Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
నలుగురితో నవ్వుతూ కలిసిపోవాలంటే ఈ 6 ప్రశ్నలు అస్సలు అడగకండి.!
ఫ్యామిలీ, ఫ్రెండ్‌షిప్, పార్ట్‌నర్.. రిలేషన్‌షిప్ ఏదైనా వారితో సంభాషణ అనేది అసలైన పునాదిగా ఉంటుంది. ఆ సంభాషణలో ఏ చిన్నపాటి పొరపాట్లు జరిగినా, అసౌకర్యం ఏర్పడినా ఆ బంధంలో పొరపచ్చాలు రావడం పక్కా.. ఈ క్రమంలో రిలేషన్‌షిప్ కాపాడుకోవడానికి ఎదుటి వ్యక్తిని ఈ ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడగకూడదని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు.

కొందరికి ఎదుటి వ్యక్తిని అడిగేటప్పుడు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేకపోయినా వారిపై ఖచ్చితంగా ఆ మాటలు ప్రభావం చూపిస్తాయి. అవతలి వ్యక్తి సమాధానం చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు. మనస్తాపానికి గురి కావచ్చు. అందుకే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏమి అడగాలి, ఎలాంటి విషయాలు ప్రస్తావించకూడదు.. మీ రిలేషన్‌షిప్‌లో నమ్మకం, గౌరవం కాపాడుకోవాలనుకుంటే అవతలి వ్యక్తి, హద్దులు తెలుసుకోవడం ముఖ్యం. మరి నిపుణుల సలహాలు చూద్దాం..
1. జీతానికి సంబంధించిన విషయాలు..
ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి ఆదాయం గురించి అడిగేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది పూర్తిగా వారి వ్యక్తిగతం. ముఖ్యంగా, స్నేహితులు, సహోద్యోగులు, కొత్త పరిచయస్తులతో కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్న అడగడం దూరాన్ని సృష్టించవచ్చు. వారి అసౌకర్యానికి గురిచేయవచ్చు.
2. పెళ్లెందుకు కాలేదు..
ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. వారి వ్యక్తిగత పరిస్థితులు, ఇష్టాలు, ఆలోచనల కారణంగా పెళ్లి నిర్ణయాన్ని వాయిదా వేయడం చేయవచ్చు. అవేమీ పట్టకుండా కొందరు పెళ్లెప్పుడని అడుగుతుంటారు. ఇది నలుగురిలో వారికి అవమానంగా అనిపించవచ్చు.
3. బ్రేకప్
ప్రేమికులు లేదా భార్యాభర్తలు కొన్ని సందర్భాల్లో విడిపోవచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగతం. నమ్మకస్తులతోనే వారు ఇలాంటి విషయాలు షేర్ చేసుకోగలరు. ఈ క్రమంలో ఎదుటి వ్యక్తిని వారి బ్రేకప్, వ్యక్తిగత గొడవల గురించి పదేపదే అడగడం వారిని మనస్తాపానికి గురిచేస్తుంది. వారంతట వారు మాట్లాడితే తప్ప వారి వ్యక్తిగత విషయాలపై చర్చించకండి.

4. బరువు
ఎదుటి వ్యక్తి రూపం, బరువు గురించి ప్రశ్నలు లేవనెత్తడం వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపిస్తుంది. లావుగా ఉన్నవారిని ఎగతాళి చేయడం, సన్నగా ఉన్నవారిని కించపరచడం, రంగు చూసి వారి గురించి మాట్లాడటం వారిని మానసికంగా దెబ్బతీస్తుంది. ఎదుటి వ్యక్తిలో ఎప్పుడైనా శారీరకంగా కాకుండా వ్యక్తిత్వం చూసి వారిని ప్రశంసించాలి.
5. సంతానం గురించి అడగడం..
ఇటీవలి కాలంలో పెళ్లయిన చాలా మంది దంపతులు ఎదుర్కొనే సమస్య.. 'మీకు ఇంకా పిల్లలు ఎందుకు కాలేదు.’ అని.. ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన విషయం పూర్తిగా వారి వ్యక్తిగతం. ఇలాంటి సున్నితమైన ప్రశ్నలు అడగడం వారిని మనోవేదనకి గురిచేస్తుంది.
6. కెరీర్ విషయాలు
కొందరిని చాలా మంది ఇతరులు సాధించిన విజయాలు, కెరీర్, ఆదాయంతో పోల్చి మాట్లాడతారు. దీని ద్వారా వారికి విలువ ఇస్తారు. పెద్ద స్థాయిలో ఉన్న వారికి ఎక్కువ విలువ ఇస్తూ, వారితో మిమ్మల్ని పోల్చుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మీరు ఈ పనిని ఎందుకు చేయలేకపోయారంటూ విమర్శిస్తారు. వారి కంటే ఎందుకు బాగా చేయలేకపోయారని కించపరుస్తారు. ఇలాంటి ప్రశ్నలు అడిగి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకండి. ఒకరితో రిలేషన్‌షిప్ కాకుండా నలుగురితో నవ్వుతూ ఉండాలంటే వారిని బాధించే, నొప్పించే ప్రశ్నలు అడగకూడదని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications
