Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శృంగారం మంచి వ్యాయామంలా ఉండాలంటే, ఇలా చేయండి
ఆరోగ్యకరమైన, మంచి జీవనశైలి అంటే అందులో తప్పకుండా వ్యాయామం ఉండాల్సిందే. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడానికి జిమ్ కు వెళ్లొచ్చు, ఇంటి పట్టునే వ్యాయామాలు చేయవచ్చు, లేదంటే కష్టపడే పనులు చేసినా శరీరానికి వ్యాయామం అందుతుంది. అయితే సెక్స్ ను చాలా మంది సుఖపడే ఓ సాధనంగా మాత్రమే చూస్తుంటారు. కానీ సెక్స్ వల్ల కూడా ఒంట్లోని కేలరీలు బర్న్ అవుతాయన్న విషయం చాలా మందికి తెలియదు. సెక్స్ చేయడం వల్ల మానసిక, శారీరక ప్రయోజనాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
జిమ్ కి వెళ్లడం, ఇంట్లోనే వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలోని చాలా కేలరీలు బర్న్ చేయవచ్చు. అయితే దీనికి సెక్స్ ను కూడా జోడించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ రతి క్రీడను మంచి వ్యాయామంలా మార్చే ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్ వల్ల కలిగే ప్రయోజనాలు
1. హృదయ స్పందన రేటు పెరుగుతుంది:
ఇతర రకాల కార్డియో వాస్కులర్ లేదా ఏరోబిక్ వ్యాయామాల మాదిరిగా సెక్స్ చేయడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. హృదయ స్పందన రేటు పెరగడం వల్ల గుండె కండరాలు బలపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. రక్త సరఫరా మెరుగుపడి శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
2. కొవ్వు కరుగుతుంది:
సెక్స్ లో పాల్గొనడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఎంత కొవ్వు కరుగుతుంది అనేది అలాంటి భంగిమలో సెక్స్ చేశారు, ఎంత సేపు చేశారు అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. 24 నిమిషాల పాటు సెక్స్ చేస్తే పురుషులు 101 కేలరీలు కరిగించగలరని పలు అధ్యయనాల్లో తేలింది. మహిళల్లో 69 కేలరీలు కరుగుతాయని వెల్లడైంది.
3. మజిల్ ఎంగేజ్‌మెంట్:
శృంగారం శరీరంలోని వివిధ కండరాలను ఎంగేజ్ చేస్తుంది. అయితే ఇది సెక్స్ భంగిమలపై ఆధారపడి ఉంటుంది. కాళ్లు, గ్లూట్స్, ఎగువ శరీర కండరాలపై కూడా పని చేస్తుంది. రెగ్యులర్ గా చేసే సెక్స్ వల్ల కండరాలు టోన్ అవుతాయి. బలపడతాయి.
4. ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక స్థితి మెరుగుదల:
సెక్స్ సమయంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి శరీరానికి మంచి అనుభూతిని కలిగించే హార్మోన్లు. ఇవి మానసికంగా కూడా మంచి ప్రభావం చూపిస్తాయి. సెక్స్ చేస్తున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
5. ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్‌ను మెరుగుపరుస్తుంది:
కొన్ని సెక్స్ పొజిషన్ల వల్ల ఫ్లెక్సిబిలిటీ, బ్యాలెన్స్ మెరుగు పడుతుంది. విభిన్న సెక్స్ పొజిషన్లలో పాల్గొనడం వల్ల రేంజ్ ఆఫ్ మోషన్, ఫ్లెక్సిబిలిటీ, స్టెబిలిటీ మెరుగుపడుతుంది. ఇది కండరాలను సాగదీయడానికి, అలాగే విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications