Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇలాంటి వారిని ఇంట్లోకి అస్సలు రానివ్వకూడదు.. పొరపాటున రానిచ్చారే, ఖతం.. మీ బతుకు బస్టాండే!
మనిషి అన్నాకా కొన్ని సమస్యలు, కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఎదో ఒక లోపం అనేది ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఆ లోపాలు బయట పడుతూనే ఉంటాయి. కొందరైతే ఎప్పుడూ ఒంటరిగా ఉండాలని అనుకోరు. అలాగే అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ మనలానే అందరికీ మంచి మనసు ఉంటుందని గ్యారెంటీ లేదు. వారిలో ఎదో ఒక కల్మషం ఉండే ఉంటుంది. అలాగే వారు ఎవరినీ పట్టించుకోకుండా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు కూడా. అలాంటి వ్యక్తులను ఇంటికి పిలవకపోవడమే మంచిది.
ఎందుకంటే ఎలాంటి వ్యక్తులు ఎప్పుడూ మనకు చెడు చేయాలనే భావిస్తుంటారట. మనం చెడిపోతే సంతోషించే వాళ్లలో మొదటగా వారే ఉంటారు. మన చుట్టూ ఉన్న వ్యక్తులను బాధపెట్టి, వారు సంతోషపడాలనుకుంటారు. అలాగే మనకు, మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులను ఇబ్బంది పెట్టి.. మనతో వారికున్న అనుబంధాన్ని తుంచేయాలని చూస్తుంటారట. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంటి దగ్గరికి, మన ఇంట్లోకి రానివ్వకూడదని చెబుతుంటారు. ఆ వ్యక్తులకు కొన్ని లక్షణాలు ఉంటాయట. ఆ లక్షణాలు ఏంటి? వారికి ఏ విధమైన పద్దతిలో గుర్తించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అవకాశవాదులు:
కొంతమంది తమ అవసరాల కోసం మన చుట్టూ తిరుగుతారు. వారి అవసరాలు తీర్చుకోవడంలో మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ, ఒక్కసారి అవసరం తీరిన తర్వాత, మన గురించి పట్టించుకోవడం మానేస్తారు. మళ్ళీ మనం అవసరంలో ఉన్నప్పుడు.. వారిని సంప్రదిస్తే వారు కనీసం పట్టించుకోరు కూడా. ఈ రకమైన వారిని మీ జీవితంలో అస్సలు చోటు ఇవ్వకూడదు. వీరితో సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు రావు. అలాగే మన ఇంట్లోకి ఇలాంటి వ్యక్తులను రానిస్తే వారి అవసరాలు తీర్చేసుకొని మనల్ని మోసం చేస్తారు.
చాడీలు చెప్పడం:
కొంతమంది మన ముందు మిన్నగా ప్రవర్తిస్తారు. కానీ మన వెనుక వారు వేరేలా మాట్లాడతారు. ఈ రకమైన వ్యక్తుల నుండి మనం దూరంగా ఉండడం మంచిది. వారు మనం లేని సమయంలో ఏమి మాట్లాడుతారో, మన గురించి ఎలాంటి చాడీలు చెప్తారో తెలియదు. కాబట్టి మీరు అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. వీరితో సంబంధం పెట్టుకోవడం వల్ల ఇంట్లో, ఇతరులతో గొడవలు రావొచ్చు.
నెగటివ్‌గా మాట్లాడేవారు:
మనలో పోజిటివ్ ఆలోచనలు ఉంటే, మనం చేసే పనులు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కొందరు ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు చేయడం, ప్రతిఘటనలు ప్రస్తావించడం చేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కుంగిపోయే వారి మాటలు మన ఉత్సాహాన్ని మొత్తం నాశనం చేస్తాయి. వీరితో మీరు సంబంధం పెట్టుకోకుండా దూరంగా ఉండటం మంచిది. వారిని ఇంటికి రానివ్వకుండా జాగ్రత్త పడండి. లేకుంటే వారు మీ మనోభావాలను దెబ్బతీయవచ్చు.
తప్పులు చేసే వారు:
ప్రతి వ్యక్తి తప్పులు చేస్తాడు, కానీ కొన్ని తప్పులు గ్రహించి, అవి సరిచేయడం మన చేతుల్లో ఉంటుంది. కానీ, కొంతమంది ఎప్పుడూ తప్పులే చేస్తుంటారు, అలా చేసి అందరినీ బాధిస్తుంటారు. ఈ రకమైన వారిని మీ జీవితంలో భాగస్వామ్యం చేయకూడదు. వారు ఎంత తెలివైన వారు అయినా, ఓ రోజు మీ విషయంలో కూడా తప్పు చేస్తారు. అందువల్ల, వీరిని దూరంగా ఉంచడం ఉత్తమం.
ఇతరులను బాధించే వారు:
ప్రతి వ్యక్తిలో ఎదో ఒక చెడు అనేది ఉంటుంది. అయితే కొందరు అదే పనిగా ఇతరులను బాధిస్తూ రాక్షస ఆనందం పొందుతుంటారు. తమ మాటల ద్వారా, చేతల ద్వారా, ఇతరులను కష్టపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంటారు. వీరితో సంబంధం పెట్టుకోవడం అనేది చాలా ప్రమాదకరం. వీరిని ఎంత వీలైతే అంత దూరంగా ఉంచడం మేలు. రకమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం చాలా ప్రమాదకరం. మన ఆరోగ్యం, మనస్సు, ఇంటి శాంతి, మొత్తం జీవితం కూడా ఇలాంటి వారితో ఉండడంవల్ల దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications
