Latest Updates
-
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు!
దూరం పెరిగినా బంధం మారదు.. యువతని ఆకట్టుకుంటున్న 'కాక్టస్ ఫ్రెండ్‌షిప్'.!
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో వ్యక్తిగత జీవితానికి చాలావరకు ప్రాముఖ్యత తగ్గిపోతుందనే చెప్పవచ్చు. వీకెండ్స్ మినహా రోజూ తమకంటూ ప్రత్యేక సమయం కేటాయించడం చాలా తక్కువే ఉంటుంది. అందులో ఫ్రెండ్స్ ఒకటి. ఇదివరకటి రోజుల్లో రోజూ కాసేపైనా క్లోజ్ ఫ్రెండ్స్‌ని కలిసి కాసేపు సరదాగా మాట్లాడటం, విషయాలు పంచుకోవడం జరిగేవి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌ని సోషల్ మీడియా భర్తీ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు 'కాక్టస్ ఫ్రెండ్‌షిప్’కి ఆదరణ పెరుగుతోంది.

కాక్టస్ ఫ్రెండ్‌షిప్
ఆధునిక కాలంలో యువతలో బాగా ప్రాచుర్యం పొందుతున్న సరికొత్త స్నేహ భావన 'కాక్టస్ ఫ్రెండ్‌షిప్’ కాక్టస్ అంటే నాగజెముడు మొక్క. ఈ మొక్క బతకడానికి రోజూ నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడో ఒకసారి నీళ్లు పోస్తే సరిపోతుంది. కాక్టస్ ఫ్రెండ్‌షిప్ కూడా అంతే.. ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నా లేదా చాలా కాలం తర్వాత కలుసుకున్నా వారి మధ్య దూరమైపోయామనే ఫీలింగ్ రాదు. మునుపటిలాగే ఉండే వారి మధ్య స్నేహం అనేది బలంగా కొనసాగుతుంది.
దూరంగా ఉన్నా
ఆధునిక జీవనశైలిలో స్నేహాలను బలోపేతం చేసేందుకు కాక్టస్ ఫ్రెండ్‌షిప్ దోహదపడుతుంది. ఈ కాక్టస్ స్నేహాల ద్వారా ప్రత్యేకమైన, గాఢమైన, విడదీయరాని బంధాలు ఏర్పడుతున్నాయి. ఈ ఫ్రెండ్‌షిప్‌లో స్నేహితులు ప్రతిరోజూ మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఈ స్నేహాలకు కాలంతో, దూరంతో సంబంధం ఉండదు. మీ ఫ్రెండ్స్ వేరే నగరంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా ఆ బంధం అనేది బలహీనం కాదు. మరింత బలంగా ఉంటుంది.

నిన్ననే కలిసిన ఫీలింగ్
కాక్టస్ ఫ్రెండ్‌షిప్‌లో మీ స్నేహితులు మీకు భౌతికంగా దూరంగా ఉన్నా.. అప్పుడప్పుడూ కలుసుకున్నా వారి మధ్య భావోద్వేగ బంధం అంతే గాఢంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత మీరు మళ్లీ కలిసినప్పుడు మునుపటి అనుభూతినే ఆస్వాదిస్తారు. అంతకాలం దూరంగా ఉన్నామనే ఫీలింగ్ కలగదు. మీరు మాట్లాడుకునేటప్పుడు మీ మాటల్లో ఆ సాన్నిహిత్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే మీ గాఢమైన స్నేహానికి నిదర్శనం. ఆ ఆనందం కూడా మాటల్లో వర్ణించలేకుండా ఉంటుంది.
కవచంలా నిలబడతారు
కాక్టస్ స్నేహంలో స్నేహితులు దూరంగా ఉన్నా.. వారు సమస్యల్లో ఉన్నారనే తెలిస్తే మాత్రం నేనున్నానంటూ అండగా నిలుస్తారు. మీరు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, మానసికంగా బాధల్లో ఉన్నా మీకు సహాయం అందిస్తూ తోడుగా ఉంటారు. వారి మాటల్లో కానీ చేతల్లో కానీ ఎలాంటి నటన ఉండదు. మనస్ఫూర్తిగా మీకు కవచంలా నిలబడతారు. కాక్టస్ స్నేహంలో నమ్మకం బలంగా ఉంటుంది. ఆ స్నేహమే మిమ్మల్ని చాలా సందర్భాల్లో గట్టెక్కిస్తుంది.
కాక్టస్ స్నేహంతో మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు. ఈ స్నేహాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో వారు దూరమవుతున్నారు, దూరంగా ఉన్నారనే ఒత్తిడి ఉండదు. ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేందుకు, వారిని సంతోషంగా ఉంచేందుకు సమయం, డబ్బు, శ్రద్ధ, సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు పూర్తిగా మనశ్శాంతిని ఇస్తుంది.
స్నేహంలో స్వార్థం ఉండదని, నిరంతరం అటెన్షన్ చూపించాల్సిన అవసరం ఉండదని కాక్టస్ ఫ్రెండ్‌షిప్ నిరూపిస్తుంది. వారితో మీరు తరచూ కలవడం కంటే మానసికంగా దగ్గరగా ఉన్నామనే ఫీలింగ్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఈ బంధంలో స్వార్థం లేనంత వరకూ స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఎంత కాలం తర్వాత కలిసినా ఇటీవలే వారిని కలిసినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా స్నేహితులిద్దరి మధ్యా పరిణతి ఉంటే కాక్టస్ స్నేహాలు ఎలాంటి ఒడదొడుకులు ఉన్నా కలకాలం నిలుస్తాయి.



Click it and Unblock the Notifications