Latest Updates
-
ఈ రోజు గురు పౌర్ణమి.. మీ ప్రియమైన గురువులకు ఇలా విషెస్ తెలియజేయండి.! -
సూర్యుని నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి ‘ప్రేమ’ కష్టాలు తప్పవు.! -
పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే గోబీ మసాలా.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మీ అరచేతిలో V ఆకారం ఉందా? 35 ఏళ్ల తర్వాత మీరు ఊహించని విధంగా లైఫ్! -
2030 నాటికి హెపటైటిస్ వైరస్ నిర్మూలనే లక్ష్యం.. కానీ లివర్ ఆరోగ్యానికి ముందున్న సవాళ్లు ఇవే.! -
కాసింత ఘాటుగా, కొంచెం వేడిగా.. ఈ సూప్‌ను రోజుకోసారి తాగారంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.! -
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.! -
మీ బాత్రూమ్లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.! -
రొటీన్ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.! -
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.!
ఈ 4 వ్యక్తులకు మీ ఇంటి గుట్టు అస్సలు చెప్పకండి!
ప్రతి కుటుంబం తమ ఇల్లు ఒక ఆనందాల హరివిల్లుగా ఉండాలని కోరుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, నమ్మకం, ప్రశాంతత ఉండాలని ఆరాటపడుతుంది. కానీ కొన్నిసార్లు ఎలాంటి పెద్ద కారణం లేకుండానే కుటుంబాల్లో మనస్పర్ధలు, కలహాలు మొదలవుతాయి. దీనికి ప్రధాన కారణం.. మనం భావోద్వేగాలకు లోనై మన ఇంటి గుట్టును ఇతరుల ముందు బయటపెట్టడమే.

మనం గుడ్డిగా నమ్మి చెప్పిన విషయాలే రేపు మన కొంప ముంచుతాయి. అందుకే ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో.. కుటుంబ గోప్యతే ఆ కుటుంబానికి ఉండే అతిపెద్ద బలం అని స్పష్టంగా చెప్పారు. ఏవి పంచుకోవాలి, ఏవి దాచుకోవాలి అనేది తెలిస్తేనే ఇంట్లో శాంతి నిలబడుతుంది. చాణక్యుడి ప్రకారం కొందరి వ్యక్తులకు మీ కుటుంబ విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు. వాళ్లు ఎవరనేది ఇక్కడ చూడండి.
ఇతరుల విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడేవారు
కొంతమందికి పక్కవాళ్ల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా ఎక్కువ. వీరు మీ కష్టాలను విని సానుభూతి చూపిస్తున్నట్లు నటిస్తూనే మీ కుటుంబ గుట్టును మెల్లగా లాగుతారు. ఆ తర్వాత ఆ విషయాలకు ఉప్పు, కారం దట్టించి ఊరంతా ప్రచారం చేస్తారు. చాణక్యుడి ప్రకారం ఇలాంటి వారికి మీ ఇంటి సమస్యలు, నిర్ణయాలు పొరపాటున కూడా చెప్పకూడదు. దీనివల్ల మీ పరువు బజారున పడటమే కాకుండా, ఇంట్లో అనవసరపు గొడవలు పెరుగుతాయి.

మీ సంతోషం చూసి ఓర్వలేని అసూయపరులు
మన ఎదుగుదల, కుటుంబ సంతోషం చూసి అందరూ ఆనందించరు. పైకి నవ్వుతూ పలకరించినా, లోపల అసూయతో రగిలిపోయే వారు కొందరుంటారు. సలహాలు ఇచ్చే నెపంతో వీరు మీ కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారు. అసూయపడే వ్యక్తి ఎప్పటికీ నిష్పక్షపాతంగా ఆలోచించలేడని, సరైన సలహా ఇవ్వలేడని చాణక్యుడు హెచ్చరించారు. కనుక ఇలాంటి వారిని ఇంటి వ్యవహారాలకు దూరంగా ఉంచాలి.
కోపిష్టులు, అహంకారులు
కుటుంబ సమస్యలను ఎప్పుడూ ఓర్పు, అవగాహనతో పరిష్కరించుకోవాలి. కానీ, చిన్నదానికే కోపం తెచ్చుకునేవారు లేదా నేను చెప్పిందే వేదం అనుకునే అహంకారుల సలహాలు తీసుకుంటే పరిస్థితి మరింత దిగజారుతుంది. వీరు ఏ సమస్యను పరిష్కరించలేరు సరికదా, రాజీ పడే అవకాశాలను కూడా నాశనం చేస్తారు. కష్టకాలంలో ప్రశాంతంగా, హేతుబద్ధంగా ఆలోచించే వారి సూచనలు మాత్రమే తీసుకోవాలి.
స్వార్థపరులు, ధనాశ ఉన్నవారు
కష్టకాలంలో స్వార్థపరులు ఏమాత్రం పనికిరారు. వీరు తమ అవసరం ఉన్నంత వరకే మీతో అంటిపెట్టుకుని ఉంటారు, పరిస్థితి మారగానే ముఖం చాటేస్తారు. అలాంటి వారికి మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఆస్తుల వివరాలు లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి తెలిస్తే.. కచ్చితంగా వాటిని తమ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తారు. డబ్బు విషయాలు, కీలక నిర్ణయాలు కేవలం నమ్మకస్తులైన కుటుంబ సభ్యుల మధ్యే ఉండాలి.



Click it and Unblock the Notifications