Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఆ కన్నె పిల్లను కాపాడుదామనుకుంటే అతనిపై కస్సుబస్సులాడింది... ఆ తర్వాత అసలు నిజం తెలుసుకుని...
అతను కూడా ఆమెకు ధీటుగానే బదులిచ్చాడు.‘‘ఇక్కడ ఈడు పిల్లే కానీ.. ఆడపిల్ల లేదే‘‘ అని అన్నాడు తమాషాగా. అంతే ఆమె ఒక్కసారిగా ‘‘ఆ అని కీచుగా అరిచింది.
తన పేరు నీలవేణి అని అతనికి తెలుసు. నీలవేణి నదిలో స్నానం ముగించుకుని తడి బట్టలతోనే బయటకు వచ్చింది. పొడవాటి టువాలుతో తన కురులను తుడుచుకుంటోంది. అసలే ఇరవై ఏళ్ల అమ్మాయి. అచ్చం అప్సరసలాగా ఉంది. తన పరువంతో పిటపిటలాడిపోతూ ఒంటికి అతుక్కుపోయిన దుస్తుల్లో అతనికి మరింత అందంగా కనిపించింది.

తన నీలాల కన్నులతో అటూ ఇటూ చూసింది. అక్కడ ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని అక్కడే ఓ చాటుకు వెళ్లి తన తడి బట్టలను ఒక్కొక్కటిగా తీయడం స్టార్ట్ చేసింది. అందులోనూ తను హాఫ్ చీర మాత్రమే వేసుకుని ఉంది. ముందుగా తన ఓణీని వయ్యారంగా తొలగించింది. ఆ తర్వాత తన లో దుస్తులతో నిల్చుని ఉంది. ఆమె యవ్వనపు సొంపులను, శరీరపు ఒంపులు.. సన్నని నాజుకైన నడుము.. అతనికి ప్రస్ఫుటంగా కనిపించాయి. అంతలో నీలవేణికి ఎవరో తనని చూస్తున్నారని అనిపించింది. వెంటనే తన తల ఎత్తి చూసింది... ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే...

కనురెప్ప వేయకుండా...
అంతే తన ఎదురుగా అతను కను రెప్ప ఆర్పకుండా తననే చూస్తున్నాడు. అతనికేమో కనీసం పాతికేళ్ల వయసు ఉంటుంది. అతను కూడా చాలా అందంగా ఉన్నాడు. అతను కూడా అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ తన నడుముకు చుట్టుకుని నిల్చున్నాడు.

అతని చూపంతా దానిపైనే..
అతని చూపులేమో ఆమె నడుముపైనే ఉంది. ఆ విషయాన్ని నీలవేణి కూడా గ్రహించింది. వెంటనే అతన్ని కోపంగా చూస్తూ తన టవాల్ తో తన శరీరాన్ని కప్పుకుంది.

అతడిని నిలదీసింది...
‘‘ఏయ్ మిస్టర్! ఒళ్లేలా ఉంది... ఏంటి అలా మిడిగుడ్లు వేసుకుని మరి చూస్తున్నావు? ఆడపిల్లలను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదా? అంటూ తనను నిలదీసింది.

ఈడు పిల్లే కదా...!
అతను కూడా ఆమెకు ధీటుగానే బదులిచ్చాడు.‘‘ఇక్కడ ఈడు పిల్లే కానీ.. ఆడపిల్ల లేదే‘‘ అని అన్నాడు తమాషాగా. అంతే ఆమె ఒక్కసారిగా ‘‘ఆ అని కీచుగా అరిచింది. ‘‘ఏంటి తమాషాగా ఉందా? అరచి గోల చేస్తే ఏమవుతుందో తెలుసా?

నడుమును తాకేశాడు..
అంతే ఆమె ప్రశ్నకు అతను జవాబు ఇవ్వకుండా ఆమె దగ్గరికి వేగంగా చేరుకుని, నీలవేణి నడుముపై తన చేయిని వేసేశాడు. అంతే ఒక్కసారిగా షాక్ తిన్న ఆమె. అతన్ని బలవంతంగా తొసివేసింది. కానీ అతని పట్టు గట్టిగా బిగుతుగా ఉండటంతో ఆమెకు అతని నుండి విడిపించుకోవడం సాధ్యం కాలేదు.

ఆగ్రహంతో అరుపులు..
అంతే ఆమె అతనిపై కోపంతో అతడి చేతిపై కొడుతూ గట్టిగా అరిచింది. ఇంతలో అక్కడ చుట్టూ ఉన్నవారంతా అక్కడికొచ్చి గుమిగూడారు. వారి చూపులంతా వారిద్దరిపైనే ఉన్నాయి. అది గమనించిన అతను తన చేతిని తీసేసి గట్టిగా విదిలించాడు.

కొట్టడానికి వచ్చారు..
‘‘ఇతను నా నడుము పట్టుకున్నాడు‘‘ అని భయంతో చెప్పింది. అంతే అందరూ అతడిని కొట్టడానికి మీదకి వచ్చారు. అయితే అతను ఏమాత్రం కంగారు పడలేదు. వారందరికీ ఈ విధంగా సమాధానమిచ్చాడు. దీంతో అందరూ సైలెంట్ అయిపోయారు.

అపార్థం చేసుకుంది..
‘‘నీలవేణి నడుముపై ఉన్న జలగను నేను చూశాను. దాన్ని తీసి పడేద్దామని ప్రయత్నించాను. అంతే నీలవేణి నన్ను అపార్థం చేసుకుంది‘‘ అంటూ అందరికీ జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు ఆ కుర్రాడు.

నిజం తెలుసుకున్నాక..
అప్పుడు ఒకసారి నీలవేణి తన నడుమును చూసుకుంది. ఆమె నడుము దగ్గర జలగ పట్టుకున్న చోట ఎర్రగా కందిపోయినట్టు కనిపించింది. అంతే కాదు ఆమెకు అక్కడ మంటగా అనిపించింది. ఆ తర్వాత నీలవేణి తన నీలాల కన్నులతో సారీ చెబుతున్నట్టు అతని వంక చూసింది. అంతలోనే వారిద్దరి కుటుంబాలు అక్కడి చేరుకున్నాయి. ఒకరినొకరు గుర్తించి మరింత ఆశ్చర్యపోయారు. దీని తరువాయి భాగం కథ త్వరలోనే...



Click it and Unblock the Notifications