Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Shocking: భార్య మరొకరితో వివాహేతర సంబంధం!..సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పనికి దేశం షాక్
వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాలకు కుటుంబాలే నాశనమైపోతున్నాయి.పెద్దలు నడిపే వివాహేతర సంబంధాలు పిల్లలకు కూడా మరణశాసనంగా మారుతున్నాయి. తమ వివాహేతర సంబంధాలకు అడ్డొస్తున్నారని పిల్లలను చంపడం.. పిల్లలు తన వల్ల కాకుండా తన భార్య మరొకరితో కనిందేమోనన్న అనుమానంతో కొందరు తండ్రులు తమ పిల్లలను హత్య చేసిన ఘటనలు ఇటీవల కాలంలో చాలాచే చూశాం. తాజాగా ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త చేసిన పని దేశాన్ని షాక్ కు గురిచేసింది.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన మూడేళ్ల కొడుకును దారుణంగా హత్య చేశాడు. మహారాష్ట్రలోని పూణేలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..మహారాష్ట్రకు చెందిన మాధవ్ సదురావు టికేటి, స్వరూప భార్యాభర్తలు. వీరికి హిమ్మత్ అనే మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఐఐటీ బెంగళూరు నుండి ఎంటెక్ పట్టా పొందిన మాధవ్ ప్రస్తుతం పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్నాడు.

కొంతకాలం వరకు మాధవ్,స్వరూప దంపతుల కాపురం హాయిగానే సాగింది. అయితే స్వరూప వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతో దంపతులు తరచుగా గొడవపడుతుండేవాళ్లు. తన భార్య వివాహేతర సంబంధం,నిరంతర వైవాహిక కలహాల అనుమానాల కారణంగా మాధవ్ తన సొంత కొడుకు హిమ్మత్ గొంతు కోసి చంపాడు.
ఈ దారుణ హత్య ఎలా జరిగింది?
మార్చి 20వ తేదీ గురువారం మధ్యాహ్నం మాధవ్ తన మూడేళ్ల కొడుకును బైక్‌పై ఎక్కించుకుని బయటకు వెళ్లాడు. అయితే రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన స్వరూప పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లెయింట్ చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు రంగంలోకి దిగారు. మాధవ్ మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేసి అతను పూణేలోని ఓడ్గావ్ షెరి ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసినట్లు గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది.
పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళగానే మాధవ్ తాగిన మత్తులో కనిపించాడు. పిల్లవాడు ఎక్కడున్నాడు అని పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాధవ్ మొదట గందరగోళ సమాధానాలు ఇచ్చాడు. ఇక పోలీసులు తమ స్టైల్ లో విచారించడంతో మాధవ్ నోట్లో నుంచి నిజం బయటకు వచ్చింది. తన కొడుకును తాను చంపినట్లు ఒప్పుకున్నాడు. అతడు చెప్పిన మాటలు విని పోలీసులు కూడా షాక్ అయ్యారు.
పోలీసుల విచారణలో మాధవ్.. తన కొడుకుతో కలిసి పూణేలోని ఏకాంత ప్రాంతానికి వెళ్లానని చెప్పాడు. వెళ్ళే ముందు మాధవ్ ఒక షాపు నుండి కత్తి, డెటాల్, లాలీపాప్స్ కొన్నాడు. తర్వాత ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి ఒకే దెబ్బతో తన కొడుకు గొంతు కోశాడు. కొడుకుని దారుణంగా హత్య చేసిన తర్వాత మాధవ్ షాపుకి తిరిగి వెళ్లి హత్య చేసిన రక్తపు మరకలున్న బట్టల స్థానంలో కొత్త బట్టలు కొన్నాడు. తర్వాత ఓ లాడ్జికి వెళ్లి మద్యం తాగి నిద్రపోయాడు.
హంతకుడు తండ్రి ఎలా పట్టుబడ్డాడు?
మాధవ్ తన కొడుకుని హత్య చేసిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేవు. కానీ దుకాణదారుడు మాధవ్ ను గుర్తించి,హత్యకు ముందు, తరువాత దుకాణాన్ని సందర్శించాడని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతన్ని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు, అక్కడ పిల్లవాడి మృతదేహం కనిపించింది. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం సస్సూన్ జనరల్ హాస్పిటల్ కి పంపినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హిమ్మత్ యాదవ్ తెలిపారు. నిందితుడు మాధవ్ టికేటిపై హత్య కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.



Click it and Unblock the Notifications