Latest Updates
-
క్యాలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ..తోటకూర అలసందల వేపుడు ఇలా చేస్తే అదరహో.. -
కొండలను ఢీకొట్టే శక్తినిచ్చే బార్లీ మిక్స్..ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చిటికెలో -
ఎక్కువ ప్రొటీన్, బోలెడంత ఫైబర్..చుక్క నూనె లేకుండా ఎనకటి తరం హెల్తీ జొన్న ఆవిరి కుడుము చేసుకోండిలా.. -
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ!
మన సంస్కృతిలో ప్రేమకు, కుటుంబ బంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఆడంబరాల వెనుక, మూసిన తలుపుల లోపల ఒక నిశ్శబ్ద భావోద్వేగ అంతరం దాగి ఉందన్న చేదు వాస్తవం ఇప్పుడు బయటపడింది. ఇప్సోస్ (Ipsos) నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వే ఆధునిక భారతీయ సంబంధాల గురించి ఒక ఆసక్తికరమైన, ఆందోళనకరమైన నిజాన్ని వెల్లడించింది.
ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే, భారతీయులు తమ భాగస్వాములతో తక్కువ సంతృప్తితో ఉన్నారట. ప్రేమ జీవితంలో నెరవేర్పు (Love life fulfillment) విషయంలో మన దేశం అట్టడుగు స్థానంలో ఉండటం గమనార్హం.

ప్రేమ ఉంది... కానీ సరిపోవడం లేదా?
ప్రతి ముగ్గురు భారతీయులలో ఇద్దరు తమ జీవిత భాగస్వామితో తమ బంధం ప్రేమతో కూడుకున్నదే అని చెబుతున్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఇది ఎక్కువే అనిపించినా, ప్రపంచ దేశాలతో పోలిస్తే మాత్రం ఈ శాతం చాలా తక్కువ.
భావోద్వేగ అనుబంధం, సాన్నిహిత్యం, రొమాన్స్ ఆధారంగా లెక్కించే లవ్ లైఫ్ సాటిస్ ఫాక్షన్ ఇండెక్స్(Love Life Satisfaction Index) జపాన్, దక్షిణ కొరియా దేశాల సరసన భారతదేశం దిగువన నిలిచింది. ఇదే సమయంలో ప్రతి విషయంలోనూ బలమైన సంతృప్తిని కనబరిచిన థాయ్ లాండ్ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఉరుకులు పరుగుల జీవితం..
ఈ అసంతృప్తికి కారణం నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ప్రేమలో లోపం కాదు, వాస్తవ పరిస్థితుల ప్రభావం. గంటల తరబడి ఆఫీసు పనులు, ఆర్థిక ఒత్తిళ్లు, పిల్లలు-పెద్దల బాధ్యతల మధ్య జంటలు నలిగిపోతున్నారు. కెరీర్ ను, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో భావోద్వేగ ఉనికికి స్థానం లేకుండా పోతోంది.
భార్యాభర్తల బంధం కేవలం బాధ్యతలు పంచుకునే యంత్రాల్లా మారిపోయింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం నేనున్నాను అని చెప్పే తీరిక, ఓపిక నేటి జంటలకు భరించలేని విలాసాలుగా మారిపోయాయి.
శారీరక సాన్నిహిత్యం వేరు..మానసిక అనుబంధం వేరు!
ఈ సర్వేలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉంది. భావోద్వేగపరంగా వెనుకబడిన భారతీయులు, శృంగార, లైంగిక జీవితాల సంతృప్తిలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉన్నారు. శారీరక సాన్నిహిత్యం బాగానే ఉన్నప్పటికీ, భావోద్వేగపరమైన లోటు స్పష్టంగా కనిపిస్తోంది. శారీరకంగా దగ్గరవ్వడం ఎల్లప్పుడూ మానసికంగా ఒకటవ్వడం కాదు అని ఎంతోమంది జంటలు నిశ్శబ్దంగా అంగీకరించే సత్యం ఇది.
డబ్బుతో ప్రేమను కొనగలరా?
ప్రేమకు, డబ్బుకు సంబంధం ఉందా? అంటే కొంతవరకు ఉంది అంటోంది ఈ అధ్యయనం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే అధిక ఆదాయం ఉన్న కుటుంబాలు తమ సంబంధాలలో ఎక్కువ భావోద్వేగ, శృంగార సంతృప్తిని రేట్ చేస్తున్నాయి. ఆర్థిక భద్రత అనేది రోజువారీ ఒత్తిళ్లను తగ్గించి, భాగస్వామిపై ప్రేమను చూపించడానికి, ప్రశాంతతకు స్పేస్ ఇస్తుంది.



Click it and Unblock the Notifications
