Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
నెలకు రూ.2.8 లక్షల జీతం..పని ఏంటంటే ఇతరుల తరపున 'బ్రేకప్' చెప్పడమే!
ఇంట్లో పైపులు లీక్ అవుతున్నాయా? ప్లంబర్‌ను పిలుస్తాం. వై ఫై పనిచేయడం లేదా? టెక్నీషియన్‌ను ఆశ్రయిస్తాం. మరి ప్రేమించిన వారికి బ్రేకప్ చెప్పాలనుకుంటే? ఆశ్చర్యపోకండి.. ఇప్పుడు దానికీ ఓ నిపుణుడు వచ్చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ "తూ ఝూటీ మై మక్కార్"లో రణబీర్ కపూర్ డబ్బులు తీసుకుని ఇతరుల ప్రేమకథలకు ముగింపు పలికే ఒక విచిత్రమైన పాత్రలో నటించాడు. ఇప్పుడదే కల్పిత కథ నిజ జీవితంలో ఒక కార్పొరేట్ ఉద్యోగంగా మారిపోయింది.

ప్రముఖ అంతర్జాతీయ డేటింగ్ ప్లాట్ ఫామ్.. డేటింగ్.కామ్(Dating.com) ఈ విచిత్రమైన ఉద్యోగాన్ని సృష్టించింది. దీనికి వారు పెట్టిన పేరు చీఫ్ బ్రేకప్ ఆఫీసర్(CBO). వేరొకరి తరపున వారి బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ వద్దకు వెళ్లి, సున్నితంగా బంధాన్ని తెంచేయడమే ఈ ఉద్యోగ ప్రధాన బాధ్యత. ఈ పని చేసినందుకు గాను నెలకు ఏకంగా 3000 డాలర్లు (అంటే మన కరెన్సీలో సుమారు రూ. 2 లక్షల 80 వేలు) జీతంగా ఇస్తారు.
అర్హతలు ఏంటో తెలుసా?
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గర పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అత్యుత్తమ భావోద్వేగ తెలివితేటలు (ఎమోషనల్ ఇంటెలిజెన్స్), ఆధునిక డేటింగ్ వ్యవహారాలపై లోతైన అవగాహన, అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వీటన్నింటికంటే ముఖ్యంగా దరఖాస్తుదారుడికి కనీసం మూడుసార్లు బ్రేకప్ అయిన అనుభవం ఉండాలి. పరిస్థితి తీవ్రతను అంచనా వేసి అది సులభంగా పరిష్కారమయ్యేదా, సంక్లిష్టమైనదా లేక విపత్తులా మారుతుందా అని ముందుగానే గ్రహించి, సరైన పదాలతో సానుభూతితో ఎదుటివారికి బ్రేకప్ విషయాన్ని చెప్పగలగాలి.
అసలు ఈ ఉద్యోగం ఎందుకు పుట్టుకొచ్చింది?
నేటి ఆధునిక కాలంలో దాదాపు 84 శాతం మంది యువత తమ బంధంలో ఘోస్టింగ్(చెప్పాపెట్టకుండా అకస్మాత్తుగా మాట్లాడటం మానేయడం లేదా బ్లాక్ చేయడం) బారిన పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్థాంతరంగా వదిలేయడం కంటే, ఒక ప్రొఫెషనల్ ద్వారా స్పష్టమైన కారణం చెప్పి వీడ్కోలు పలకడం తక్కువ బాధను కలిగిస్తుందన్నది ఈ సంస్థ వాదన.

నిపుణులు ఏమంటున్నారు?
ఈ ఆఫర్ ఆకర్షణీయంగానే ఉన్నప్పటికీ, మానసిక నిపుణులు మరియు సామాజిక శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకప్ అనేది కేవలం ఒక సమాచారాన్ని చేరవేయడం కాదు, అందులో జవాబుదారీతనం ఉంటుంది. తమ భావోద్వేగాలను, బాధ్యతలను ఇలా మూడో వ్యక్తికి అప్పగిస్తే, మనుషులు తమ తప్పుల నుండి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. తద్వారా భవిష్యత్తులోనూ అవే తప్పులు పునరావృతం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు కఠినమైన నిజాన్ని ముఖం మీద చెప్పడానికి భయపడేవారు. కానీ నేడు కనీసం ముఖాముఖి మాట్లాడుకోవడానికి కూడా జంకుతున్నారు. మానవ సంబంధాలు ఇంత యాంత్రికంగా మారిపోవడం ఆందోళనకరం. బ్రేకప్ చెప్పడానికి ఈరోజు అధికారులను నియమించుకుంటున్న మనం.. రేపు ప్రేమను వ్యక్తపరచడానికి కూడా ఏజెంట్లను పెట్టుకునే రోజులు వస్తాయేమో? ఈ ఆధునిక పోకడలు మనల్ని ఎక్కడికి తీసుకువెళతాయో కాలమే సమాధానం చెప్పాలి.



Click it and Unblock the Notifications
