Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
మీ గర్ల్‌ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తోందా, మిమ్మల్ని వాడుకుంటుందో ? ఈ ట్రిక్స్ గమనించండి
అమ్మాయి, అబ్బాయిల ప్రేమబంధం గురించి నేటి యువతకు కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. ఇందులో జంటలు ఒకరినొకరు సంతోషపెట్టడానికి దేనికైనా సిద్ధపడతారు. అయితే మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో అనే ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామి మిమ్మల్ని ఉపయోగించుకోవడం లేదని మొదట మీరు అర్థం చేసుకోవాలి.
ప్రేమికులు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు సకాలంలో పట్టించుకోకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది మీ మానసిక స్థితిపై ప్రభావితం చేస్తుంది. మీరు చెడు పనులు చేస్తారు. అలాంటి కొన్ని విషయాలను ఈ రోజు మీకు చెప్పబోతున్నాం. దీని ద్వారా మీ గర్ల్ ఫ్రెండ్ మీతో సమయం గడపడానికి గల కారణాలు మీరు కనిపెట్టడానికి అవకాశం ఉంటుంది.

* మీ ఆస్తులు, మీ డబ్బు గురించి అడగడం
మీ స్నేహితురాలు పదేపదే మీ ఆస్తులు, మీ జీతం గురించి మాట్లాడుతుంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టమని అడిగితే మీరు ఆలోచించలి. మిమ్మల్ని డబ్బు ఆదా చేయమని సలహా ఇస్తే ఆమె మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుందని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మీ గర్ల్ ఫ్రెండ్ మీ జీతం గురించి అడగడం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆమెకు అసలు విషయం స్పష్టంగా వివరించండి. లేదంటే మీరు వెంటనే జాగ్రత్తపడి ఆమెకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండ్ డబ్బు కోసం మాత్రమే మీతో ఉంటున్నదని దీని అర్థం.
* ఇతర అబ్బాయిలతో సరసాలాడటం
మిమ్మల్ని ప్రేమించి మీతో సంబంధంలో ఉంటున్నానని చెప్పిన్నప్పుడు, మీ భాగస్వామి మీ కంటే తెలివైన, మీకంటే అందంగా ఉన్న మీ స్నేహితుడితో లేదా ఎవరైనా అపరిచితుడితో ఆమె సరసాలాడినట్లయితే అది మీ సంబంధానికి ప్రమాదకరం అని మీరు గుర్తించాలి. అలాంటి గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పుడైనా గాలికి విడిచిపెట్టవచ్చు. కాబట్టి మీరు మీ గర్ల్ ఫ్రెండ్ లో అలాంటి ప్రవర్తనను చూసినట్లయితే వెంటనే జాగ్రత్తగా ఉండండి. లేదంటే మీకు మొదటికే మోసం వచ్చి రోడ్డున పడే అవకాశం వస్తుంది.
* ఖరీదైన బహుమతులు డిమాండ్ చేయడం
మీ గర్ల్‌ఫ్రెండ్ ప్రతిదానికీ బహుమతులు డిమాండ్ చేస్తే మీరు ఆలోచించాలి. మీ గర్ల్ ఫ్రెండ్ కు బహుమతులు ఇవ్వకపోతే ఆమెకు కోపం రావడం, ఆ కోపం వెంటనే తగ్గకపోతే ఇవి మీకు మంచి సంకేతాలు కాదు అని మీరు గుర్తించాలి. ఎందుకంటే ఆమె కోపం ఖరీదైన బహుమతిని పొందడం కూడా కావచ్చు. ఆమె ప్రేమ నిజమైతే ఒక సారి కోపం వచ్చిన తర్వాత ఆమె బహుమతులు డిమాండ్ చేయకుండా ప్రేమతో మీతో వెంటనే రాజీపడటానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సంకేతాలు మీరు గమనించండి.
* రెస్టారెంట్లకు వెలుదామని డిమాండ్
మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లాలని డిమాండ్ చేసినా, మీ సమయాన్ని ఎక్కువగా తనతో వెచ్చించాలనే మీకు చెప్పినా, మిమ్మల్ని లంచ్, డిన్నర్‌కు తీసుకెళ్లమని నిరంతరం పట్టుబట్టినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ గర్ల్ ఫ్రెండ్ మీరు సంపాధించే జీతం కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుందని అర్థం. దీని వల్ల మీరు మానసికంగా కూడా బాధపడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కు దూరంగా ఉండటం మీకే మంచిది.
* ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండమని కోరడం
మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని స్నేహితులకు సమయం ఇవ్వకుండా నిరోధించినా, మీ ఇంటి పనులపై సమయాన్ని వెచ్చించకుండా చేసినా, మీ ఇంటి పనులపై డబ్బు ఖర్చు చేయకుండా మిమ్మల్ని నియంత్రిస్తే మీరు కచ్చితంగా ఇక్కడ ఆలోచించాలి. ఇలాంటి విషయాలు మీకు చికాకు కలిగించడం జరుగుతుంది. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ తో మీరు సంబంధాన్ని కొనసాగించకండి. ఆమెతో మీ మనసులో ఉండే విషయం స్పష్టంగా ఆమెకు చెప్పి క్లియర్ గా మాట్లాడండి. వెంటనే మీరు ఆమె విషయంలో సరైన నిర్ణయం తీసుకోండ
* ఆత్మగౌరవం
మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తినా, పదేపదే మిమ్మల్ని అగౌరవపరిచినట్లయితే అది మీ సంబంధానికి మంచిది కాదు. ప్రతి ఒక్కరూ తమ ఆత్మగౌరవం ముఖ్యమని భావిస్తారు. గర్ల్ ఫ్రెండ్ మీ తప్పులను ఒప్పుకోకపోవడం, మీరు తరచూ సారీ చెప్పినా ఆమె మిమ్మల్ని క్షమించకపోవడం, మీ స్నేహితుల ముందు మిమ్మల్ని నిలదీయడం లాంటి సంఘటనలు మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి మీ భాగస్వామి ఇలా ప్రవర్తిస్తుంటే ఆమెకు దూరంగా ఉండండి.
మీ గర్ల్ ఫ్రెండ్ లో ఇలాంటి లక్షణాలు ఉంటే పూర్తిగా ఆలోచించి మీరే సరైన నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తరువాత జీవితాంతం మీరు సుఖపడరు, ఆ అమ్మాయి సుఖపడదు. అన్ని విషయాల్లో ఇద్దరూ రాజీ అయ్యే మనసు ఉంటే కచ్చితంగా మీ జీవితం బాగుటుంది. లేదంటే మీరు ప్రేమికులుగానే విడిపోయి ఎవరిదారి వాళ్లు చూసుకుంటే ఇద్దరి జీవితాలు బాగుంటాయి.



Click it and Unblock the Notifications