Latest Updates
-
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.!
న్యూ రూల్.. మీ సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉందా, అయితే మీకు పెళ్లి కావడం చాలా కష్టం, ఎందుకంటే?
మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైనది పెళ్లి. ఈ పెళ్లి చేసుకోవడానికి పెద్దలు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి మరీ పెళ్లి చేస్తారు. వధూవరులు ఎటువంటి వారు? వారి కుటుంబ సభ్యులు ఎలాంటి వారు అని కనుక్కొని మరీ పెళ్లి చేస్తారు. ఈ ప్రాసెస్‌లో కొన్ని పెళ్లిళ్లు రద్దు అయ్యాయి కూడా. అయితే ఆ పెళ్లిళ్లు రద్దు అవడానికి కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరెప్పుడైనా సిబిల్ స్కోర్ సరిగ్గా లేదని పెళ్లి రద్దు అయ్యింది విన్నారా? ఇటీవలే ఇది జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని..
మహారాష్ట్రలోని మూర్తాజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. మూర్తాజాపూర్‌లోని ఒక వధువు, అదే ప్రాంతానికి చెందిన వరుడితో వివాహం కుదుర్చుకున్నది. ఈ వివాహం కోసం రెండు కుటుంబాలు అంగీకరించాయి. కానీ, వివాహం జరగాల్సిన ముందు కొన్ని కీలక విషయాలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వధువు మామ వరుడి సిబిల్ స్కోర్‌ను తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ స్కోరు చూసిన వెంటనే, అతనికి ఒక షాకింగ్ నిజం వెల్లడైంది. వరుడు అనేక బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నాడు, మరియు అతని సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉన్నట్లు కనిపించింది. ఈ విషయాన్ని గమనించిన వధువు కుటుంబం, వరుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రహించి వెంటనే ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఈ విధంగా..
ఈ ఘటన గురించి తెలుసుకుంటున్న ప్రజలందరూ వింత వింతగా స్పందిస్తున్నారు. కొందరు పురుషులు అసలే పెళ్లిళ్లు కావడం లేదని కంగారు పడుతుంటే మళ్ళీ ఈ సమస్య కూడానా అని కామెంట్లు పడుతున్నారు. ఇంకొందరు నాకున్న లోన్ల గురించి తెలిస్తే సంబంధం కూడా మాట్లాడరు అని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బూరో (CIBIL) ద్వారా ఇచ్చే ఒక ర్యాంక్. ఇది వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిని సూచిస్తుంది. బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థలు, ఈ స్కోర్ ఆధారంగా రుణాలు, క్రెడిట్ కార్డులు, ఇతర ఆర్థిక సేవలు అందిస్తాయి. ఈ స్కోరు పరిగణనలో, వ్యక్తి గతంలో తీసుకున్న రుణాలు, వాటి తిరిగి చెల్లింపులు, క్రెడిట్ కార్డు వినియోగం వంటి అంశాలను విశ్లేషిస్తారు.



Click it and Unblock the Notifications
