Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.!
ఆదర్శవంతమైన జీవితానికి సంబంధించి ఆచార్య చాణక్యుడు తన సూత్రాల్లో అనేక ముఖ్యమైన పాఠాలను బోధించారు. ఆయన సూత్రాలు.. సంబంధాలు, డబ్బు, ప్రవర్తన, కుటుంబం, వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలను అందిస్తాయి. ఆ సూత్రాల్లోని ఒక దాంట్లో భార్యాభర్తలకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయాన్ని చాణక్యుడు తెలియజేశారు. భార్య తన భర్త లేకుండా ఎప్పటికీ చేయకూడని నాలుగు విషయాలను వివరించారు. లేదంటే అది వారి బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. ఆ నాలుగు విషయాలు ఏంటో చూద్దాం..

భర్తకి చెప్పకుండా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం..
దాంపత్య జీవితం మొదలయ్యాక కుటుంబానికి సంబంధించి భార్యాభర్తలు చిన్న, పెద్ద కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు భర్త లేకపోతే భార్య తన భర్తను సంప్రదించకుండా దానికి సంబంధించి ఎలాంటి అడుగు వేయకూడదు. భర్త ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా భార్య తీసుకునే నిర్ణయం అతనిని మనస్తాపానికి గురిచేయవచ్చు. లేదంటే వైవాహిక జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు. ఇలాంటి విషయాలు వివాదాలకు సైతం దారితీస్తాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇతర పురుషులతో మాట్లాడటం..
చాణక్య నీతి ప్రకారం.. భర్త ఇంట్లో లేదా తన దగ్గర లేనప్పుడు.. భార్య కుటుంబీకులతో సహా మరే ఇతర పురుషుడితో కూడా మాట్లాడటం వారి మధ్య బంధానికి మంచిది కాదు. భర్త ఉన్నప్పుడు భార్య వేరొక వ్యక్తితో మాట్లాడటం తప్పు కాదు.. కానీ అతను లేనప్పుడు వేరొక పురుషుడితో పరిహాసంగా మాట్లాడటం సరైంది కాదు. ఇంకా సామాజిక కట్టుబాట్లను విస్మరించడం వల్ల వారి వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపి సమస్యలకి దారితీస్తాయి.

యజ్ఞం, హవన, దానాలు..
చాణక్య నీతి, మత గ్రంథాల ప్రకారం.. భర్త లేనప్పుడు భార్య ఎలాంటి అగ్నిహోత్రాలు గానీ, దానాలు గానీ చేయడం సరైన పద్ధతి కాదు. భర్త లేనప్పుడు ఇలాంటివి చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కనిపించవు. ఇలాంటి ధార్మిక కార్యకలాపాలను దంపతులిద్దరూ కలిసి నిర్వహించాలి. అప్పుడే వారి జీవితంలో సుఖం, శ్రేయస్సు, శాంతి నెలకొని అన్యోన్యంగా ఉంటారు.
ఆర్థిక లావాదేవీలు..
ఏ కుటుంబమైనా డబ్బు లేకుండా మనుగడ సాగించదు. ఈ క్రమంలో చాణక్య నీతి ప్రకారం డబ్బు సంపాదించడం భర్త బాధ్యత అయితే.. డబ్బు సంపాదించినా సంపాదించకపోయినా కుటుంబాన్ని పోషించడం భార్య బాధ్యత. అందుకే ఆ డబ్బు నిర్వహించే విషయంలో భార్య పొదుపు పాటించాలని చాణక్య సూత్రాలు బోధిస్తున్నాయి. భర్తకు తెలియకుండా ఎలాంటి ఖర్చులు చేయకూడదు. భర్త అనుమతి లేకుండా చేసే లావాదేవీల కారణంగా ఇద్దరి మధ్యా మనస్పర్థలు తలెత్తవచ్చు.



Click it and Unblock the Notifications
