారు. తిరిగి తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. అయితే చాలా మంది సినీ తారలంటే కేవలం అందాన్ని మాత్రమే చూస్తుంటారు. అతి తక్కువ మందే వారి స్థైర్యాన్ని, మనో నిబ్బరాన్ని గుర్తిస్తారు.

వీరిని ఆదర్శంగా తీసుకుంటే..

వీరిని ఆదర్శంగా తీసుకుంటే..

ప్రస్తుత జనరేషన్ వారిలో చాలా మంది ప్రేమలో ఫెయిల్ అయినా.. బ్రేకప్ చెప్పుకున్నా తమ జీవితం మొత్తం అయిపోయిందని భావిస్తుంటారు. అయితే ఇదంతా తప్పు అని నిరూపించారు మన సినీ తారలు. అందుకు ఉదాహరణే ఈ సినీ తారల బ్రేకప్ స్టోరీలు.. బ్రేకప్ అయినప్పటికీ వారి కెరీర్, ఫ్యాషన్, స్టైల్ విషయంలోనే కాదు.. మానసిక స్థైర్యం వంటి వాటిలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు వీరి బాటలో నడిస్తే.. మీ జీవితంలో కచ్చితంగా రాణించగలరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary

Tollywood Stars and their breakup stories

Here we talking about tollywood stars and their breakup stories. Take a look
Story first published:Monday, February 24, 2020, 14:01 [IST]
Desktop Bottom Promotion