Latest Updates
-
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్‌ని అడుగుతున్న సలహాలు ఇవేనట.!
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సలహాలు, సందేహాల నివృత్తి సులభతరమైంది. కెరీర్‌కి సంబంధించిన విషయాలు, ఇతర అంశాలను తెలుసుకోవడానికి ఎక్కువగా గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి తర్వాత ముఖ్యంగా అమ్మాయిలు తమ తదుపరి జీవితం గురించి కీలక సలహాల కోసం గూగుల్ చేస్తున్నారంట.. అవేంటంటే..

అప్పటివరకూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగిన అమ్మాయి.. పెళ్లి అనే బంధంతో అలవాటైన ప్రపంచం నుంచి విభిన్న ప్రపంచంలోకి వెళ్తుంది. అక్కడ కొత్త ఇల్లు, కొత్త మనుషులు, నూతన బాధ్యతలు ఇలా అన్నిటినీ ఒకేసారి స్వీకరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొత్త వాతావరణానికి అలవాటుపడుతున్న సమయంలో నూతన వధువుకి అనేక సందేహాలు వస్తుంటాయి. వీటి గురించి అత్తమామలను, భర్తను అడగలేరు. ప్రతిదానికీ తల్లిదండ్రుల సలహాలను అడుగుతూ ఇంటి గుట్టును బయటపెట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో తమ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, సవాళ్లను పరిష్కరించుకునేందుకు గూగుల్‌లో వెతుకుతున్నారు.
పెళ్లయిన తర్వాత ప్రతి స్త్రీ భర్తతో బలమైన బంధాన్ని ఏర్పరుచుకోవాలని కోరుకుటుంది. ఈ క్రమంలోనే భార్యలు.. భర్త ఇష్టాయిష్టాలను ఎలా తెలుసుకోవాలి, అతని మనసులో ప్రత్యేక స్థానం ఎలా సంపాదించుకోవాలి, రిలేషన్‌లో ప్రేమ, శృంగారాన్ని ఆనందంగా ఎలా కొనసాగించాలనే విషయాలపై గూగుల్‌లో తెలుసుకుంటున్నారు.
ప్రతి భార్య కూడా భర్త వద్ద తన మాటకు విలువ ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి గొడవలు రాకుండా, ప్రేమతో తన మాటను భర్త అర్థం చేసుకునేలా, ఏకీభవించేలా ఉండాలంటే ఏం చేయాలని సలహాల కోసం గూగుల్‌లో సర్చ్ చేస్తున్నారు.

కొత్త ఇంట్లో అడుగుపెట్టాక అక్కడి ఆచారాలు, అత్తామామలు, ఆడపడుచులు, తోటికోడళ్లు, బంధువులు ఇలా వారితో కలిసిపోవడం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఈ క్రమంలోనే అత్తింటి వారి మెప్పు పొందాలంటే ఎలా ఉండాలి.. తమలో ఏ మార్పులు చేసుకోవాలి, అపార్థాలు, గొడవలను ఎలా పరిష్కరించుకోవాలని గూగుల్‌ను సలహా అడుగుతున్నారు.
పెళ్లికి ముందు మీకు సంబంధించి అన్ని బాధ్యతలు తల్లిదండ్రులు చూసుకుంటారు. కానీ పెళ్లి తర్వాత ఆ పరిస్థితులు మారిపోతాయి. ఇంటి వ్యవహారాలు, రోజువారీ పనులు ఇలా కొత్త ఒత్తిడితో శారీరకంగా, మానసికంగా భారం పెరుగుతుంది. ఇక, ఉద్యోగం, వ్యాపారం చేసే మహిళల్లో ఈ పరిస్థితులు కొంచెం కష్టంగానూ ఉంటాయి. పెళ్లి తర్వాత కెరీర్‌ను, ఇంటి బాధ్యతలను సమన్వయం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఇంటిని ఎలా నిర్వహించుకోవాలి, సమయాన్ని ఎలా ఆదా చేసుకోవాలి వంటి సలహాలు కోరుతున్నారు.
ఇక, పెళ్లయిన తర్వాత ఎదురయ్యే ప్రధాన సమస్య పిల్లల గురించి. శుభవార్త ఎప్పుడు చెబుతారంటూ కుటుంబీకులు, బంధుమిత్రుల ప్రశ్నలు పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ఎదురవుతుంటాయి. కెరీర్ ప్లానింగ్, ఆర్థిక పరిస్థితులు ఇలా కొన్నిటిని అంచనా వేసుకుంటూ కొందరు జంటలు ఈ ప్రక్రియను వాయిదా వేస్తుండగా.. పెళ్లయి ఏడాది దాటినా సంతానం కానివారు సలహాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. గర్భధారణకు సంబంధించిన పరిస్థితులు, తల్లి కావడానికి సరైన వయస్సు, గర్భం ధరించడానికి ముందు తీసుకోవాల్సిన అవసరమైన జాగ్రత్తలపై గూగుల్‌లో వెతికి అవసరమైన సలహాలను పాటిస్తున్నారు.



Click it and Unblock the Notifications
