Latest Updates
-
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి -
ఓంకారం జపిస్తే ఏమవుతుంది? శాస్త్రాలు చెప్పిన ఆశ్చరికకర విషయాలు -
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా..
వంశం వర్ధిల్లాలంటే..ఎలాంటి అమ్మాయిని కోడలిగా తేకూడదో తెలుసా? చాగంటి చెప్పిన ఈ విషయాలు
పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తులో లేక రెండు మనసులకో సంబంధించిన విషయం కాదు..రెండు కుటుంబాలకు సంబంధించినది. ఒక ఇంటికి కోడలిగా అడుగుపెట్టే ఆడపిల్ల ఆ వంశానికి దీపంలా వెలుగునిస్తుందని మన సంప్రదాయం చెబుతుంది. అందుకే తమ ఇంటికి రాబోయే కోడలు విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో ప్రముఖ ప్రవచనకర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు తన ప్రవచనాలలో, శాస్త్రాల ఆధారంగా కోడలిని ఎంచుకునేటప్పుడు పరిగణించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించారు.
వంశం, ఆరోగ్యం
శాస్త్రాల ప్రకారం ఒక వంశం ఆరోగ్యంగా, ఆనందంగా వర్ధిల్లాలంటే దానికి పునాది సరైన సంబంధం. ఈ క్రమంలో చాగంటి గారు ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. ఏ వంశంలోనైతే వంశపారంపర్యంగా శ్వేత కుష్టం (ఒక రకమైన చర్మ వ్యాధి) లేదా ఉన్మాదం (మానసిక స్థిరత్వం లేకపోవడం) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆ కుటుంబంలోని అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవడం వల్ల క్షేత్ర దోషం' ఏర్పడుతుందని ఆయన వివరించారు.
దీనివల్ల కొడుకు భవిష్యత్తు, వంశం భవిష్యత్తు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉందని, కాబట్టి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఆయన సూచించారు.

దైవ సంకేతాలు
శాస్త్రం నువ్వు పరిశీలన చెయ్యనవసరం లేకుండానే ఈశ్వరుడు వద్దు అని చెప్తున్నాడు అని చెప్పడానికి కొన్ని సంకేతాలు పెట్టింది. ఈ పిల్లను మనం అడుగుదాం అని వరుడు తండ్రి అమ్మాయి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంటే లేదా ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్లి ఉంటే లేదా ఆ పిల్లకి చాలా విపరీతమైన పురుష స్నేహాలు ఉంటే, విపరీతమైన పొడుగైన రోమాలు ఉంటే, మగపిల్లలతో స్నేహాలు ఎక్కువగా ఉంటే అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలుగా తెచ్చుకోవద్దు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొమ్మని శాస్త్రం చెబుతుంది.
కొన్నిసార్లు మనం పరిశీలన చేయకుండానే, ఆ ఈశ్వరుడే కొన్ని సంకేతాల ద్వారా మనకు మార్గనిర్దేశం చేస్తాడని చాగంటి గారు చెబుతారు. ఈ పిల్లను మనం అడుగుదాం అని వరుడు తండ్రి అమ్మాయి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయి నిద్రపోతూ ఉంటే లేదా ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్లి ఉంటే అంత శుభ సూచకాలు కావని చెప్పారు.
అలాగే ఆ పిల్లకి చాలా విపరీతమైన పురుష స్నేహాలు ఉంటే,శరీరతత్వానికి మించి పొడవైన రోమాలు ఉండటం వంటి లక్షణాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని శాస్త్రం చెబుతుందని చాగంటి తెలిపారు. ఇవి కేవలం భౌతికమైన విషయాలుగా కాకుండా, అంతర్గత సంకేతాలుగా భావించాలని ఆయన ప్రవచన సారాంశం.
అన్నింటికన్నా ముఖ్యం
కేవలం చేసుకోబోయే వాడికి అమ్మాయి నచ్చితే చాలు. అబ్బాయి మనస్సు ఆ అమ్మాయిని చూసి రంజిల్లిందా లేదా అనేదే ముఖ్యం. అమ్మాయి.. అబ్బాయి అమ్మకి, అబ్బాయి నాన్న లేదా వారి ఇతర బంధువులకు నచ్చాల్సిన పనిలేదు. అబ్బాయికి నచ్చకుండా మిగతావారందరికీ నచ్చినా కూడా ఆ అమ్మాయిని ఇంటికి కోడలుగా తెచ్చుకోకూడదని గట్టిగా చెప్పారు. ఎందుకంటే జీవితాంతం కలిసి జీవించాల్సింది వారే కాబట్టి వారి మధ్య ఇష్టమే ఆ బంధానికి బలమైన పునాది అవుతుందని చెప్పారు.



Click it and Unblock the Notifications