Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Relationship Tips: అరేంజ్ మ్యారేజ్ అయిందా? కొత్త వ్యక్తితో శృంగారానికి రెడీ అయ్యారా!
శృంగారంలో ముందస్తు అనుభవం ఉన్నా.. లేకున్నా.. కొత్త వ్యక్తితో సన్నిహితంగా మెలగడం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. అలాగే కొత్త కొత్తగా చాలా ఎగ్జైటింగ్‌గా కూడా ఉంటుంది. కొత్త వ్యక్తితో శృంగారం, అందులోనూ సిగ్గు పడకుండా ఎంజాయ్ చేయగలగడం, ఎలా మొదలు పెట్టాలో, ఎలా సంతృప్తి పరచాలో, సుఖ పడాలో ఇలా చాలా ప్రశ్నలు వస్తుంటాయి. పూర్తిగా కొత్త వ్యక్తితో సెక్స్ కొందరికి చాలా ఆనందంగా అనిపిస్తే మరికొందరిని ఆందోళనగా అనిపిస్తుంది.
అరెంజ్ మ్యారేజ్ లో కొత్త వ్యక్తితో శృంగారానికి మానసికంగా ఎలా సన్నద్ధం కావాలి, సెక్స్ ను ఆస్వాదించడానికి ఎమోషనల్ గా ఎలా రెడీ కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ భావాల గురించి చెప్పండి:
పూర్తిగా కొత్త వ్యక్తితో శృంగారం ఆందోళనగా ఉండొచ్చు. ఆ ఆందోళన వల్ల బెడ్రూములో సౌకర్యవంతంగా ఉండలేకపోవచ్చు. ఆందోళన, భయం, బెరుకు, సిగ్గు లాంటి వాటితో సెక్స్ పై కోరికలు రాకపోవచ్చు. అలాంటి సమయంలో భాగస్వామి కోరికగా, ఉద్రేకంగా మీ దగ్గరికి వస్తుంటే మీరు భయంతో బిగుసుకుపోతే శృంగారాన్ని ఎలా ఎంజాయ్ చేయగలరు. ఇబ్బందిగా అనిపిస్తే సెక్స్ లోని మజాను ఆస్వాదించలేరు. అలాగే శారీరకంగా కూడా అసౌకర్యంగా ఉంటుంది. పురుషుల్లో అంగం స్తంభించకపోవడం, మహిళల్లో యోని తడిగా మారకపోవడం వల్ల సంభోగం నొప్పిని కలిగిస్తుంది.
ప్రాధాన్యతల గురించి చెప్పాలి:
ఎవరికైనా కొన్ని చోట్ల తాకితే చిరాకు, కొన్ని చోట్ల తాకితే శృంగార కోరికలు వస్తాయి. వాటి గురించి మొదటి రోజే ఎవరూ కచ్చితంగా తెలుసుకోలేరు. దానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ విషయంలో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే కటువుగా చెప్పకుండా సున్నితంగా, మనసు నొప్పించకుండా చెప్పడానికి ప్రయత్నించాలి.
మూడ్‌లోకి రావడానికి సమయం పడుతుంది:
ఒత్తిడి లేకుండా ఉంటే తప్ప మూడ్ లోకి రావడం కుదరదు. కాబట్టి వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఒత్తిడి, ఆందోళన లేకుండా సౌకర్యవంతంగా ఫీలయ్యేలా చేయాలి. బెరుకుగా అనిపిస్తే అదే విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పాలి.
క్లైమాక్స్ కంటే ఫోర్‌ప్లే చాలా ముఖ్యం:
శృంగారంలో ఎక్కువ సమయం ఫోర్ ప్లేకే కేటాయించాలి. 80 శాతం సమయాన్ని ఫోర్ ప్లేలో వెచ్చించాలి. అదే ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. మూడ్ లోకి రావడానికి లిబిడో పెరగడానికి ఫోర్ ప్లే చాలా కీలకం.
పనితీరు గురించి ఆందోళన వద్దు:
మొదటి రోజే అన్నీ జరిగి పోవాలని అనుకోవద్దు. అలాగే మొదటి రోజు శృంగారంలో అద్భుతమైన పనితీరు కనబరచాలని కూడా అతిగా ఆశించవద్దు. మొదటి రోజు సెక్స్ లో పర్ఫార్మెన్స్ గురించి చింతించవద్దు.



Click it and Unblock the Notifications